For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali Couple Fashion:దీపావళి వేళ స్టైలీష్ లుక్ కోసం ఆలియా, రణబీర్ కపుల్ ఔట్ ఫిట్స్ పై ఓ లుక్కేయండి...

|

RRR హీరోయిన్ ఆలియా భట్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ జంటకు సంబంధించిన పెళ్లి వార్తలు బీటౌన్ లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరి వివాహం కూడా ఈ ఏడాది డిసెంబర్ మాసంలో ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే వీరు వెడ్డింగ్ ప్లేసులను సెలెక్ట్ చేసేందుకు రాజస్థాన్, ఢిల్లీ, ముంబైతో పాటు పలు ప్రాంతాలను అన్వేషించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి.

వీరి వివాహం కోసమే రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రా సినిమాను కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి వివాహం గురించి పుకార్లు మరింత జోరందకున్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. దీపావళి అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆనందంగా టపాసులు కాలుస్తూ చీకటిని తొలగించే దీపాలను వెలిగిస్తూ జరుపుకునే పండుగ.

మన తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీపావళి తర్వాతే క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి వేడుకలు వచ్చేస్తాయి. ఈ సందర్భంగా దీపావళి పండుగ వేళ సంప్రదాయబద్ధంగా కొత్త డ్రస్సులతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ జరుపుకోండి. అందుకోసం ఆలియా భట్, రణబీర్ కపూర్ ల ప్రత్యేకమైన డ్రస్సులపై ఓ లుక్కేయండి. ఈ అవుట్ ఫిట్స్ తో మీ రూపాన్ని మరింత మెరుగుపరచుకోండి.

Diwali Outfits:దీపాల పండుగ వేళ ఈ డ్రస్సులతో మతాబుల కంటే ఎక్కువగా మెరుస్తారు...

స్టైలీష్ కపుల్..

స్టైలీష్ కపుల్..

బాలీవుడ్ లో ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ ఎంత స్టైలీష్ కపుల్ అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీపావళి వేళ జంటలకు రణబీర్ మరియు ఆలియా భట్ ఫ్యాషన్ స్టైల్ సరిగ్గా సరిపోతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పండుగ సమయంలో మీరు వీరి స్టైల్ ను ఫాలో అవ్వడం వల్ల మీరు మరింత వెలిగిపోవచ్చు. ఈ సందర్భంగా ఈ కపుల్ ఫ్యాషన్ స్టైల్స్ పై ఓ లుక్కేద్దాం.

సంప్రదాయ దుస్తులు..

సంప్రదాయ దుస్తులు..

పండుగల సీజన్లో చాలా మంది సంప్రదాయ దుస్తులను ధరించడాన్ని బాగా ఇష్టపడతారు. ఈ దీపావళి మీరు కూడా ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు కనిపించిన ఈ లుక్ ని ఫాలో అవ్వొచ్చు. ఆలియా భట్ పింక్ బార్డర్ తో ఎల్లో కలర్ పూల చీరను ధరించింది. అలాగే డీప్ నైక్ లైన్ బ్లౌజ్ లో చాలా అందంగా కనిపిస్తోంది. ఇందుకు మ్యాచ్ అయ్యేలా రణబీర్ కపూర్ లైట్ బ్లూ కలర్ కుర్తా సెట్ ను వేసుకున్నాడు. రణబీక్ కుర్తాతో సరిపోయే రంగుల పూల డిజైన్ హాఫ్ జాకెట్ ధరించాడు. మీరు కూడా ఈ దీపావళికి ఈ జంట స్టైల్ ను ఫాలో అవ్వొచ్చు.

మ్యాచింగ్ డ్రస్సులు..

మ్యాచింగ్ డ్రస్సులు..

ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ బాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కపుల్. లంచ్ మరియు డిన్నర్ డేట్ లలో ఇద్దరూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు చాలా సార్లు మ్యాచింగ్ డ్రస్సులను వేస్తుంటారు. వీరిలాగే మీరు కూడా మీ భాగస్వామితో మ్యాచింగ్ డ్రస్సులను వేస్తే.. మీ లుక్ నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ ఆలియా, రణబీర్ వైట్ జీన్స్ అండ్ వైట్ జాకెట్ ధరించారు. మీరు కూడా ఇలాంటివే కాకుండా ఇతర కలర్ డ్రస్సులు మ్యాచింగ్ జీన్స్, జాకెట్లను వేసుకోవచ్చు.

క్యూట్ కపుల్..

క్యూట్ కపుల్..

బాలీవుడ్ లో ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ ల జంట ఫ్యాషన్ స్టైల్ కపుల్ గా పరిగణించబడుతుంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ జంట రూపాన్ని మీరు సులభంగా ట్రై చేయొచ్చు. ఆలియా భట్ రెడ్ కలర్ దుపట్టా, లైట్ గ్రీన్ సూట్ ధరించి ఉంది. మరోవైపు రణబీర్ కపూర్ బ్లూ చెక్ షర్ట్ మరియు బ్లాక్ జీన్స్ ధరించాడు. ఈ డ్రస్సులో వీరిద్దరూ చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు.

ట్రెడిషనల్ లుక్..

ట్రెడిషనల్ లుక్..

మీరు దీపావళి రోజున అద్భుతమైన మరియు సాంప్రదాయ రూపంలో కనిపించాలనుకుంటే.. ఆలియా భట్ మరియు రణబీక్ కపూర్ ల ఈ ట్రెడిషనల్ లుక్ ను చూడండి. ఆలియా గ్రీన్ కలర్ కాటన్ అనార్కలీ సూట్ లో చాలా అందంగా కనిపిస్తోంది. రణబీర్ కపూర్ బ్రౌన్ కలర్ ప్యాంటుతో కూడిన చిన్న కుర్తా ధరించాడు. దానికి హాఫ్ జాకెట్ యాడ్ చేశాడు. అలాగే ఆలియా గ్రీన్ కలర్ పూల సూట్ తో లైట్ గా మేకప్ వేసుకుంది. ఆ డ్రస్సుకు తగ్గట్టు ఓపెన్ హెయిర్ మరియు లైట్ మేకప్ తో తెగ మెరిసిపోతోంది.

పండుగ వేళ..

పండుగ వేళ..

మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పండుగ అయినా మనలో చాలా మంది వేసుకునే అవుట్ ఫిట్స్ గురించి మాట్లాడితే.. అందరికీ టక్కున గుర్తొచ్చేది. అందమైన చీర. సాధారణంగా పండుగ వేళ పట్టు లేదా జరీతో ఉన్న చీరలను కట్టుకుని సంప్రదాయ బద్ధంగా రెడీ అవుతుంటారు. కానీ మీరు ఈ దీపావళికి ప్రత్యేకంగా కనిపించాలంటే.. కేవలం పట్టుచీరే కట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఉండాలనుకుంటే కేవలం బోర్డర్ మాత్రమే కనబడే.. ఎంబ్రాయిడరీ చీరలు కూడా కట్టుకోవచ్చు. కొంచెం వైట్ గా ఉండే వారు.. డార్క్ కలర్ చీరలను, ఛామన ఛాయ రంగులో ఉండే లైట్ కలర్ ఉండే షీర్ శారీలను కట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు. దీని మీదకు మ్యాచింగ్ సిల్వర్ లేదా గోల్డ్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

English summary

Diwali Couple Fashion : Alia Bhatt and Ranbir Kapoor Outfit Combinations for Couples on Diwali in Telugu

Diwali Couple Fashion: Alia Bhatt And Ranbir Kapoor Outfit Combinations For Couples On Diwali in Telugu. Have A Look
Story first published: Monday, November 1, 2021, 13:19 [IST]