Latest Updates
-
మీ భోజనంలో ఈ ఒక్క లోపంతో ఇన్ని సమస్యలా.. బలహీనమైన జుట్టు, గోళ్లకు ఇదే కారణం.! -
రోడ్ సైడ్ టిఫిన్ సాంబార్..ఏం రుచిరా బాబు కేక అంతే..10 నిమిషాల్లో మీ ఇంట్లో చేసుకోండిలా.. -
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు!
అతిలోక సుందరి కూతురు అదిరిపోయే డ్రస్సులతో అదరగొట్టింది...
ముంబైలో లాక్మే ఫ్యాషన్ కోలాహలం నెలకొంది. ఈ వేదికపై బాలీవుడ్ అందాల భామలంతా వయ్యారాలు ఒలకబోసుకుంటూ నడుస్తుంటే యువత మతి పోయినట్టయింది.
లాక్మే ఫ్యాషన్ వీక్ లో అలనాటి అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందరికంటే అందంగా కనిపించింది. ఈ బాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. తొలి చిత్రం ధడక్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఆమె డ్రస్సులపై తరచూ సోషల్ మీడియాలో ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా.. ఏ మాత్రం వాటిని పట్టించుకోవట్లేదు. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ 2020 సంవత్సరంలో ఆకట్టుకునే దుస్తులను ధరించింది.

ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ ఎక్కువగా కనబడేలా డ్రస్సులు వేసుకునే ఈ అమ్మడు ఈ సారి మాత్రం కాస్త పద్ధతి అయినా డ్రస్సులే ధరించింది.

అయితే ఈ ర్యాంపుపై మొదట సింగిల్ వచ్చింది. తర్వాత మళ్లీ జంటగా రావడంతో వీరిద్దరి సంబంధాలపై మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. అయితే ఆమెతో పాటు వచ్చిన హీరో ఎవరో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే...

ఫ్యాషన్ కోలాహలం..
ముంబైలో లాక్మే ఫ్యాషన్ కోలాహలం నెలకొంది. ఈ వేదికపై బాలీవుడ్ అందాల భామలంతా వయ్యారాలు ఒలకబోసుకుంటూ నడుస్తుంటే యువత మతి పోయినట్టయింది. ఈ సీజన్ లో బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ లో కనిపించడంతో అందరి చూపులు అక్కడే ఉన్నాయి.

తళక్కున మెరిసిన జాన్వీ..
లాక్మే ఫ్యాషన్ 2020 సంవత్సరంలో జాన్వీ కపూర్ ధరించిన డ్రస్సును చూస్తే అచ్చం దివి నుండి దిగి వచ్చని తారలా మెరిసిపోయింది. ఆమె ర్యాంపుపై నడస్తుంటే కుర్రాళ్లంతా కన్ను ఆర్పకుండా చూసేలా కనిపించింది. అందరి కంటే అందంగా కనిపించి చూపరులను కట్టి పడేసింది.

జాన్వీ జంటగా..
రిలయన్స్ ట్రెండ్స్ యొక్క ప్రారంభ ప్రదర్శనలో జాన్వీ కపూర్ తొలుత సింగిల్ వచ్చింది. అయితే తర్వాత విక్కీ కౌశల్ తో కలిసి ర్యాంపుపై సందడి చేసింది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని.. ఇప్పటికే ఎన్నో రుమార్లు వచ్చినా.. ఈ భామా వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు.

కలర్ ఫుల్ డ్రస్సుతో..
జాన్వీ కపూర్ ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ లో రంగు రంగు పూల దుస్తులలో అందంగా కనిపించింది. మరోవైపు విక్కీ కౌశల్ కూడా పొడవైన కుర్తా మరియు కోటులో అద్భుతంగా కనిపించాడు.

రొమాంటిక్ రాణిలా..
జాన్వీ కపూర్ ధరించిన రంగు రంగుల గౌనులో చాలా అందంగా కనిపించింది. ఇది స్లీవ్ లెస్ గౌన్. ఇందులో ఎంబ్రాయిడదరీ, మల్లీ ఫ్లవర్స్, అందమైన రాళ్లు ఉన్నాయి. ఈ డ్రస్సుకు తగ్గట్టు ఈ అందాల భామ పాయింటెడ్ కనుబొమ్మలు, కోహెల్డ్ కళ్లు, పింక్ పెదాలతో అచ్చం స్వర్గంలోని అప్సరసలా మెరిసిపోయింది.

విక్కీ మ్యాచింగ్ డ్రస్సు..
లాక్మే ఫ్యాషన్ వీక్ 2020లో జాన్వీ కపూర్ తో పాటు వచ్చిన విక్కీ కౌశల్ డ్రస్సు కూడా బాగానే ఆకట్టుకుంది. ఈ హీరో మ్యాచింగ్ డ్రస్సుతో పాటు బ్లాక్ షూస్ తో ర్యాంపుపై రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ లాక్మే ఫ్యాషన్ వీక్ లో ఎన్ని జంటలు వచ్చినా.. వీరిద్దరే హాట్ టాపిక్ గా నిలిచారు.



Click it and Unblock the Notifications