Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ఎగ్జిమా నివారణకు 6 ఆయుర్వేదిక్ రెమెడీస్
ఎక్జిమా దీన్ని వైద్యపరిభాషలో తమార,గజ్జి అనికూడా పనిలుస్తురు. వైద్య పరంగా చర్మానికి వచ్చే ఒక వ్యాధి, స్కిన్ ఎర్రగా కమిలిపోవడం, దురదపుట్టడం, చీకాకు, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు ఉంటాయి. దీన్ని డెర్మటైటిస్ అని పిలుస్తారు . ముఖ్యంగా 5ఏళ్ళ లోపు పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది.
పిల్లల్లో ఎక్జిమా లక్షణాలు ముఖంలో ఎక్జిమా రాషెస్ కనబడుతుంటాయి . అది అలాగే మెల్లిగా చేతులకు, కాళ్ళకు మరియు పాదాలకు పాకుతుంది , పెద్దవారిలో మోకాళ్ళు మరియు మోచేతుల వద్ద ఈ లక్షణాలు కనబడుతాయి.
ఎగ్జిమాకు కారణాలు: జన్యుసంబంధమైనవి, ఆస్త్మా ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇతరుల్లో విటమిన్ బి6లోపించినప్పుడు, బడ్ల సర్క్యులేషన్ సరిగా లేప్పుడు ఎక్జిమా లక్షణాలు కనబడుతాయి .
వాతావరణలో పరిస్థితుల కారణంగా, వాతావరణంలో ఎక్కువ వేడి, తరచూ ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఒత్తిడి మొదలగునవి ఎక్జిమాకు దారితీస్తుంది.

ఇదివరికే ఎక్జిమాతో బాధపడే వారు లేదా కెమికల్స్ ప్రొడక్ట్స్ వాడటం, స్మోకింగ్, మరియు డిటర్జెంట్ వాడటం వల్ల ఇటువంటి పరిస్థితికి కారణమవుతుంది .
ఆయుర్వేదంలో, ఎక్జిమాను ''విచారిక’’అని సూచిస్తారు, ఇది కఫ, వాత మరియు పిత్త దోషాల్లో ఎఫెక్టివ్ నెస్ తగ్గడం వల్ల ఎక్జిమాకు కారణమవుతుంది.
ఎక్జిమా నివారణకు ఆయుర్వేదంలో కొన్ని ఆహారాలను తినకూడాని సూచిస్తున్నారు. ఉప్పు తగ్గించడం, పుల్లని ఆహారాలకు కూదంగా ఉండటం, నూనె పదార్థాలు మరియు కారంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పసుపు మరియు చేదుగా ఉన్న ఆహారాలు కాకర, వేప మరికొన్ని పదార్థాలను కూడా ఎక్జిమా నివారణకు సూచిస్తున్నారు.
ఎగ్జిమాతో బాధపడే వారికి, ఆయుర్వేదంలో వివిధ రకాల హెర్బ్స్ అందుబాటులో ఉన్నాయి . ఎక్జిమా నివారణకు ఉపయోగించే కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీస్ ....

అలోవెర: కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు నయం చేసే గుణాలు మెండుగా ఉన్నాయి . చర్మ సమస్యలకు నివారణకు పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు .
కలబందఆకులో రసం ద్రవంలా ఉంటుంది, ఆలోవెర లీప్ కట్ చేసి అందులో నుండి జెల్ ను స్పూన్ తో తీసుకోవాలి. ఇది కాలిన గాయాలను, పుండ్లు, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఉపయోగించడం ఎలా:
కలబంద ఆకును కట్ చేసి, అందులోని కలర్ లెస్ జెల్ ను తీసుకోవాలి. ఈ జెలన్ ను చర్మ సమస్యలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.
ముఖ్యంగా స్కిన్ ఇరిటేషన్ మరియు ఇన్ఫ్లమేషన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.

తేనె: తేనె నేచురల్ యాంటీబ్యాక్టిరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలున్న పదార్థం. చర్మ సమస్యలను నివారణకు ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందులో నయం చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి . ఇది ఎక్జిమాకు కారణమయ్యే స్కిన్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది.
ఉపయోగించే విధానం:
ముందుగా ఇన్ఫ్లమేషన్ కు గురైన ప్రదేశంను శుభ్రంగా కడిగాలి. తర్వాత తేమ పూర్తిగా పోయేవరకూ తుడిచేయాలి.
తర్వాత స్కిన్ రాషెస్ ఉన్న ప్రదేశంలో తేనె అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి.
వేప మరియు పసుపు పేస్ట్:
వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది ఇరిటేషన్ మరియు స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పసుపులో ఉండే యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని స్మూత్ గా మార్చుతాయి.
ఉపయోగించే విధానం:
గుప్పెడు వేపాకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి, దీనికి కొద్దిగా పుపు మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా కొబ్బరి నూనె మరియు బాదం నూనెను మిక్స్ చేయాలి. దీన్ని అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్నిక్రమం తప్పకుండా చేస్తుంటే దురద మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

మహువ: ఇది భారతదేశంలో చాలా పాపులర్, ఫ్లవర్స్, బెరడు, మరియు ఆకులు వివిధ రకాలా ఆయుర్వేద మెడిసిన్స్ లో ఉపయోగిస్తున్నారు. దీని నుండి పొందిన ఆకులు ఇన్ స్టాంట్ రిలీఫ్ ఇస్తాయి . ఎగ్జిమాను నివారిస్తుంది.
ఉపయోగించే విధం:
ఒక కట్ట మహువ ఆకలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ సేస్ట్ ను ఎగ్జిమాకు కారణమయిన ప్రదేశంలో అప్లై చేసి బ్యాండేజ్ చుట్టుకోవాలి. దుదర, ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత ప్రతి 3, 4గంటలకు బ్యాండేజ్ మార్చుతుండాలి.
కీరదోస: కీరదోసకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ కు గురైన ప్రదేశంలో దీన్ని అప్లై చేయడం వల్ల మంటను చల్లార్చుతుంది, దురదను నివారిస్తుంది.
ఉపయోగించే విధానం:
ఫ్రెష్ గా ఉండే కీరదోసకాయ రసంలో కాటన్ డిప్ చేసి, సమస్య ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి.
డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

బాదం:
బ్యూటీ మరియు స్కిన్ ప్రొడక్ట్స్ లో బాగా పాపులర్ అయినది. బాదంలో చర్మానికి అవసరమయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. . ఎగ్జిమాతో బాధపడే వారికి ఇది ఒక గ్రేట్ రెమెడీ. యుర్సోలిక్, మరియు ఓలియక్ యాసిడ్స్ నయం చేసే గుణాలు కలిగి ఉండటువల్ల ఇన్ఫ్లమేషన్ వెంటనే తగ్గుతుంది.
ప్రభావిత ప్రాంతంలో కొద్దిగా బాదం ఆయిల్ ను అప్లై చేస్తే సరిపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications