For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రేజీ క్రికెట్ స్టార్స్ కి బీటౌన్ బ్యూటీస్ మధ్య హాట్ లవ్ ఎఫైర్స్

By Swathi
|

సాధారణంగా లవ్ ఎఫైర్స్ అంటే.. చాలా మందికి ఆసక్తి. అందులోనూ పాపులర్ స్టార్స్ లవ్ ఎఫైర్స్ గురించి తెలుసుకోవాలంటే.. ఎక్కడ లేని ఉత్సాహం ఉంటుంది. అది కూడా క్రేజీ క్రికెట్ స్టార్స్, సెక్సీ బాలీవుడ్ స్టార్స్ మధ్య ఉండే ప్రేమాయణం అంటే.. ఎంత ఆసక్తికరంగా ఉంటుందో చెప్పనక్కరలేదు కదూ.. !

ఎక్కువగా సెలబ్రెటీల పెళ్లిళ్లు ఫెయిల్ అవడానికి కారణాలేంటి ? ఎక్కువగా సెలబ్రెటీల పెళ్లిళ్లు ఫెయిల్ అవడానికి కారణాలేంటి ?

గ్లామర్ ప్రపంచానికి, క్రేజీ క్రికెట్ ప్రపంచానికి జోడీ కుదిరితే.. అంతకంటే.. క్యూరియాసిటీ ఏముంటుంది చెప్పండి. మన ఇండియాలో క్రికెట్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా వరకు యూత్ అంతా క్రికెట్ అభిమానులే. అలాగే బాలీవుడ్, సినీ ప్రపంచం అన్నా అంతే క్రేజీగా ఫీలవుతారు. ఈ రెండింటి మధ్య లవ్ ఎఫైర్ కుదిరితే.. ?? ఆహా.. అనిపిస్తుంది కదా. అలాంటి లవ్ స్టోరీస్ నే ఇప్పుడు మీకు రుచి చూపించబోతున్నాం..

పాపులర్ స్టార్స్ నమ్మే సక్సెస్ సెంటిమెంట్ ఏంటో తెలుసా ? పాపులర్ స్టార్స్ నమ్మే సక్సెస్ సెంటిమెంట్ ఏంటో తెలుసా ?

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లవ్ ఎఫైర్ చాలా పాపులర్ అయింది. మరి అలనాటి బ్యూటీ నగ్మా లైఫ్ లో ఉన్న క్రికెట్ స్టార్ ఎవరు ? అలాగే పాపులర్ క్రికెట్ స్టార్ అజారుద్దీన్ ని ఎట్రాక్ట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ ఎవరు ? తెలుసుకోవాలనుందా.. ఇంకెందుకు ఆలస్యం.. కింది స్లైడ్స్ క్లిక్ చేసేయండి.

రవిశాస్త్రి

రవిశాస్త్రి

1985లో మినీ వరల్డ్ కప్ లో అద్భుతమైన పర్ఫామెన్స్ తో రవిశాస్త్రి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలా మంది అమ్మాయిలు రవి శాస్త్రికి ఫిదా అయిపోయారు. అప్పుడు అమ్రితా సింగ్ కూడా బాలీవుడ్ లో స్టార్ డమ్ క్రియేట్ చేసుకుంది. వీళిద్దరూ డేంటింగ్ కూడా చేశారు. కానీ.. చివరికి ఫెయిల్యూర్ అవ్వాల్సి వచ్చింది.

ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

పాపులర్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ జీనత్ ఆమన్ లవ్ స్టోరీ.. అప్పట్లో చాలా పాపులర్. అయితే.. నేషనాలిటీస్ వేరు కావడం కారణంగానో.. మరే ఇతర కారణాల వల్లనో.. వీళ్లిద్దరూ విడిపోవాల్సి వచ్చింది.

మహమ్మద్ అజారుద్దీన్

మహమ్మద్ అజారుద్దీన్

1996లో మహమ్మద్ అజారుద్దీన్, సంగీత బిజ్లానీ మొదటిసారి కలిశారు. ఆ సమయంలో అజారుద్దీన్ సక్సెస్ ఫుల్ కేప్టిన్ గా రాణిస్తున్నారు. అదే సమయంలో సంగీత సక్సెస్ కోసం ఆరాటపడుతూ.. త్రిదేవ్ సినిమాతో విజయం సాధించింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సంగీతాను పెళ్లి చేసుకున్నాడు అజారుద్దీన్. కానీ 14 ఏళ్ల తర్వాత 2010లో వీళిద్దరూ విడిపోయారు.

సౌరవ్ గంగూలి

సౌరవ్ గంగూలి

సౌరవ్ గంగూలి, నగ్మా మధ్య ఎఫైర్ ఉందన్న వార్త ఇప్పటికీ రూమరా.. లేక నిజమా అన్నది క్లారిటీ రాలేదు. సక్సెస్ ఫుల్ కేప్టెన్ గా రాణిస్తున్న సమయంలో గంగూలి తన లక్ష్యంపై ఏకాగ్రత పెట్టడంలేదని.. అతని గర్ల్ ఫ్రెండ్ నగ్మాయే కారణమని.. ఆస్ట్రేలియన్ ప్లేయర్ విమర్శించాడు. కానీ ఇది ఎంతవరకు నిజమనే సంగతి ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్

పాపులర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అప్ కమింగ్ హీరోయిన్ కిమ్ శర్మ లవ్ ఎఫైర్ లో ఉన్నారు. కానీ యువరాజ్ సింగ్ ఫ్యామిలీ.. వీళ్ల ప్రేమను అంగీకరించకపోవడంతో.. వీళిద్దరూ దూరమవ్వాల్సి వచ్చింది.

హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్

హర్బజన్ సింగ్ గీతా బాస్రా పెళ్లి చేసుకోవడానికి అంతా రెడీ అయిపోయింది. చివర్లో హర్భజన్ ఎక్కువగా గౌరవించే వాళ్ల అమ్మ నుంచి తిరస్కారం రావడంతో.. వీళ్ల లవ్ కి శుభం కార్డ్ పడిపోయింది.

రీనా రాయ్, మోహ్సిన్ ఖాన్

రీనా రాయ్, మోహ్సిన్ ఖాన్

ఇండియన్ హీరోయిన్ పాకిస్తాన్ క్రికెటర్ మోహ్సిన్ ఖాన్ ని పెళ్లాడింది. అతను బాలీవుడ్ లో తన లక్ ని సాథీ, బాట్వారా సినిమాలతో పరీక్షించుకున్నాడు. కానీవర్కవుట్ కాలేదు. కొన్నేళ్ల తర్వాత వీళ్ల వివాహ జీవితం విడాకులకు దారితీసింది.

షర్మిలా ఠాగూర్, మాన్సోర్ అలీ ఖాన్

షర్మిలా ఠాగూర్, మాన్సోర్ అలీ ఖాన్

క్రికెట్, బాలీవుడ్ ఫస్ట్ కపుల్ షర్మిలా ఠాగూర్, మన్సోర్ అలీ ఖాన్. అంతేకాదు బాలీవుడ్ లో పాపులర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న సమయంలో, అలీ ఖాన్ ఇండియన్ క్రికెట్ టీ కెప్టెన్ గా రాణిస్తున్న సమయంలో.. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వ్యతిరేకించినా.. వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. అలాగే సక్సెస్ ఫుల్ గా జీవితం ఎంజాయ్ చేశారు. రెండేళ్ల క్రితం అలీ ఖాన్ చనిపోయారు.

అంజు మహేండ్రు, సర్ గ్యారీ సోబర్స్

అంజు మహేండ్రు, సర్ గ్యారీ సోబర్స్

అంజు మహేండ్రు.. క్రికెటర్ సర్ గ్యారీ సోబర్స్ లో ప్రేమలో పడింది. వీళ్లిద్దరూ ప్రేమాయణం నడిపిన తర్వాత.. అంజూ పేరెంట్స్ అంగీకరించలేదు. తర్వాత కొంతకాలానికి వీళిద్దరూ విడిపోయారు.

నీనా గుప్తా, వివెయిన్ రిచర్డ్స్

నీనా గుప్తా, వివెయిన్ రిచర్డ్స్

అప్పట్లో వార్తల్లో షికారు చేసిన ప్రేమికులు నీనా గుప్తా, వివెయిన్ రిచర్డ్స్. కానీ వీళిద్దరూ పెళ్లి చేసుకోకుండా.. ప్రేమికులుగానే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. వీళ్లిద్దరికీ డిజైనర్ మసాబా కూతురు.

జీహీర్ ఖాన్

జీహీర్ ఖాన్

దాదాపు 8 ఏళ్లపాటు జహీర్ ఖాన్, ఇషా శ్రావణి లవ్ లైఫ్ ఎంజాయ్ చేశారు. ఇక త్వరలోనే పెళ్లి భాజాలు మోగుతాయి అనుకుంటున్న టైంలో.. వాళ్ల రిలేషన్ లో ఏం ప్రాబ్లమ్ వచ్చిందో ఏమో.. ఇద్దరూ విడిపోయారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ

బాలీవుడ్, క్రికెట్ లో లేటెస్ట్ హాట్ ఎఫైర్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ. వీళ్లిద్దరూ ఒకసారి యాడ్ ఫిల్మ్ లో నటించి.. క్లోజ్ అయ్యారు. న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్ కోసం అనుష్క శర్మ వెళ్లి విరాట్ కోహ్లీని ఎంగరేజ్ చేసింది.

English summary

Most Popular Bollywood Actresses Love Affairs With Cricketers

Most Popular Bollywood Actresses Love Affairs With Cricketers. Just check out these jodis who are from Bollywood and Cricket and made a rocking pair.
Story first published: Friday, February 26, 2016, 15:59 [IST]
Desktop Bottom Promotion