Just In
- 56 min ago
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- 4 hrs ago
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
- 9 hrs ago
Today Rasi Palalu 28January 2023: ఈ రోజు తులారాశి వారికి అకస్మిక ధనలాభం
- 17 hrs ago
ఈ 5 రాశుల వారు తమ భాగస్వామిని ఎప్పుడూ అనుమానిస్తూనే ఉంటారు..మాటలతో చిత్రహింసలకు గురిచేస్తారు
Navratri 2022 Day 1: నవరాత్రి తొలిరోజు తెలుపు దుస్తుల్లో మల్లె పువ్వులా మెరిసిపోండి
Navratri 2022 Day 1: సెప్టెంబర్ 26 నుండి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం నవరాత్రులకు ఎంతో విశేషం ఉంది. తొమ్మిది రాత్రుల పాటు జరిగే నవరాత్రుల్లో దుర్గమ్మను ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. అలాగే ఈ తొమ్మిది రోజులకు ఒక్కో రోజు ఒక రంగును కేటాయిస్తారు. ఆ రోజు అమ్మవారికి ఆ రంగులోని చీరతో అలంకరిస్తారు.
ఆయా రోజుల్లో ఆ వర్ణాల్లోని దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 26వ తేదీన నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు నుండే నవరాత్రి పూజలు మొదలవుతాయి. ప్రారంభ పూజ, ఘటాస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. అలాగే మొదటి రోజును తెలుపు రంగుకు అంకితం ఇచ్చారు. నవరాత్రుల్లో మొదటి రోజు అనగా సెప్టెంబర్ 26న తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.
మహిళలకు ఆకట్టుకునే వస్త్రాలు తెలుపు చాలానే ఉంటాయి. ఈ నవరాత్రి సందర్భంగా.. ఇక్కడ సూచిస్తున్న డిజైన్లలో తెలుపు వస్త్రాలను ధరించి అటు స్టైల్ గా కనిపించడంతో పాటు సంప్రదాయబద్ధంగానూ ఉండండి.

అలియా భట్
పూర్తి వైట్ కలర్ లో చీరకు అంచున సన్నగా గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బార్డర్ తో చీర అందం రెట్టింపు అయింది. ఇక్కడ అలియా భట్ ఈ చీర పైకి స్లీవ్ లెస్, లో వీనెక్ బ్లౌజ్ ధరించింది. చెవికి హెవీ జుమ్కీలు కొప్పులో తెల్లని పువ్వుతో కనిపిస్తోంది. నుదుటన చిన్న నల్లని స్టిక్కర్, పెదాలపై బోల్డ్ పిల్ షేడ్ ను యాడ్ చేసింది.

సారా అలీ ఖాన్
ఎంబ్రాయిడరీ చేసిన తెల్లటి సూట్ లో సారా మల్లెపువ్వులా అందంగా కనిపిస్తోంది కదూ. మరీ హెవీ దుస్తులు కాకుండా ఇలా చక్కగా సాంప్రదాయబద్ధంగా కనిపించాలంటే మీరు సారా అలీ ఖాన్ ను ఫాలో కావాల్సిందే. 3/4 స్లీవ్స్ పైకి ఫుల్ వైట్ కలర్ చున్నీ జత చేసింది. ఈ మల్లె పువ్వు లాంటి దుస్తుల పైకి కొన్ని ఆక్సిడైజ్డ్ వెండి ఆభరణాలను కూడా జోడించవచ్చు. దానిని సరళంగా మరియు అందంగా ఉంచడానికి లైట్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది.

అనుష్క శర్మ
నవరాత్రి మొదటి రోజున ఫ్యాన్సీగా, సాంప్రదాయబద్ధంగా కనిపించాలనుకుంటే ఇలా కనిపించొచ్చు. అనార్కలీ ఎంబ్రాయిడరీ సూట్ ఎంతో బాగుంటుంది. ఎంతలా అంటే అచ్చంగా అనుష్క శర్మలా. ఈ డ్రెస్ పైకి బరువైన బంగారు జుమ్కాలను జోడించవచ్చు. జుట్టు లూజ్ గా వదిలేసి సొగసుగా కనిపించవచ్చు.

కత్రినా కైఫ్
కత్రినా లాగా మీ లెహెంగా పైన ర్యాప్ టాప్ కలిగి ఉండటం ద్వారా మీ లెహెంగాకు ఆధునిక శైలిని జత చేయవచ్చు. మీరు హెవీ ఐ మేకప్‌ని ఎంచుకోవచ్చు. లైట్ కలర్ లిప్ స్టిక్ చక్కగా సరిపోతుంది. జంక్ అమెరికన్ డైమండ్ ఆభరణాలను జోడించడం ద్వారా మీ అందాన్ని రెట్టింపు చేయవచ్చు.

మృణాల్ ఠాకూర్
వైట్ విత్ బ్లూ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. వైట్ తో చక్కని నీలి రంగు ఎక్సెలెంట్ గా కనిపిస్తుంది. అచ్చంగా మృణాల్ ఠాకూర్ కనిపించినట్లుగా. వైట్ సారీపైకి వైట్, బ్లూ కాంబినేషన్ లో వచ్చిన ఎంబ్రాయిడరీ చాలా చక్కగా ఉంది. దీని పైకి బ్లూ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించింది మృణాల్ ఠాకూర్. మీకు బ్లూ కలర్ నచ్చకపోతే వేరే రంగులను కూడా ట్రై చేయవచ్చు. సూటెడ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ కూడా ధరించవచ్చు.