Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Diwali 2024: ఈ దీపావళి ఆడవారికి ఈ డ్రెస్‌లు బాగుంటాయి.. మగవారు ఇవి ట్రై చేస్తే అదిరిపోద్ది!
రంగురంగులుగా మెరిసిపోవాల్సిన దీపావళి పండగ వచ్చేసింది. పట్టుమని ఇంకో పది రోజులు కూడా లేవు. పండుగ అక్టోబర్ 31న లేదా నవంబర్ 1వ తేదీన జరిగినా అందుకు మనం సిద్ధంగా ఉండాల్సిందే. ఆలోపు షాపింగ్ చేసేయాల్సిందే. ఎందుకంటే మనం చేసే షాపింగ్ లూజ్ అయినా, ఫిట్ సరిగా లేకపోయినా ఆలోపు మనం ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. పండగ సమయానికి అన్ని సిద్ధం చేసుకొని రెడీగా ఉండొచ్చు.
ఈ దీపావళికి ట్రెడిషనల్‌గానూ అదే సమయంలో ట్రెండిగానూ ఉంటే చాలా మంచిది. అలాంటి దుస్తులు వేసుకోవడం వల్ల పండగ ఆచారం పాటించడంతో పాటు ట్రెండీగా కూడా కనపడొచ్చు. అందుకే మీకోసం ఈ పండగకు ఎలాంటి దుస్తులు ఎంచుకోవాలో, ఏవి ఎంచుకుంటే బాగా సెట్ అవుతాయో కింద ఇవ్వడం జరిగింది, అవేంటో ఓసారి చూసేద్దాం రండి.

ముందుగా ఆడవారికి..
చీరలు:
పండగ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది చీర. ఆడవాళ్లు సైతం తమ ప్రధాన ఎంపిక చీరనే సెలెక్ట్ చేసుకుంటారు. అయితే ఈ పండగకు మీరు జార్జెట్, సిల్క్, ఆర్గాంజా చీరలను కట్టుకోవచ్చు. వీటికి ట్రెండీ బ్లౌజులతో మ్యాచ్ అప్ చేసి ట్రెండీగా అదే సమయంలో ట్రెడిషనల్‌గా కనిపించొచ్చు. లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించుకొని ధరించుకోవచ్చు.
అనార్కలి డ్రెస్సెస్:
చాలామంది అమ్మాయిలు తాము ట్రెండీగా అందంగా కనిపించేందుకు చేసుకునే మొదటి ఎంపిక ఈ అనార్కలి డ్రెస్సులు. ఇది చాలా అనుకూలంగా ఉండడంతో పాటు ట్రెండీగా కనిపిస్తాయి. చూడడానికి కూడా చాలా అందంగా దర్శనమిస్తాయి. కాబట్టి ఈ దీపావళి సమయంలో ఈ డ్రెస్సులను తీసుకోవం మంచి ఎంపిక అవుతుంది.
లెహెంగా:
లెహెంగా ఇది కచ్చితంగా షాపింగ్ లిస్ట్‌లో ఉండాల్సిన డ్రెస్. మంచి మిర్రర్ స్టోన్స్ డిజైన్‌తో ఉండే లెహెంగాను ఈ దీపావళికి తీసుకోండి. ఇది పండగ శోభను రెట్టింపు చేయడంతో పాటు డ్యాన్స్ చేయడానికి, అందంగా కనిపించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఈ లెహెంగాను ధరిస్తే అందరి చూపు మీపైన ఉండాల్సిందే.
పలాజో:
ఈ దీపావళికి చాలా కంఫర్ట్‌గా, స్టైలిష్‌గా, సాధారణంగా ఉండాలని అనుకునేవారికి ఇది అనువైన ఎంపిక. ఈ డ్రెస్ మంచి లుక్ ఇవ్వడంతో పాటు.. మిమ్మల్ని ఎలేవేట్ చేస్తుంది. పైగా పండగ ముగిసిన తరువాత కూడా వీటిని ధరించొచ్చు.
ఇప్పుడు మగవారి కోసం..
కుర్తా పైజామా:
మగవారు ఎప్పుడూ ప్యాంటు, షర్ట్ ధరిస్తూ ఉంటారు. అయితే ఈ దీపావళి నాడు కుర్తా, పైజామా ధరిస్తే పండగ శోభ ఉట్టిపడుతుంది. అలాగే ఇవి చాలా కంఫర్ట్‌గా, ట్రెడిషనల్‌గా, ట్రెండీగా కనిపిస్తాయి. కాబట్టి ఈ పండగకు మగవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
షేర్వాణీ:
ఈ దీపావళి రోజు మీరు గ్రాండ్‌గా రిచ్‌గా కనిపించాలంటే షేర్వాణీలు ట్రై చేయొచ్చు. ఇవి కంఫర్ట్‌గా ఉంటూనే మంచి లుక్‌ని ఇస్తాయి. అలాగే రిచ్‌గా పండగ చేసుకున్న అనుభూతిని కలిగిస్తుంది.
వీటితో పాటు మీకు ఇష్టమైన, మీకు సెట్ అయ్యే విధంగా ఉండే దుస్తులను కూడా మీరు ఎంచుకోవచ్చు. మేము ఇక్కడ కొన్ని ట్రెండీ సెలెక్షన్స్‌ను మాత్రమే మీకు అందించాము.



Click it and Unblock the Notifications