For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాలీవుడ్ దుర్గాపూజ ప్రత్యేకం: బెంగాలీ సాంప్రదాయ ‘లాల్ పార్ షాదా’ చీర ప్రాముఖ్యత

By Lekhaka
|

దుర్గాపూజ ఉత్సవాలు సమీపిస్తుండటంతో, ఆ పేరే బెంగాల్ లో ప్రతి వ్యక్తిని, ప్రపంచంలో ఏ బెంగాలీకైనా ఉత్సాహం తెప్పిస్తుంది. ఇతర సంస్కృతుల వారిలానే, బెంగాలీలు కూడా ప్రత్యేక స్టైల్ కలిగి ఉంటారు. అది దుర్గాపూజ ఐదురోజుల్లో చాలా బాగా కళ్ళకి కట్టినట్లు కన్పిస్తుంది.

హిల్సా, రసగుల్లా మరియు రాజకీయాలే కాక, బెంగాలీలు స్టైల్ గా ఉండటంలో కూడా ప్రసిద్ధులు. వారి సాంప్రదాయ చీర “లాల్ పార్ షాదా” ను వారు ప్రత్యేక రీతిలో కట్టుకుంటారు. ఈ కట్టుకునే పద్ధతిని 'ఆట్ పౌరె’ అంటారు మరియు బెంగాలీలు ఇలా పండగలు, దుర్గాష్టమి, దశమి ( దుర్గాపూజలో 8 మరియు 10వ రోజులు)నాడు ధరిస్తారు.

Laal Paar Shada Saree For Durga Puja

లాల్ పార్ షాదా చీర తెల్లగా ఉండి, ఎర్రని అంచు, డిజైన్లు కలిగిఉంటుంది. బెంగాలీ స్త్రీలు బంగారు ఆభరణాలతో, ఎర్రని బొట్టు, ఆల్టా (పారాణి)తో ధరించి అందంగా మెరిసిపోతారు.

ఈ ప్రత్యేక బెంగాలీ లుక్ కేవలం బెంగాలీ నటీమణులే కాదు, అలా తయారయ్యి అచ్చు బెంగాలీలలాగా కన్పించిన ఇతర నటీమణులది కూడా. మేము లాల్ పార్ షాదా చీరల్లో అలరించిన కొందరు బాలీవుడ్ నటీమణుల లిస్టును పొందుపరిచాం.

మీకు నచ్చిన లుక్ ను ఎంపిక చేసుకుని, 90ల్లో బాలీవుడ్ నటీమణులలాగానే 'బాంగో కన్యలు’ లేదా బెంగాలీ స్త్రీలగా మారిపోండి.

బిపాషా బసు

బిపాషా బసు

మా లిస్టు తమ సంప్రదాయ లుక్స్ లో అలరించిన బాలీవుడ్ బెంగాలీ భామలతో మొదలవుతుంది. బిపాసా రెండుసార్లు లాల్ పార్ షాదా చీరను ధరించటం చూసాం. ప్రతీసారీ ఆమె అందంగా, హుందాగా ఉన్నారు.

ఒకసారి లాక్మే ఫ్యాషన్ వీక్ మరియు రెండవసారి ఒక ఫోటోషూట్లో. రెండుసార్లు బిపాషా ఒకేసారి హాట్ మరియు అందంగా ఉన్నారు.

రెండు చీరలు వేర్వేరుగా ఎంబ్రాయిడరీ చేయబడి ఉన్నా, సంప్రదాయ ఎర్ర అంచు తెల్లచీరలు మాత్రమే.

రాణి ముఖర్జీ

రాణి ముఖర్జీ

రాణి మరియు కాజోల్ కుటుంబాలు ముంబైలో అతిపెద్ద దుర్గాపూజను నిర్వహిస్తాయి. మనం రాణిని ఇదివరకే అందమైన బెంగాలీ అవతారంలో చూసేసాం. ఆమె కూడా లాల్ పార్ షాదా చీరను అనేకసార్లు ధరించారు. ఈ లుక్ లో సంప్రదాయ చీరను ఆధునిక స్టైల్ లో ధరించి రెండింటినీ బ్యాలెన్స్ చేసారు.

కాజోల్

కాజోల్

తన కజిన్ రాణి లాగానే, కాజోల్ కూడా బెంగాలీ సంప్రదాయ దుస్తులను అందంగా, ఆకర్షణీయంగా ధరించారు. మేము ఆమె మేటి బెంగాలీ లుక్స్ లో రెండింటిని ఎంపిక చేసాం.మీకు నచ్చినది సెలక్ట్ చేసుకోండి.

