Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఒక్క నెయిల్ పాలిష్ ధర రెండు కోట్లు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
అమ్మాయిలకు తమ అందం, తమ అలంకరణ అంటే చాలా ఇష్టం. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్తున్నామంటే గంటల కొద్దీ రెడీ అవుతుంటారు. డ్రెస్ వేసుకోవడం నుంచి అంతా సర్దుకోవడం వరకు వాళ్లకు ఓ రెండు మూడు గంటలు పట్టేస్తుంది. అమ్మాయిలూ తమ అందంలో భాగంగా చేతులను మెరిసే విధంగా, అందంగా కనిపించే విధంగా ఉంచుకుంటారు. దీనికోసం మహిళలు రకరకాల నెయిల్ పాలిష్‌లు కొనుక్కుంటారు. సాధారణంగా నెయిల్ పాలిష్ ధర పదుల నుంచి వేలలో ఉంటుంది. కానీ కోటి రూపాయల విలువ చేసే నెయిల్ పాలిష్ ఎప్పుడైనా చూశారా? దాని గురించే ఈ స్టోరీలో మాట్లాడుకుందాం రండి.
అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్
సాధారణంగా నెయిల్ పాలిష్ ధరలు 40 లేదా 100 రూపాయలు ఉంటుంది. మరీ ఖరీదైనది అయితే ఓ వెయ్యో, రెండు వేలో ఉంటుంది. కానీ ఓ నెయిల్ పాలిష్ ధర కోట్లలో ఉంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్‌గా చెబుతున్నారు. అజాచర్ అని పిలవబడే ఈ నెయిల్ పాలిష్‌ని ప్రముఖ ఏంజెల్స్ డిజైనర్ అఙాథూర్ అజాతుర్ పోగోస్యాన్ రూపొందించారు.

నెయిల్ పాలిష్‌లు ఎన్నో రంగుల్లో ఉంటాయన్న విషయం తెలిసిందే. అలానే ఈ నెయిల్ పాలిష్ నలుపు రంగులో ఉంటుంది. అన్ని నెయిల్ పాలిష్‌లు మాదిరిగానే ఇది కూడా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఇది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే?
అజాచర్ ప్రత్యేకతలు
ఈ నెయిల్ పాలిష్ ధర మాదిరిగానే దీనిలోని ప్రత్యేకతలు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ నెయిల్ పాలిష్‌లో 267 క్యారెట్ల నల్లని వజ్రాలు ఉంటాయి. నల్లని వజ్రాల ద్వారా ఈ నెయిల్ పాలిష్ చేయడం వల్ల దీనికి అంత ఖరీదు ఉందట. అలాగే ఇందులో ప్లాటినం పొడి కూడా వినియోగించారట. దీంతో పాటు ఈ నెయిల్ పాలిష్ స్టోర్ చేసిన సీసా కూడా చాలా ప్రత్యేకమైనదని, అందుకే దీనికి అంత ధర అని దీనిని డిజైన్ చేసిన వ్యక్తి వెల్లడించారు. దీని ధర రూ.1.9కోట్లు అని తెలిపారు.
మెరిసే చేతులు
ప్లాటినం పొడి, వజ్రాలు వినియోగించి చేయడం వల్ల ఈ నెయిల్ పాలిష్ ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటుందని చెబుతున్నారు. దీనిని చేతులపై వేసుకోవడం వల్ల చేతులు మెరిసిపోవడంతో పాటు ప్రత్యేకమైన అందం మన సొంతం అవుతుందని పేర్కొన్నారు. దీనిని ఎక్కువగా ఫ్యాషన్ షోలు, ప్రత్యేకమైన పార్టీల్లో ధనవంతులు వేసుకునేందుకు ఇష్టపడతారు. అందాన్ని పెంచడమే కాకుండా లగ్జరీ, హై క్లాస్‌కి ఇది సంకేతం మాదిరి.



Click it and Unblock the Notifications