Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Cannes Film Festival 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన ఇండియన్ స్టార్స్, 2022 లుక్స్ ఇవే..
నిన్న కాక మొన్ననే మెట్ గాలా 2023 ఈవెంట్లో స్టార్స్ తమ అద్భుతమైన ఔట్ ఫిట్లతో అలరించారు. వారి మెస్మరైజింగ్ లుక్స్ ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. అప్పుడే ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ప్రారంభానికి సిద్ధమైంది. మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ఏడాది ఇండియా నుండి పలువురు సెలబ్రిటీలు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొననున్నారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సెంటరాఫ్ అట్రాక్షన్ రెడ్ కార్పెట్ అనే చెప్పాలి. రెడ్ కార్పెట్ పై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీలు తమ అద్భుతమైన డిజైనర్ ఔట్ ఫిట్‌లు ప్రదర్శిస్తుంది. 2023 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొననున్న బాలీవుడ్ సెలబ్రిటీల ఔట్ ఫిట్‌లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలన్న ఆత్రుత చాలా మందికి ఉంటుంది. 2022 లో జరిగిన ఈవెంట్‌లో వాళ్లు ఎలాంటి ఔట్‌ఫిట్‌లలో కనిపించారో తెలుసుకోవడం కూడా థ్రిల్లింగ్ గా ఉంటుంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనగానే గుర్తుకొచ్చే ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా ఈ ఏడాది ఈవెంట్ లో పాల్గొనడానికి సిద్ధమైంది. 2022 లో ఐశ్వర్య అద్భుతమై డ్రెస్సులో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై తన అందాలు ఒలకబోసింది. కస్టమ్ గౌరవ్ గుప్తా కోచర్ గౌనును ధరించింది. దీంతో పాటు డోల్సే & గబ్బానాకు చెందిన ఫ్లవర్ ఔట్‌ఫిట్‌లో అద్భుతంగా కనిపించింది.

2022 లో దీపికా పదుకొణే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ మెంబర్ గా మారింది. ఇందుకోసం తను సవ్యసాచి తీర్చిదిద్దిన బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ శారీ ధరించింది. అలాగే సీక్విన్డ్ బ్లాక్ గౌన్ లో కూడా కనిపించి కనువిందు చేసింది. మరో రోజు దీపికా అబూ జానీ సందీప్ ఖోస్లా రూపొందించి ఆఫ్-వైట్ చీరలో మెస్మరైజ్ చేసింది.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బ్లాక్ కలర్ షైనింగ్ యానినా కౌచర్ గౌనులో కనిపించింది. నెక్‌లైన్, సైడ్ స్లిట్‌తో ఆకట్టుకుంది. అద్భుతమైన ఇయర్ రింగ్స్ తో స్టైల్‌ను క్యారీ చేసింది.

టాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే 2022 ఫిల్మ్ ఫెస్టివల్ లో పింక్ కలర్ భారీ గౌనులో దర్శనమిచ్చింది. లెబనీస్ ఫ్యాషన్ డిజైనర్, గెయన్నా యూనెస్ తీర్చిదిద్దిన గౌనులో కనిపించి ఆకట్టుకుంది.

ఇంటర్నేషనల్ ఏస్ డిజైనర్ టోనీ వార్డ్ కోచర్ తీర్చిదిద్దిన వైట్ కలర్ గౌనులో ఊర్వశి రౌటేలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అందరి చూపును తన వైపు తిప్పుకుంది.



Click it and Unblock the Notifications