For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గాపూజ 2017 సమయంలో ఉపయోగపడే 5 రకాల ఫ్యాషన్ ఆభరణాలు

|

ఇతర ఉత్సవాలలాగానే,దసరా ఉత్సవాలకి వేసుకునే బట్టలు ప్రత్యేకంగా ఉండి అన్నిరకాల ఆభరణాలకి నప్పవు. దసరా లేదా మరేదన్నా పండగ అనే కాదు, ప్రతిసారి స్టైలిష్ గా ఉండటం అవసరమే కానీ చిన్న చిన్న ఫ్యాషన్ తప్పులు చేసి అభాసుపాలవ్వకండి.

బెంగాలీలు ప్రత్యేకంగా దుర్గాపూజకి స్టైల్ గా, ఏడాదిలో అన్నిరోజులకన్నా అందంగా కన్పడాలని తయారవుతారు.

బట్టలేకాదు, వాటికి సరిపోయే సరైన ఆభరణాలు ధరించడం కూడా ముఖ్యమే.

durga puja

సాంప్రదాయ నగలేకాక, ఈ కృత్రిమ ఫ్యాషన్ ఆభరణాలు కొత్త ట్రెండ్. ఇవి ట్రెండ్లో ఉండటమేకాక, సులభంగా పట్టుకోవచ్చు, చవకగా ముఖ్యంగా దొంగతనం భయంలేకుండా ధరించవచ్చు.

మీ ఎంపిక సులభంగా ఉండేలా, మీకోసం ట్రెండ్లో ఉన్న ఆభరణాలని, వాటికి సరిపోయే బట్టల గురించి మీకు సమాచారం అందిస్తున్నాం. చదవండి.

అఫ్ఘానీ ఆభరణాలు

అఫ్ఘానీ ఆభరణాలు

ఈ సంవత్సరం దసరాకి అన్నిటికన్నా ప్రాచుర్యంలో ఉన్న ఫ్యాషన్ ఆభరణ రకం ఇది. ఇది చాలా వైవిధ్యతతో ఉండే రకం కూడా. దీన్ని సాంప్రదాయ, ఆధునిక దుస్తులు రెండింటిపైనా వేసుకోవచ్చు. హుందాగా ఉండి, మరీ బరువు కూడా ఏం ఉండదు. ఈ పూజల వాతావరణంలో ఇది తప్పక కొనాల్సిన రకం.

గిరిజన ఆభరణాలు

గిరిజన ఆభరణాలు

ఏ బెంగాలీకైనా గిరిజన ఆభరణాలంటే ప్రాణం. బొహీమియన్ లేదా శాంతినికేతన్ స్టైల్ లో తయారవ్వాలనుకున్నప్పుడు వారు ఈ ఫ్యాషన్ ఆభరణాలను ఎంచుకుంటారు. టాగోర్ రచనలపై చేసే కళాఉత్సవాలకి ప్రత్యేకంగా ఈ శాంతినికేతన్ స్టైల్ ను అనుసరిస్తారు.

చాలామంది బెంగాలీ స్త్రీలు ఈ శాంతినికేతన్ లేదా రబీంద్రిక్ స్టైల్ ను అనుసరిస్తారు. దసరాల్లో అందరికీ ఎంతో నచ్చే ట్రెండ్ ఇది.

టెర్రకోట ఆభరణాలు

టెర్రకోట ఆభరణాలు

టెర్రకోట కళ బెంగాలీ సాంప్రదాయ రూపం. దీనిద్వారా తయారుకాబడే ఆభరణాలు, వస్తువులు కాల్చిన మట్టితో తయారవుతాయి. ఈ కళారూపం కన్నులవిందుగా మాత్రమే కాదు, అక్కడ స్త్రీలు ఎంతో ఇష్టంగా టెర్రకోట ఆభరణాలను కూడా ధరిస్తారు. ఈ ఏడాది దుర్గాపూజ సమయంలో ఇవి కూడా ప్రముఖస్థానం వహిస్తాయి.

ఎవరైనా వారి బొహీమియన్ లేదా సాంప్రదాయ లుక్ లకి ఈ ఆభరణాలను సులువుగా జతచేయవచ్చు. రంగురంగుల్లో అందంగా మెరిసిపోతాయి.

డోక్రా ఆభరణాలు

డోక్రా ఆభరణాలు

బెంగాల్ కి చెందిన మరో గిరిజన కళారూపం డోక్రా లేదా ఢోక్రా కళ.ఈ డోక్రా నగలను ముఖ్యంగా బెంగాలీ సాంప్రదాయ కంసాలి జాతి - ఢోక్రా దామర్ గిరిజన జాతులవారు ధరిస్తారు.

డోక్రా ఫ్యాషన్ ఆభరణాలు చీరలు, స్కర్టులు లేదా సల్వార్ లపై ఎంతో బావుంటాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాలలో ఇవి వేసుకోపోతే మీ పండగ పూర్తవ్వదు.

ఈకల నగలు

ఈకల నగలు

అస్సలు బరువులేకుండా, అనేకరంగుల్లో వచ్చే ఈ రకపు ఫ్యాషన్ నగలంటే అందరికీ ఎంతో ఇష్టం. మిగతాదంతా డల్ గా కన్పిస్తున్న లుక్ ను కూడా ఈ ఈకల ఆభరణాలు మార్చేసి రంగులు అద్దుతాయి. అన్ని వయస్సులకి చెందిన మహిళలు, సాంప్రదాయ, ఆధునిక బట్టలపై వీటిని వేసుకోవచ్చు.

English summary

5 Types Of Junk Jewellery To Go For During Durga Puja 2017 |దుర్గాపూజ 2017 రోల్డ్ గోల్డ్ ఆభరణాలు |దుర్గాపూజ ఆభరణాలు

As outfits are necessary, it is also mandatory to match them with the correct jewellery.
Desktop Bottom Promotion