Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
NTR-Ram Charan: విదేశీ గడ్డపై దేశీ లుక్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ నుండి 'నాటు నాటు' సాంగ్‌కు ఆస్కార్ అవార్డు లభించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో కనిపించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి లుక్స్ పై చర్చ మొదలైంది.
ఆస్కార్ అవార్డుల కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ కొన్ని రోజులుగా అమెరికాలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్నో టీవీ ఇంటర్వ్యూలు, టాక్ షోలు, ఈవెంట్లు, పార్టీలకు అటెండ్ అవుతూ బిజీబిజీగా గడుపుతున్న మనోళ్లు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా వీరిద్దరు మోస్ట్ టాలెంటెడ్ టాలీవుడ్ యాక్టర్స్ స్టైల్ చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే.

అమెరికా గడ్డపై తమ స్టైల్ తో ఇద్దరికి ఇద్దరు అల్లాడిస్తున్నారు. సూట్స్, ఎథినిక్ వేర్ తో కనిపిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ పై ఫ్యాషన్ ప్రియులు కూడా మక్కువ చూపిస్తున్నారు. ఆస్కార్ వేడుకలు జరుగుతున్న వేళ వీరిద్దరూ మరోసారి అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో కనిపించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి లుక్స్ పై చర్చ మొదలైంది.
ఆస్కార్స్ ఈవెంట్ కోసం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఒకే తరహా దుస్తుల్లో కనిపించారు. రామ్ చరణ్ బంద్ గాలా జాకెట్, అసిమెట్రిక్ కుర్తా, స్ట్రెయిట్-ఫిట్టెడ్ ప్యాంట్‌లతో కూడిన త్రీ పీస్ డ్రెస్ ధరించాడు. ఈ ఔట్‌ఫిట్‌ను శంతను & నిఖిల్ కస్టమ్-మేడ్ చేశారు. నికితా జైసింఘని స్టైల్ చేశారు. లెఫ్ట్ సైడ్ పాకెట్ పైన గోల్డ్ కలర్ డిటైలింగ్ వచ్చింది. గోల్డ్ కలర్ బటన్స్ మంచి లుక్ ను అందించాయి. ట్రిమ్డ్ గడ్డం, అదిరిపోయే హెయిర్ స్టైల్ క్యారీ చేశాడు రామ్ చరణ్.
జూనియర్ ఎన్టీఆర్ గౌరవ్ గుప్తా డిజైన్ చేసిన ఔట్‌ఫిట్ ధరించాడు. తారక్ కు అశ్విన్ మావ్లే, హసన్ ఖాన్ స్టైల్ చేశారు. జూనియర్ బంద్‌గాలా కుర్తా వేసుకున్నాడు. ఇందులో లెఫ్ట్ షోల్డర్ పై గోల్డ్ కలర్ లో సింహం బొమ్మ అదిరిపోయే లుక్ ను ఇచ్చింది. మ్యాచింగ్ ప్యాంట్, బ్లాక్ కలర్ బూట్లు అదిరిపోయే లుక్ ను ఇచ్చాయి. రఫ్ గడ్డం, షార్డ్ కర్లీ హెయిర్ తో స్టైల్ పూర్తి చేశాడు.
ఈ ఈవెంట్ కు రాజమౌళి కుర్తా, పంచెతో కనిపించాడు. పర్పుల్ కలర్ కుర్తా పైకి హాఫ్ వైట్ పంచె ధరించి కనిపించాడు.
ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి హాజరయ్యాడు. రామ్ చరణ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో కనిపించగా.. ఉపాసన పెర్ల్ కలర్ శారీలో కనిపించింది.
ఆస్కార్ వేదికపై కాల భైరవా, రాహుల్ సిప్లి గంజ్ ఇద్దరూ కలిసి.. నాటు నాటు పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరు సింగర్స్, కొంత మంది డ్యాన్సర్స్ తో కలిసి నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కు ఆస్కార్ వేదికపై స్టాండింగ్ ఓవేషన్ దక్కింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాటకు ఆస్కార్ దక్కింది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా 'నాటు నాటు' నిలిచింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇదే. ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ దక్కింది. ఏఆర్ రెహమాన్ కు 'జయహో' పాటకు ఆస్కార్ అవార్డు దక్కినప్పటికీ 'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమా హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా.
నాటు నాటు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి పాడారు, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.



Click it and Unblock the Notifications