For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

18 ఏళ్ల వయస్సులో వెండెల్, అనుష్క కలిసి ముంబైకి ఎందుకు వెళ్లారంటే...

తనతో కలిసి 18 ఏళ్ల వయసులోనే ముంబైకి వచ్చినట్లు పాత రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యింది.

|

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, రచయిత, పర్యావరణ వేత్త మరియు స్వలింగ సంపర్కుల హక్కుల తరపు న్యాయవాది, వెండెల్ రోడ్రిక్స్ ఫిబ్రవరి 12వ తేదీన గోవాలోని తన ఇంట్లో కన్నుమూశారు. పద్మ శ్రీ అవార్డు గ్రహీత ఈయన 1960 మే 28న జన్మించారు. ఈయన ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ లో ఎదుగుతున్న సమయంలోనే కొన్ని చిత్రాల్లో కూడా నటించారు.

బాలీవుడ్ 2003లొ బూమ్, 2008లో ఫ్యాషన్ సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించాడు. అంతేకాదు చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లకు ఆయన తన ఫ్యాషన్ లైఫ్ ఇచ్చేవాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు అతనే లైఫ్ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క శర్మనే వెల్లడించింది.

తనతో కలిసి 18 ఏళ్ల వయసులోనే ముంబైకి వచ్చినట్లు పాత రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యింది. ఈ సందర్భంగా తన వెండెల్ రోడ్రిక్స్ పార్థివ దేహానికి నివాళి అర్పించింది. తనకు ఫ్యాషన్ పరంగా లైఫ్ ఇచ్చిన నా గాడ్ ఫాదర్ ఈ లోకం విడిచిపోయినందుకు తనకు ఎంతగానో బాధపడింది...

ఫ్యాషన్ ఫ్యాక్టర్ లో బంగారు బొమ్మలా మారిపోయిన సోనమ్ కపూర్...ఫ్యాషన్ ఫ్యాక్టర్ లో బంగారు బొమ్మలా మారిపోయిన సోనమ్ కపూర్...

ఇన్ స్టాగ్రామ్ లో..

ఇన్ స్టాగ్రామ్ లో..

తను మోడలింగ్ కోసం బెంగళూరు నుండి ముంబైకి ధైర్యంగా రావడానికి వెండెల్ రోడ్రిక్స్ ప్రధాన కారణమని చెప్పింది. ఈ సందర్భంగా ఆ ప్రముఖ డిజైనర్ తో కలిసి ర్యాంపులో నడుస్తున్న ఫొటోను షేర్ చేసింది. తన పోస్ట్ తో ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చింది.

అద్భుతమైన డిజైనర్..

అద్భుతమైన డిజైనర్..

వెండెల్ రోడ్రిక్స్ ఫ్యాషన్ లో ‘‘అత్యంత ఐకానిక్ మరియు ఒరిజినల్ డిజైనర్లలో ఒకరు‘‘ అని కితాబు ఇచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలతో తను ఆ డిజైనర్ కు ప్రగాఢ సంతాపం తెలిపింది.

PC : Insta

ఆ సమయంలో న్యూజిలాండ్ లో..

ఆ సమయంలో న్యూజిలాండ్ లో..

‘‘వెండెల్ రోడ్రిక్స్ కన్నుమూసిన విషాద సమయంలో నేను న్యూజిలాండ్ లో ఉన్నాను. తన వల్లే 2007 సంవత్సరంలో వెండెల్ రోడ్రిక్స్ నాకు కేవలం 18 సంవత్సరాల వయసులో మోడలింగ్ చేయడానికి ముంబైకి వెళ్లేందుకు ధైర్యం వచ్చింది. 2007లో తనతో కలిసి లాక్మే ఫ్యాషన్ వీక్ లో వెండెల్ రోడ్రిక్స్ తో కలిసి ర్యాంప్ పై నడిచే అవకాశం దక్కింది. ఆ ఏడాది స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్ లో డిజైనర్ తన ఫైనల్ మోడల్ గా ఎంపికయ్యాడు‘‘ అని గుర్తు చేసింది.

PC : Insta

ఫ్యాషన్ లో ప్రయోగాలు..

ఫ్యాషన్ లో ప్రయోగాలు..

వెండెల్ రోడ్రిక్స్ ప్యారిస్ లో విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ప్రపంచ దుస్తుల చరిత్ర మరియు ఫ్యాషన్ కు సంబంధించిన ఇతర సమస్యలపై ఉపన్యాసం ఇచ్చాడు. అంతేకాదు పర్యావరణ అనుకూల ఫ్యాషన్ యొక్క గర్వించదగ్గ న్యాయవాది. ఈయన ఖాదీ వస్త్రాలతో అనేక ప్రయోగాలు చేశాడు.

PC : Insta

ఇతరుల నివాళి..

ఇతరుల నివాళి..

అనుష్కశర్మతో పాటు మలైకా అరోరా ఇంకా ఇతర ప్రముఖులు వెండెల్ రోడ్రిక్స్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మలైకా తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో ‘‘మాస్టర్ కోటురియర్‘‘ గా అభివర్ణించింది. తనతో గడిపిన అందమైన క్షణాలను గుర్తు చేసుకున్నట్లు చెప్పింది.

PC : Twitter

English summary

Anushka Sharma in shock after her godfather(Wendell Rodricks) dies

Fashion designer, author, environmentalist, and advocate for gay rights, Wendell Rodricks passed away at his Goa home on 12th February, 2020. The Padma Shri awardee designer was born on 28th May, 1960 and had a flourishing career as a fashion designer.
Story first published:Thursday, February 13, 2020, 15:30 [IST]
Desktop Bottom Promotion