సుస్మితా సేన్

సుస్మితా సేన్

మరో బెంగాలీ రాణి, సుస్మితాసేన్ హుందాతనానికే ప్రతీక. ఆమె కూడా సంప్రదాయ బెంగాలీ చీరను రకరకాలుగా ధరించారు. ఈ లుక్ లో పూర్తి సిల్క్ లాల్ పార్ షాదా చీరను అందమైన నగలతో ధరించి దుర్గాపూజను జరుపుకున్నారు.

రీతాభరి చక్రబొర్తి

రీతాభరి చక్రబొర్తి

ఇటీవల కల్కి కొయెచ్లిన్ తో లఘుచిత్రంలో నటించి, ఆయుష్మాన్ ఖురానాతో సంగీత వీడియోలో కన్పించిన ఈ ప్రముఖ బెంగాలీ నటి, ఈ సాంప్రదాయ లుక్ తో తన అందాన్ని మరింత మెరుగులు దిద్దుకున్నారు. ఒక్క మాటలో, ఆమె చీరను ముత్యాల నగలతో, ఎర్రని బొట్టుతో ధరించి లుక్ ను పర్ఫెక్ట్ చేసారు.

మరొకదాంట్లో ఆమె సాంప్రదాయ చీరను ధరించి, పోల్కా చుక్కల జాకెట్ మరియు బంగారు నగలను వేసుకున్నారు. ఆమె మీకు మరి దుర్గాపూజకి రెండు ఎంపికలు ఇచ్చారుగా, మరెందుకు ఆలస్యం?

సోనం కపూర్

సోనం కపూర్

సోనం కపూర్ రెండుసార్లు బెంగాలీలా కన్పించారు. ఒకసారి షూట్ లో మరోసారి ర్యాంప్ పైన. రెండుసార్లు అద్భుతంగా కన్పించారని మళ్ళీ చెప్పక్కర్లేదు. రెండుసార్లు ‘ఆట్ పౌరె' స్టైల్ చీర, ఎర్రని బొట్టు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేసాయి.

మీరు కూడా ప్రయత్నించాలనుకుంటున్నారా? దుర్గాపూజకి మీరు కూడా ఇలా తప్పక ప్రయత్నించండి.

శ్రీదేవి

శ్రీదేవి

శ్రీదేవి ఇటీవల తన మామ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా, ఒక బెంగాలీ రియాలిటీ షోకి సంప్రదాయ లాల్ పార్ షాదా చీరను కట్టుకుని హాజరయ్యారు. అసలే ఎంతో అందమైన ఆమె ఈ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.ఆమె చీరను ఆట్ పోరె స్టైల్లో కట్టుకుని తన బాంగో లుక్ ను పూర్తిచేసారు.

సెలీనా జైట్లీ

సెలీనా జైట్లీ

ఈమె తన హాట్ లుక్స్ కి ప్రసిద్ధురాలు. షూట్ కోసమని ఆట్ పౌరె స్టైల్ లో చీరను ధరించారు. తను బంగారు జరీ కల రాయల్ లాల్ పార్ షాదా చీరను, అందమైన బంగారు నగలతో పాటు అలంకరించుకున్నారు. ఎర్రని బొట్టు, సింధూరం అలాగే సంప్రదాయ ‘షకా-పోలా'తో బెంగాలీ పెళ్ళికూతురి లుక్ ను పూర్తిచేసారు.

దశమి రోజున దుర్గామాతకి వీడ్కోలు సమయంలో ఒక బెంగాలీ అమ్మాయి ఎలా తయారవుతుందో ఇదే ఉదాహరణ.

రీతూపర్ణ సేన్ గుప్తా

రీతూపర్ణ సేన్ గుప్తా

రీతూపర్ణ 90 వ దశకం నుంచే ప్రముఖ బెంగాలీ నటి మరియు కొన్ని బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు.ఆమె తన సాంప్రదాయ చీరను ఆట్ పోరె స్టైల్ లో కట్టుకున్నారు మరియు ఆమె చేతిలో ఉన్నది దుర్గామాతకి వీడ్కోలు చెప్పే ‘బోరోన్' పద్ధతిలో వాడే ‘బోరోన్ దాలి'.

ఈ లుక్ మీ దశమి లుక్ గా సరిగ్గా సరిపోతుంది. మీరు ఇలాగ బెంగాలీలు కుంకుమతో ఆడుకునే ఉత్సవం ‘సింధూర్ ఖేలా" కి తయారవ్వవచ్చు.

English summary

bolly-durga-puja-special-true-essence-the-bengali-tradition

Bollywood actresses who redefined the speciality of Laal Paar Shada saree for Durga Puja. Have a look.
Desktop Bottom Promotion