For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Naga Chaitanya and Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్ లేటెస్ట్ ఫ్యాషన్ డ్రస్సులను చూస్తే చూపు తిప్పుకోలేరు...!

|

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ క్యూట్ కపుల్ గురించి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆ క్యూట్ కపుల్ మాత్రం అలాంటి రూమర్స్ గురించి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటున్నారు.

ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో మరింత అందంగా కనిపించేందుకు ప్రతిరోజూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యాషన్ అనేది కేవలం గ్లామర్ కోసమే కాదు.. మనమంటే ఏంటో తెలిసేందుకు కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈరోజుల్లో అమ్మాయిలు డ్రస్ వేసుకున్నా లేదా చీర కట్టుకున్నా.. వారు ధరించే అవుట్ ఫిట్ అనేది చాలా ముఖ్యం.

అయితే అందుకు తగినట్టు అందంగా.. ఆకర్షణీయంగా కనిపించాలంటే డ్రస్సుకు తగ్గట్టు జ్యువెలరీ, లిప్ స్టిక్ కలర్, ఇయర్ రింగ్స్, బ్రాస్ లైట్ లేదా వాచ్ వంటివి చాలా ముఖ్యం. ఇలాంటివి మన అవుట్ ఫిట్ కాకపోతే.. మన లుక్ అస్సలు ప్రత్యేకంగా కనిపించదు కదా.. అవి మరింత వికారంగా కనిపించే అవకాశం లేకపోలేదు. అయితే అందంగా.. ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయి.. అబ్బాయి కోరుకోవడం అనేది అత్యంత సహజం. కానీ ఎవరైతే ఆఫీసుకు, కాలేజీకి వెళ్తుంటారో.. వారే బాగా స్టైలిష్ గా కనిపించాలని ఆశిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఫ్యాషన్ ప్రపంచంలో వచ్చే లేటెస్ట్ అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటినే ఫాలో అవ్వడమే కాదు.. అందులో తమకు నచ్చిన వాటిని వేసుకునేందుకు ఇంట్రస్ట్ చూపుతుంటారు. అలాంటి వారిలో సమంత-అక్కినేని నాగచైతన్య అందరి కంటే ముందుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. మనలో చాలా మంది ఫ్యాషన్ అనగానే ముందుగా బాలీవుడ్ అందాల భామలనే ఊహించుకుంటూ ఉంటారు. అయితే మన టాలీవుడ్ లోనూ ఫ్యాషన్ విషయంలో ఏమీ తీసిపోవడం లేదు కావాలంటే చైసామ్ ఫ్యాషన్ లేటెస్ట్ ట్రెండ్స్ ను చూడండి.. మీకు ఈ అవుట్ ఫిట్స్ కచ్చితంగా నచ్చుతాయి....

అట్రాక్ట్ చేసేలా..

అట్రాక్ట్ చేసేలా..

సమంత మరియు నాగచైతన్య పెళ్లి అయినప్పటి నుండి తమ ఫ్యాషన్ లేటెస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ తో మోడల్ గా కనిపించడమే కాదు.. అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. వీరు పెళ్లయిప్పటి నుండి ఇప్పటిదాకా ఏ పార్టీకి వెళ్లినా.. ఏ అవార్డు ఫంక్షన్ కు వెళ్లినా.. క్యాజువల్ అవుటింగులు లేదా సినిమాల ప్రమోషన్లు ఇలా ఏదైనా సరే అందరినీ ఆకర్షించేందుకు తాము వేసుకునే డ్రస్సుల విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటారు.

సమంత అవుట్ ఫిట్..

సమంత అవుట్ ఫిట్..

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత అక్కినేని(Samantha Akkineni) ధరించిన అవుట్ ఫిట్ చూడండి. పెళ్లయి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటికీ సన్నని నడుముతో స్లీవ్ లెస్ తెల్లని డ్రస్సులో ఎంత అందంగా కనిపిస్తుందో. తన డ్రస్సుకు తగ్గట్టు మ్యాచింగ్ స్యాండిల్.. ఒక చేతికి బ్యాంగిల్, అదే చేతికి అట్రాక్టివ్ రింగ్ పెట్టి ఓర చూపులు చూస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఎలాంటి జ్యువెలరీ లేకుండా మెడ మొత్తాన్ని కవర్ చేసి చాలా సింపుల్ గా కనిపిస్తోంది. ఇలాంటి డ్రస్సులు పార్టీలకు బాగా సూటవుతాయని సంకేతాలిస్తోంది. ఇక తన మేకప్ విషయానికొస్తే.. న్యూడ్ లిప్ స్టిక్ షేడ్ ఉపయోగించి, కళ్లకు వింగ్డ్ ఐ లైనర్ తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. చివరగా తన అవుట్ ఫిట్ కు మ్యాచయ్యేలా స్లీక్ హెయిర్ స్టైల్ తో అందాల అపరంజిని తలపించింది మన సక్కనైన సమంత

సంప్రదాయ దుస్తులతో..

సంప్రదాయ దుస్తులతో..

త్వరలో దసరా పండుగ రాబోతోంది. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దసరాను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుకునే వారిలో మీరూ ఒకరా? అయితే ఈ దసరా పండుగను సంప్రదాయబద్ధంగానే నూతన దుస్తులతో.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ జరుపుకోండి. అందుకోసం సమంత చైతూ ధరించిన అవుట్ ఫిట్స్ ను ఓ సారి ట్రై చేయండి.

పండుగ వేళ..

పండుగ వేళ..

మన తెలుగు రాష్ట్రాల్లో ఏ పండుగ వచ్చినా అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే అవుట్ ఫిట్స్ లో తొలి స్థానం చీరకే దక్కుతుంది. సాధారణంగా పండుగ సమయంలో పట్టు లేదా జరీతో ఉన్న చీరలు కట్టుకుని సంప్రదాయబద్ధంగా సిద్ధమవుతుంటారు అమ్మాయిలు. అయితే మీరు పండుగ రోజున ప్రత్యేకంగా కనిపించాలంటే.. మీరు కేవలం పట్టు చీరే కట్టుకోవాల్సిన పనిలేదు. చీర మొత్తం సింపుల్ గా ఉండి.. కేవలం బార్డర్ మాత్రమే డిజైన్లో ఉండే.. ఎంబ్రాయిడరీ చీరలు కూడా ధరించొచ్చు. అయితే తెల్లగా ఉండే వారు.. కొంచెం డార్క్ కలర్ సారీ అయితే బెటర్. చామన చాయ రంగులో ఉండే వారు లైట్ కలర్లు ఉన్న షీర్ సారీలను సెలెక్ట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. వీటికి మ్యాచింగ్ గా సిల్వర్ లేదా గోల్డ్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ ను ఎంచుకోవచ్చు.

All Images Credit to Instagram

English summary

Naga Chaitanya and Samantha : Let's Drool Over Tollywood Couple Latest Looks

Here are the naga chaitanya and samantha : let's drool over tollywood couple latest looks