Latest Updates
-
ఈ భాగాల్లో తరచుగా వాపు.. అస్సలు లైట్ తీసుకోకండి.. వీటి ఆరోగ్యానికి బ్యాడ్ సిగ్నల్.! -
ఆఫీసుకైనా, స్కూల్కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.! -
పరగడుపునే గ్లాస్ నీళ్లతో ఒక స్పూన్ తీసుకుంటే చాలు.. మలబద్ధకం సమస్య పరార్.! -
మీరు మీ జీవిత భాగస్వామిని నిజంగా ప్రేమిస్తున్నారా.. ఈ ప్రశ్నలతో చెక్ చేసుకోండి.! -
వర్షాకాలంలో ఇంట్లో చీమల బెడద.. ఈ ఆయుర్వేద చిట్కాలతో ఇట్టే తరిమేయండి.! -
సండే స్పెషల్.. మిరియాల ఘాటుతో నోరూరించే స్పైసీ లెమన్ చికెన్ స్టార్టర్.! -
మేకప్ తర్వాత మీ ముఖం మరింత అందంగా కనిపించాలంటే.. ఏ బ్లషర్ ఎంచుకోవాలో తెలుసా.? -
నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. మృతదేహాన్ని ఎంతకాలం భద్రపరచొచ్చు.? -
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా..
మెన్ ఫ్యాషన్ ట్రెండ్స్: 500 రూ. లేదా అంత కంటే తక్కువలో లభించే అధ్భుత టై లు
చాలా మంది మగవారు టై కట్టు కోవాలని ఉవ్విళూరితే మరికొంత మంది మగవారికి అదంటే పడదు.టై తమకి నప్పదనీ, టై అంటే ఇష్టం ఉన్నా ఎలా కట్టుకోవాలో తెలీకపోవడం,టై కట్టుకుంటే గొంతుకి బిగించినట్లుండడం ఇలా పలు కారణాలు టై అంటే పడకపోవడానికి.
టై కట్టుకున్న మగవాడు డీసెంట్ గా, పద్ధతిగా కనిపించడమే కాదు హాట్ గా కూడా అనిపిస్తాడు.చాలా సార్లు మగవారు టై కట్టుకున్నా కానీ ఫ్యాషనబుల్ గా లేని వాటినో లేదా తాము ధరించిన వస్త్రధారణకి నప్పని టైలనో వాడుతూ ఉంటారు.టై మీ నడకలో ఒక రకమైన గాంభీర్యతనీ, దర్పాన్నీ తీసుకొస్తుంది.
సందర్భానికి తగినట్లు ఎంచుకున్న టై వల్లే ఇది సాధ్యం.అబ్బాయిలూ, ఏ సందర్భానికి ఏ టై కట్టుకోవాలో మీకు తెలుసా??ఏ రకాల షర్టుల మీద ఏ రకమైన టై నప్పుతుందో ఐడియా ఉందా??లేదా??అయితే కంగారు పడకండి.
ప్రస్తుతం ఉన్న ఫ్యాషన్ ట్రెండ్, దానిలో ఉన్న రకరకాల టైలని మీకు పరిచయం చేస్తాము.రెడీయా?? ఒక నాలుగు రకాల టైలు మాత్రం ప్రతీ మగవాడూ దగ్గర ఉంచుకోవాలి.
1.స్ట్రైప్డ్ టై

స్ట్రైప్డ్ టై ని మొదట ఎందుకు చెప్పామో తెలుసా?? ఈ టైలని కొన్ని సందర్భాలకి మాత్రమే వాడాలి.ఈ టైలు ఫార్మల్ గా నీట్ గా ఉంటాయి.ఆఫీసుకో లేదా లంచ్ మీటింగుకో మరే ఇతర అధికారిక మీటింగులకి వెళ్తున్నా సరే స్ట్రైప్డ్ టై ని ధరించడం మర్చిపోవద్దు.
2.ఫ్లోరల్ టై

ఫ్లోరల్ టై..పేరే రొమాంటిక్ గా లేదూ??ఈ టైలు కట్టుకునే మగవాళ్ళ స్వభావం రొమాంటిక్ ట.అలాగే వీటిని కూడా ఆ సందర్భాలలో ధరిస్తే బాగుంటుంది.హనీమూన్ డేట్స్ లేదా రొమాంటిక్ డిన్నర్ డేట్స్,బాల్ రూం డ్యాన్సింగ్ లేదా మీ వివాహం లేదా పెళ్ళి రిసెప్షన్ , వీటిల్లో ఏదైనా సరే , ఈ సందర్భాలకి ఫ్లోరల్ టైలే ఉత్తమ ఎంపిక.
3. చెక్డ్ బో టై

ఇది వేసుకుంటే సెక్సీ గా అనిపిస్తారు.పార్టీ, బ్రంచ్ లేదా మీ గర్ల్ ఫ్రెండుతో అలా సరదాగా డిన్నర్ కి వెళ్తున్నారా??? ఈ చెక్ బో టైలు ధరించండి.ఇవి క్యాజూల్ గా, సెక్సీ గా ఉంటాయి.
4.పోల్కా డాట్ టై లేదా డాటెడ్ టై

ఈ టైలు ఫ్యాషనబుల్ గా కనిపిస్తాయి.ఎక్కడికైనా సరే ఈ చుక్కల టైలని ధరించవచ్చు.కానీ సందర్భానుసారం చుక్కల రంగులు, చుక్కల ప్యాటర్న్ ని ఎంచుకోవాలి.లైట్ కలర్ టై మీద చిన్న చుక్కలున్న వాటిని అధికారిక కార్యక్రమాలకీ,పార్టీ కయితే తెల్ల వస్త్రం మీద రంగు రంగుల పెద్ద చుక్కలున్న టైనీ ధరించవచ్చు.
చూసారు కదా ఏ సందర్భానికి ఏ టై ని ధరించాలో. మా ఈ సలహాలని అనుసరించి మీరు టైలు కొనుక్కోవడానికి ఇక సమయం వృధా చెయ్యరని భావిస్తున్నాము.మరింకెందుకు ఆలశ్యం??
ఆర్టికిల్ అయిపోయింది. ఇప్పుడే టైలని కొనుక్కోండి. ఇంకా మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ల ద్వారా మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications