For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పెళ్లి రోజు అద్భుతంగా కనిపించడానికి వధువు కోసం లేటెస్ట్ డిజైన్స్

మీ పెళ్లి రోజు అద్భుతంగా కనిపించడానికి వధువు కొరకు నాథ్ డిజై

By Ashwini Pappireddy
|

మన పెళ్లి రోజును మనం ఎన్నటికీ మరచిపోలేము. ఎందుకంటే మనందరి జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజులలో అది ఒకటి మరియు ఈ రోజు తల నుండి కాలి బొటనవేలు వరకు మంచి దుస్తులతో అలంకరించుకోవాలని అందరూ ఇష్టపడతారు. మనం వివాహ దుస్తులు మరియు వివాహానికి సంబంధించిన ఆభరణాల గురించి ఆలోచించినప్పుడు, మనం ట్రెడిషన్ డ్రెస్ లో వుంటూ మోడర్న్ లుక్ లో కనిపించడానికి ఆకర్షితులవుతాము.

ట్రెండ్స్ మరియు ఫ్యాషన్ అనేది సీజన్ ని బట్టి మారుతూవుంటాయి. కాబట్టి మీరు మీ వివాహానికి సంబంధిన వస్తువులను సేకరించడం చాలా మంచిది. కానీ మీ వివాహంలో ధరించే కొన్ని సాంప్రదాయ వస్తువులు ఏమిటి? వివాహంలో ముఖ్యమైన భాగమైనటువంటి చిన్న బొట్టు లేదా ఎంతో ప్రముఖమైన బంగారం సెట్ కావచ్చు. ఒకవేళ ట్రెండ్ మారినప్పటికీ కూడా వీటిలో ఎలాంటి చేంజ్ ఉండదు.

అదేవిధంగా, ప్రతి పెళ్లిలో మనకి కామన్ గా అనిపించే విషయం ఏంటంటే, మన వస్త్రధారణ. మనం ధరించే పెళ్లి దుస్తులు మనల్ని రాయల్ లుక్ లో కనిపించేలా చేస్తాయి.ముక్కు రింగ్ లేకుండా పెళ్లికూతురు అసంపూర్తిగా ఉంటుంది,దీనినే నాట్గా అని కూడా పిలుస్తారు. మారుతున్న ట్రెండ్స్ తో పాటుగా, మీ పెళ్లి రోజున అదంతా ఒక కలలా అనిపించే 12 రకాల పెళ్లికూతురు నాథ్ డిజైన్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

రాయల్ కుందన్ లుక్:

రాయల్ కుందన్ లుక్:

ఇది కుందన్స్ తో చాలా సున్నితంగా చేయబడింది,ఈ నాథ్ చాలా సింపుల్ మరియు క్లాసి గా ఉండాలనుకునే వధువు కి ఇది ఖచ్చితంగా సరిపోతుంది. నాథ్ యొక్క సగం భాగం కుందన్స్ మరియు ముత్యాలతో చక్కగా అలంకరించడం జరిగింది. ఇక్కడ కీ హైలైట్ ఏంటంటే చిన్న పుష్పం లాగా వర్ణించడం మరియు నాట్ స్ట్రింగ్కు కి జోడించిన చిన్న పూసలు.

Image Source:Morviimages

సింపుల్ సౌత్ లుక్:

సింపుల్ సౌత్ లుక్:

మీ సౌందర్యాన్ని మరింత పెంచేలా సౌత్ ఇండియన్ లుక్ మీకు సహాయపడుతుంది. ఇది చెక్కబడిన చిన్న ఎర్రటి పూసలతో చిన్న కట్టు ఉంటుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా వున్నా మీ అలంకరణకు మరింత విలువనిస్తుంది మరియు మిమల్ని అందంగా తయారుచేస్తుంది.

