Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
ఒక్క చీర ధర అన్ని లక్షలా.. పెళ్ళిలో కీర్తి సురేష్ ధరించిన చీర ప్రత్యేకతలు ఇవే!
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన ప్రియుడు, చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌తో నిన్న హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయంలో రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో, అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా వీరి జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి అత్యంత విశేషమైన పెళ్లిగా నిలిచింది. అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో జరిగిన ఈ పెళ్ళిలో కీర్తి ధరించిన చీర అత్యంత ప్రత్యేకమైనదిగా నిలిచింది.
తన పెళ్ళిలో మడిసార్ చీరను కీర్తి ధరించారు. ఈ చీర యొక్క ప్రత్యేకత ఏంటి? దీని ధర ఎంత ఉంటుంది? ఎక్కడ దీనిని కొనాలి? అలాగే ఈ పెళ్ళిలో కీర్తి సురేష్ ఎలాంటి ఆభరణాలను ధరించారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మడిసార్ చీర ప్రత్యేకత
ఈ చీరను సాధారణ రోజుల్లో ఎవరూ ధరించరు. పెళ్లిళ్లు లేదా ఏదైనా ప్రత్యేకమైన సందర్భాల్లో ఈ చీరను ధరించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ చీర చాలా ఖరీదైనది కూడా. కీర్తి సురేష్ ధరించింది 9 యార్డ్స్ చీర. దీని ధర చాలా ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. మన ఇండియన్ రూపాయల్లో రెండు మూడు లక్షల వరకు ఈ చీర ధర ఉండొచ్చని సమాచారం. తమిళ, తెలుగు, మరాఠి పెళ్ళిలో బ్రాహ్మణ అమ్మాయికి పెళ్లి జరిగిన తరువాత ఈ రకమైన చీర ధరిస్తారని పలువురు చెబుతున్నారు.
అందుకే కీర్తి సురేష్ ఈ రకమైన చీరను ధరించిందని పేర్కొన్నారు. చీరలో కీర్తి సురేష్ అచ్చమైన తెలుగింటి పెళ్లి కూతురిలా కనిపించింది. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె కట్టుకున్న చీర ఆమెకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి.
కీర్తి ఎలాంటి ఆభరణాలు ధరించిందంటే?
ఆర్మ్‌లెట్(వాంగి): కీర్తి సురేష్ తన పెళ్ళిలో వాంగిని ధరించారు. పై చేతి వరకు ఈ ఆభరణాన్ని ధరిస్తారు. ఇది రాచరిక రూపాన్ని పెంచుతుంది.
హారం: కీర్తి సురేష్ తన పెళ్ళిలో పొట్టి, పొడవాటి నెక్లెస్‌లను ధరించారు. ఇది పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఆమెకు మరింత అందాన్ని పెంచింది.
మాంగా టిక్కా: దీనిని నుదుటిపై పెట్టుకుంటారు. నుదుటిపై ఈ ఆభరణాన్ని ధరిస్తారు. ఇది తల నుంచి నుదుటి వరకు ధరిస్తారు. ఇది ముఖాన్ని మరింత అందంగా మారుస్తుంది. అలాగే ప్రత్యేక ఆకర్షణను జోడిస్తుంది.
వడ్డాణం: కీర్తి సురేష్ ఓ ఖరీదైన వడ్డాణాన్ని కూడా ధరించారు. అంతటి ఖరీదైన చీరపై వడ్డాణం వేసుకోవడంతో కీర్తి సురేష్ అందం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో పాటు సూర్య చంద్రుల హారం, ఇతర ఆభరణాలను కూడా ఆమె ధరించారు. కాగా కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను హీరో నాని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.



Click it and Unblock the Notifications