Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అబ్బాయిలు మీకోసమే.. బట్టలను ఉతకకుండా వేసుకుంటున్నారా? అయితే మీ పని ఖతం!
కొత్త దుస్తులు కొనుక్కున్నప్పుడు అవి తళతళా మెరుస్తూ కనిపిస్తుంటాయి. దీంతో చాలా మందికి వాటిని అప్పుడే వేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఎప్పుడెప్పుడు వేసుకుందామా? ఎప్పుడెప్పుడు స్టైల్ కొడదామా అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటిని మనం కొనే ముందు అవి ఎంతో మంది చేతులు మారి వస్తుంటాయి. తయారీ దారుడి నుంచి కొనుగోలు చేసే వారి వరకు ఆ బట్టలు చేతులు మారుతూ, ఎంతో మంది స్పర్శలతో నిండి ఉంటుంది.
ఈ క్రమంలో వాటిపై కచ్చితంగా కొన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాలు ఉండే ఉంటాయి. COVID-19 మరియు ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియాలు సాధారణంగా మన చేతులు, శరీరంపై ఉంటాయి. అలాంటి వైరస్ కలిగిన వ్యక్తులు దుస్తులను తాకితే బట్టలపై ఆ వైరస్ ఉండిపోతాయి. క్రమంగా అవి కొనుగోలు దారుడి వద్దకు చేరే ప్రమాదం ఉంటుంది.

దీంతో పాటు కొత్త దుస్తుల్లో ఎక్కువగా కలర్స్ వాడుతుంటారు. అవి అందంగా కనిపించడానికి కొన్ని అందమైన, కలర్స్ భారీగా ఉంటాయి. వాటిని నేరుగా వేసుకోవడం వలన కచ్చితంగా దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త బట్టలను ఎప్పుడూ నేరుగా వేసుకోకూడదు. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తరువాతే వేసుకోవాలి. కొత్త బట్టలు వేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొత్త బట్టలు వేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దుస్తులపై ఉన్న ట్యాగ్‌లను తొలగించండి.
దుస్తులను లోపలి వైపుగా తిప్పండి.
ఒకే రంగు ఉన్న బట్టలను మాత్రమే కలిపి ఉతకండి, మొదటిసారి ఉతికేటప్పుడు రంగులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
దుస్తులపై ఉన్న లేబుల్‌ను చూసి, ఉతకడానికి సూచించిన విధానాన్ని పాటించండి.
వాషింగ్ మెషిన్ లేదా చేతులతో ఉతికేటప్పుడు, లేబల్‌పై సూచించిన విధంగా సెట్టింగ్స్‌ను ఉపయోగించండి.
రసాయనాలు తొలగించేందుకు, ½ కప్పు బేకింగ్ సోడా వేయండి.
దుస్తులను కనీసం 45 నిమిషాలు ఎండలో ఆరబెట్టండి లేదా నేరుగా ఉంచండి.
సమయం లేకపోతే, వేడి నీటిలో కనీసం 45 నిమిషాల పాటు కడిగి, ఆరబెట్టడం వల్ల క్రిములు తొలగిపోతాయి.
కొన్ని దుస్తులు ఉతకలేమనుకుంటే, పాటించాల్సిన ప్రత్యామ్నాయాలు:
తోలు దుస్తుల కోసం క్లాత్‌పై ఆల్కహాల్ ఉపయోగించి తుడవండి.
దుస్తులను ఎండలో వేలాడదీయండి. UV కిరణాలు సహజంగా రసాయనాలను పీల్చేస్తాయి.
దుస్తులను డ్రైయర్‌లో కనీసం 45 నిమిషాలపాటు వేడిలో వేయండి.
కొత్త దుస్తులను ధరించడం ముందు వాటిని ఉతకడం అత్యంత ముఖ్యం. అవి క్రిములు మరియు రసాయనాలను కలిగి ఉండవచ్చు, వాటి వల్ల చర్మానికి కూడా హాని జరగవచ్చు. అందుకే దుస్తులను ధరించేముందు తప్పనిసరిగా వాటిని ఉతకడం ముఖ్యం.



Click it and Unblock the Notifications