Image Courtesy: Amrit, A Candid Wedding Photographer

ఐడీఎల్ బీడ్స్ లుక్:

ఐడీఎల్ బీడ్స్ లుక్:

సాంప్రదాయిక పద్ధతిలో ఎరుపు మరియు తెలుపు పూసల కలయిక తో ఈ నాథ్ కి మరింత గ్లామర్ ని తెచ్చిపెట్టింది. ఒక బిట్ హెవీ గా ఉండటం, ఇది ఎరుపు మరియు తెలుపు రంగు కలయిక తో రూపొందించబడింది.ఇందులో కేవలం పూసల తో పాటు కొన్ని అంచులను మాత్రమే కలిగివుండటం కాకుండా, కానీ వివరంగా వుంటువంటి కుండన్ ఒక ఎత్నిక్ లుక్ నిస్తుంది.

Image Sorce:Morviimages

బేస్ గోల్డ్ లుక్:

బేస్ గోల్డ్ లుక్:

మీరు తక్కువ ఆభరణాల తో కొంచం ఎక్కువ మేకప్ కావాలనుకుంటే, ఇది మీకు సరైన నాథ్ గా చెప్పవచ్చు. ఇది బంగారు పూతతో రూపకల్పన చేయబడి ఉంటుంది. ఇక్కడ బంగారు పునాదిని కీ హైలైట్గా ఉంచడంతో, ఈ నాథ్ చాలా సాధారణ వుంది.ఇది మీలో ఒక రాయల్ లుక్ ని తీసుకురావడానికి ఆకుపచ్చ పూవును కలిగి వుండి దాని చుట్టూ పూలలాగా ఒక పూసతో అలంకరించబడివుంటుంది, కాబట్టి, మీరు ఒక తేలికపాటి మరియు చూడటానికి అందంగా అనిపించే దానిని ఎంపిక చేయాలనుకుంటే అప్పుడు దీనిని తీసుకోండి.

Image Sorce:Morviimages

పురాతన రూపం:

పురాతన రూపం:

మీరు ఆధునిక ఆభరణాల ని కోరుకునే వ్యక్తి అయితే, ఈ నాథ్ మీ కోసం. నాథ్ యొక్క బేస్ సాధారణంగా ఉంచారు, అయితే మిగిలిన సగాన్ని పూసలు, కుండన్ మరియు టస్సల్స్ తో ఏర్పాటుచేశారు. దీనివలన ఇది అర్బన్ లుక్ నిస్తుంది.ఇది షీర్ డిజైన్ చాలా సాంప్రదాయంగా ఉంటుంది మరియు మిమ్మల్ని పురాతన యుగానికి తీసుకెళ్తుంది. కనీస మేకప్ మరియు దుస్తులను మనస్సులో ఉంచుకొని ఈ నాథ్ యొక్క వరుస రూపొందించబడింది.

ఇక్కడ ఎరుపు, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులు గోల్డెన్ కుండన్తో చక్కగా కలిసిపోయాయి.

Image Sorce:Morviimages

క్లాసిక్ వధువు లుక్:

క్లాసిక్ వధువు లుక్:

దీనిని క్లాసిక్ లుక్ గా చెప్పవచ్చు, దీనిని దాదాపు ప్రతి వధువు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. ఇది సాదా మరియు చిన్న వరుసలను కలిగి ఉంటుంది, స్ట్రింగ్ అనేది పూసలు ఆధారంగా ఉంటుంది. మీరు చాలా ప్రయోగాలు చేయకూడదనుకుంటే ఇది మీ కోసం ఖచ్చితంగా సరిపోతుంది.

Image Sorce:Morviimages

ది స్టడ్డ్ లుక్:

ది స్టడ్డ్ లుక్:

మీరు తేలికైన వాటిని విసిరేసే మరియు భారీ వాటి కోసం వెళ్లాలనుకుంటే అందులో ఇది ఒకటి. చిన్న వృత్తాలు మరియు మధ్యలో ఒక నిండిన పుష్పంతో వివరించి, ఈ నాథ్ మరింత అందంగా కనిపించేలా చేస్తుంది..స్ట్రింగ్ చిన్న ముత్యాలు తో నిండి వుండి మరియు వేలాడే వాటిని కూడా కలిగివుంది. ఇది మీకు ఒక రాయల్ లుక్ ని ఇస్తుంది మరియు ఇది ఒక బిగ్ ఫాట్ భారతీయ వివాహానికి ఖచ్చితంగా సరిపోతుంది.

