TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
మెట్ “గాల” 2018 గురించి మీకు తెలీని ఆసక్తికరమైన విషయాలు
మెట్ “గల” 2018 గురించి మీకు తెలీని ఆసక్తికరమైన విషయాలు :
త్వరలో అతివేగంగా “మెట్ గల 2018” ఈవెంట్ జరగనుంది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఈ ప్రత్యేకమైన ఫాషన్ ఈవెంట్ వివరాలు ప్రత్యేకంగా మీకోసం.
ఈ కార్యక్రమాన్ని ముద్దుగా “ ఫాషన్ ఆస్కార్స్ ” అని కూడా పిలుస్తాము. ప్రతి సంవత్సరమూ జరిగే ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్, మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్, న్యూయార్క్ కోసం నిధుల సేకరణకై జరుపబడుతుంది. మరియు ఈ కార్యక్రమం కూడా న్యూయార్క్ లో జరుపుతారు. మొదటగా 1946 న మొదలు పెట్టిన ఈ “ గల ” కార్యక్రమo, కాలక్రమేణా అందరికీ ప్రియమైన ఫాషన్ పార్టీ ఆఫ్ యియర్ గా మారింది.
1995 నుండి ఈ కార్యక్రమాన్ని అమెరికా వోగ్ సంపాదకులైన “ అన్నా విన్టోర్ ” అధ్యక్షత వహిస్తూ వస్తున్నారు. వీరు ప్రముఖ సెలెబ్రిటీలను కార్యక్రమానికి సహ -ప్రాతినిధ్యం వహించేలా భాద్యత తీసుకుంటారు. గత సంవత్సరాలలో బియోన్సే , టేలర్ స్విఫ్ట్, కేటి పెర్రీ మరియు మార్క్ జాకబ్స్ వంటి ప్రముఖులు సహాద్యక్ష భాద్యతలు తీసుకుని ఉన్నారు. ఈవెంట్ యొక్క 70 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ “ ది మెట్ గాలా 2018 ” విశేషంగా రానుంది. ఈవంతు కార్యక్రమంలో అమాల్ క్లూనీ, రిహాన్న మరియు డోనాటెల్లా వెర్సెస్ సహ అధ్యక్షులుగా వ్యవహరిoచబోతున్నారు.
మెట్ గల ప్రతి సంవత్సరం మే మొదటి సోమవారం జరుగుతుంది, ఈ సంవత్సరం మే 7 న వస్తుంది. ఇందులో రెడ్ కార్పెట్ కవరేజ్ సుమారుగా సాయంత్రం 7 గంటల స్థానిక సమయం నుండి ప్రారంభమవనుంది. యునైటెడ్ కింగ్డం లో వీక్షకులు వోగ్ యొక్క కవరేజ్ను వేకువజామున ఒంటి గంట(గ్రీనిచ్ కాలమానం ప్రకారం) నుండి అనుసరించవచ్చు.
మెట్ గల న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆర్ట్ లో జరుగుతుంది. రాత్రి కాక్టైల్ గంటతో మొదలవుతుంది. దీనిలో అతిథులు రెడ్ కార్పెట్ మీదుగా ప్రదర్శనగా నడిచి, విందుకి సిద్దమవుతారు. ఈ సంవత్సరం 3 ప్రదేశాలలో ఈ కార్యక్రమం జరగనుంది. అవి వరుసగా అన్నా విన్టూర్ కాస్ట్యూమ్ సెంటర్, మెట్ ప్రధాన స్థానం లోని ది మెడీవల్ గాలరీస్ మరియు క్లోయిస్టర్స్.
ఈ ప్రఖ్యాత కార్యక్రమంలో అనేకమంది ఫాషన్ ప్రపంచంలో ప్రభావితం చేయగల సెలేబ్రిటీలు పాల్గొననున్నారు. జరిగే ప్రతి అంశం అన్నా విన్టూర్ కనుసన్నలలోనే జరుగుతుంది. కావున ఎవరు కూడా అన్నాను తప్పుగా ప్రభావితం చేయలేరు. ఎటువంటి అంశంలో అయినా తుది నిర్ణయం తీసుకునే అధికారం అన్నా విన్టూర్ కి ఉంటుంది.
