అమ్మాయిలు మీ కోసమే..పంక్షన్ లో హైలెట్ అవాలంటే డ్రెస్ ఇట్లుండాలే

మన ఫ్రెండ్స్ లేదా బంధువులలోనో ఎవరిదైనా ఎంగేజ్ మెంట్ లేదా పెళ్లి అవుతుందంటే సాధారణంగా మనం కూడా చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంటాం. వాళ్ల ఎంగేజ్మెంట్ లేదా పెళ్లి రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి..ఏ నగలు పెట్టుకోవాలి, మేకప్, హెయిర్ స్టైల్ ఎట్లుండాలి,చెప్పులు వేసుకోవాలా షూస్ వేసుకోవాలా, ఎలా ఉంటే అందరిలో బాగా కనబడతాం ఇలా రకరకాల ఆలోచనలు బ్రెయిన్ ని చుట్టేస్తాయి. ముఖ్యంగా అన్నీ పర్టికులర్ గా ఉండాలని కోరుకునే ఆడవాళ్లకి ఈ ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతుంటది.

అమ్మాయిలు.. క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్లి లేదా ఎంగేజ్మెంట్(నిశ్చితార్థం)కి వెళ్లేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటది?హెయిర్ స్టైల్,జ్యూవెలరీ ఎలా ఉండాలి?పంక్షన్ కి వచ్చిన అందరిలో మీరు ప్రత్యేకంగా,నీట్ గా,గ్రేస్ ఫుల్ గా కనబడేలా చేయాలంటే ఏం చేయాలనేది కొంతమంది సెలబ్రిటీలు తమ లుక్ తోనే చెప్పేస్తున్నారు. అందమైన సెలబ్రిటీలు ఎలా రెడీ అవుతారో తెలిస్తే మన పని చాలా ఈజీ అయిపోతుంది.

want to highlight in the friend engagement try these celebrity inspired gowns

శాటిన్ బార్బీ లుక్ గౌన్

జాన్వీ కపూర్ పర్పుల్ శాటిన్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ట్యూబ్ స్టైల్ బార్బీ గౌనులో చాలా గ్లామరస్‌ గా కనిపిస్తోంది. ఆ డ్రస్ మీద అమెరికన్ డైమండ్ నెక్‌ పీస్ మీ రూపానికి మరింత గ్రేస్‌ ని తీసుకొస్తుంది. మీ హెయిర్ ని ఓపెన్ గా వదిలేస్తే సరిపోతుంది. ఫుట్ వేర్ విషయానికొస్తే హై పెన్సిల్ హీల్స్ మీ లుక్ ని అద్భుతంగా మారుస్తుంది.

శాటిన్ ఫ్లోరల్ ప్రింట్ గౌన్

ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ లో మీరు గ్లామరస్ గా కనబడాలంటే కియారా అద్వానీ మాదిరి శాటిన్ ఫ్యాబ్రిక్ డీప్ నెక్ గౌన్ ధరించండి. కియారా ధరించిన మాదిరి ముత్యాలతో కూడా నెక్‌ పీస్‌ ని పెట్టుకుంటే మీ రూపానికి మరింత అందాన్ని జోడించవచ్చు. ఇయర్ రింగ్స్ పెట్టుకుని,గోల్డెన్ బ్రాడ్ బ్రాస్‌లెట్‌ పెట్టుకొని మీరు పంక్షన్ కి వెళ్తే అందరి చూపు మీ మీదనే ఉంటది.

రెడ్ నెట్టెడ్ సీక్విన్ వర్క్ గౌన్

తమన్నా మాదిరి మీరు కూడా ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌లలో సీక్విన్ వర్క్ నెట్టెడ్ గౌన్‌లు ధరిస్తే పర్ఫెక్ట్ స్టైల్ లుక్ వస్తుంది. గౌను హై నెక్‌గా ఉంటే దానికి సరిపోయే రెడ్ స్టోన్ ఇయర్ రింగ్స్ మాత్రమే తీసుకెళ్లాలి. ఇది డీప్ నెక్ అయితే మీరు ఏదైనా స్టోన్ నెక్‌పీస్‌ను లాకెట్టుతో స్టైల్ చేయవచ్చు. ఈ గౌనులో మీరు ఎంగేజ్‌మెంట్‌లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు.

క్రీపీ ఫ్యాబ్రిక్ గౌను

అదితి రావు హైదరీ బ్లూ క్రీపీ ఫ్యాబ్రిక్ గౌను అద్భుతమైన రూపాన్ని ఇస్తుంది. మీరు మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కి వెళ్లేటప్పుడు రూపాన్ని కోరుకుంటే దీనిని ట్రై చేయవచ్చు. దీంతో తక్కువ బన్ లుక్,బోల్డ్ మేకప్ టచ్ మీకు గ్లామరస్ లుక్ ఇస్తుంది. సింపుల్ గోల్డెన్ జ్యువెలరీని ఈ తరహా గౌనుతో యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ హైహీల్స్ వేసుకుంటే మీ లుక్ చూసి అందరూ కళ్లు అప్పగించి చూడాల్సిందే.

Desktop Bottom Promotion