Image Sorce:Morviimages

సింపుల్ లుక్:

సింపుల్ లుక్:

మీరు ఒక సాధారణమైన నాథ్ ని ధరించాలి అనుకుంటే, అప్పుడు ఈ నాథ్ రింగ్ మీకు సరైన ఛాయస్. ఇది సాధారణగాను మరియు సరళంగా ఉంటుంది మరియు దానికి ఒక చిన్న పువ్వు ఉంటుంది. మీరు ఇందులో ఒక బిట్ ఎక్కువ కావాలనుకుంటున్నారా,అయితే ఈ నాథ్ కి ఒక స్ట్రింగ్ జోడించవచ్చు.ఇది సాధారణగాను మరియు చూడటానికి వధువుకి పెద్ద ఆభరణంగా కనిపిస్తుంది.

Image Sorce:Morviimages

జోధబాయి లుక్:

జోధబాయి లుక్:

మీరు రాయల్టీ లాగా కనిపించాలనుకుంటే, అప్పుడు ఈ జొద్బాయ్ నాథ్ ని ఎంపిక చేసుకోండి. బంగారు పతకంతో, అది మూడు పొరల నమూనాను కలిగి ఉంది మరియు ప్రతి నమూనా వేరే వరుసలను కలిగి ఉంది. ఇది పూసలు, కుందన్స్ మరియు స్టుడ్స్ కలయికతో ఉంటుంది, బేస్ ని బంగారంతో తయారుచేయబడి ఉంటుంది. రాయల్టీని ఇష్టపడేవారికి ఇది ఒకటి.

Image Sorce:Morviimages

బాంగ్ బ్యూటీ

బాంగ్ బ్యూటీ

వెండి తో తయారుచేసిన దీనిని ఎంచుకోవడం ద్వారా మీ మాంగ్ టికాకు మరింత జోడించండి, ఇది

పూర్తి గా మీకు ఒక బెంగాలీ సంప్రదాయ రూపానిస్తుంది. సాంస్కృతిక ట్విస్ట్ ఇవ్వాలనుకునేవారికి ఇది ఒకటి. వెండి స్టుడ్స్తో వర్ణించబడి, బేస్ బంగారం తో తయారుచేయబడి ఉంటుంది..

Image Sorce:Morviimages

హూప్ లుక్:

హూప్ లుక్:

మీరు స్ట్రింగ్ను ఇష్టపడని మరియు మీ మొత్తం రూపానికి ఒక కొత్త మెరుగుల ను

జతచేసిన చిన్న నాథ్ ఆప్ట్ చేయాలనుకుంటే, ఆపై దీన్ని ఎంచుకోండి. ఇది చిన్న గా వుండి మరియు మీరు ఒక సాంప్రదాయ మరాఠీ ముల్లీ లుక్ ని ఇస్తుంది.

Image Sorce:Morviimages

ది టాసెల్ లుక్:

ది టాసెల్ లుక్:

ఒకవేళ మీరు లేటెస్ట్ ట్రెండ్స్ ని అనుసరించడానికి ఇష్టపడే వ్యక్తి అయితే, ఈ నాథ్ ప్రత్యేకంగా మీ కోసం తయారు చేయబడింది. దీని బేస్ మీద కొన్ని టాసెల్ అంచులను కలిగి ఉంది, అయితే నాథ్ యొక్క పైభాగంలో కొన్ని ప్రత్యేకమైన పధ్ధతులు ఉన్నాయి, ఇది ఒక వివరణాత్మక పక్షిని కలిగి ఉంటుంది.చిన్న పూసలు మరియు నాట్ యొక్క సాదా స్ట్రింగ్ ని కలిగివుండటం వలన ఇది మంచి బాలన్స్ ని కలిగివుంటుంది మరియు మిమల్ని ట్రెండీ గా తయారుచేస్తుంది.

Image Sorce:Morviimages

English summary

Types Of Naths For Wedding Season, Naths For Brides, Naths For Wedding, Types Of Nath

Nath adds flavour to the wedding and here are the different types of naths you can try. Have a look.
Desktop Bottom Promotion