గొప్ప సెలెబ్రిటీస్ అయిన రాచెల్ జో, క్రిస్ జెన్నర్ వంటి వారు కూడా అన్నా విన్టూర్ చేతిలో తిరస్కరణకు గురై ఉన్నారు. కాని మరో పక్క, అన్నే హాత్వే, జెన్నిఫర్ లోపెజ్, సారా జెస్సికా పార్కర్, బియాన్సే వంటి సెలెబ్రిటీస్ క్రమంగా అన్నాను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సారి జరిగే మెట్ గల 2018 లో కూడా తమ ప్రతిభను కొనసాగించనున్నారు.
మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆలోచిస్తున్నారా ? 1) మీరు కూడా పాల్గొనవచ్చు, కానీ 5,00,000 డాలర్లు ఒక టేబుల్ రిజర్వేషన్ కై వెచ్చించవలసి ఉంటుంది. 2)ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ సెలెబ్రిటీ అయి ఉండాలి 3) పై రెండు మీకు సరిపోయినా కూడా, మీరు ఆహ్వానించబడక పోవచ్చు. నిధుల సేకరణ కమిటీ లిస్టులో మీరు ప్రముఖంగా ఉన్న వారైనా కూడా మీ టికెట్టుకు నో చెప్పే అవకాశాలు ఉన్నాయి.
ఈ విషయంలో అన్నా అనేక ఆంక్షలను సూచిస్తుంది. తద్వారా లిస్టులో ఉన్నా కూడా తిరస్కరింపబడే అవకాశాలు లేకపోలేదు. ఈ కార్యక్రమంలో సేల్ఫీస్, మరియు సెల్ ఫోన్లు కూడా నిషేదింపబడినవి. తద్వారా మీడియా రాక అంటే హాస్యాస్పదమే. హృదయ పూర్వక మనసుని కలిగి ఒకరితో ఒకరి సంభాషణలు కలిగి ఉండాలని అన్నా భావన.
ఒక్కసారి ఈ ఇన్విటేషన్ లిస్టులో పేరు నమోదు అయితే, ఆ సెలెబ్రిటీ ఖచ్చితంగా “గల” నియమ నిభందనలకు తలొగ్గి ప్రవర్తిoచాల్సిందే. ఈ నిబంధనలన్నీ ఇన్స్టిట్యూట్ లో కూడా అమలు లో ఉంటాయి. ఈ లిస్టులో ఉన్న సెలెబ్రిటీలు, ఆ నిబంధనలకు అనుగుణంగా అవాంట్ – గార్డె దుస్తులను ధరించవలసి ఉంటుంది కూడా. తద్వారా విలక్షణమైన దుస్తులకు వేదికగా ఉంటుంది. గత సంవత్సరం, రీకవాకుబో/ కొమ్మే డెస్ గార్సన్స్ , టుక్సేడో స్టైల్ రాల్ఫ్ లారెన్ దుస్తులు అదరగొట్టాయి. ఈ సంవత్సరం కూడా “హెవెన్లీ బాడీస్ : ఫాషన్ మరియు కాథలిక్ ఇమాజినేషన్” అనే సరికొత్త నేపద్యంతో ముందుకు రానున్నది.
ఈ నేపద్యాన్ని అనుసరించి, ఫాషన్ మరియు మతపరమైన అంశాల మేళవింపుగా ఈ కళ ఉండనుందని తెలుస్తుంది. వాటికన్ కూడా ప్రదర్శన కోసం సుమారు 40 అరుదైన వస్తువులను తీసుకుని రానుంది.
ఏది ఏమైనా ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏదైనా ఉంది అంటే, సెలేబ్రిటీలు ఎటువంటి ఆటలను ఆడబోతున్నారు అని. ఇవి కాంట్రవర్సీలకు కేంద్రబిందువు కాబోతున్నాయని మన ఊహకు కూడా అందే విషయమే. మేము కూడా మీలాగే ఎంతో కుతూహలంగా ఉన్నాం, ఈ ఫైటింగ్ డే కోసం.
ఈ కార్యక్రమాన్ని నేరుగా వీక్షించే అవకాశo కూడా ప్రేక్షకులకు లేదు. దీనికి కారణం ఎటువంటి మీడియాను అంగీకరించరు కాబట్టి. కానీ మేము మాత్రం ఎప్పటికప్పుడు ఇటువంటి ఆసక్తి కలిగించే అంశాల గురించిన వివరాలు అందిస్తూనే ఉంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని క్రమం తప్పకుండా అనుసరించండి.