For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకం సమస్యను నివారించగలిగే ఆక్యుప్రెషర్ పాయింట్స్ : ఇక్కడ నొక్కితే మీకు బాత్రూం సమస్యలు ఉండవు

|

రోజులో అనేక క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడం మానవ జీవితంలో సహజం. కానీ ఈ మలబద్దక సమస్యను ఎదుర్కొనే వారికి, ఇదే ప్రధాన సమస్యగా ఉంటుంది. క్రమంగా బాత్రూం వైపు చూస్తేనే కాళ్ళలో వణుకు మొదలవుటుంది. ప్రేగులలో కదలికలు సరిగ్గా లేకపోవడం మూలంగా మలవిసర్జనలో సమస్యలు ఎదుర్కోవడం పరిపాటిగా ఉంటుంది. దీని వెనుక గల కారణాలు అనేకం. కానీ క్రమంగా ఈ సమస్య మీ మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

అటువంటి సందర్భంలో, తక్షణ ఉపశమనం కోసం ఆలోచన చేస్తుంటారు, అవునా ? ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, ఆక్యుప్రెషర్ మీకు సహాయం చేయగలదు. మీ వేళ్లతో ఒక ప్రత్యేకమైన భాగంపై కొంత ఒత్తిడిని కలిగించడం ద్వారా, మీ ప్రేగు కదలికలు స్పష్టంగా జరిగి, మలవిసర్జన సజావుగా సాగే అవకాలు ఉన్నాయి.

సమస్యను రూపుమాపాలి అంటే అనేక చికిత్సలను అనుసరించడం పరిపాటి, అందులో ఏది సమస్యను రూపుమాపుతుందో ఆయా సమస్య తీవ్రతను అనుసరించి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆక్యుప్రెషర్ కూడా. కొన్ని సందర్భాలలో ఇదే ప్రధమ చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆక్యుప్రెషర్ వాస్తవానికి సులభమైన చర్యగా ఉండడమే కాకుండా, మెరుగైన ఫలితాలను కూడా రాబట్టగలదు. లేదా ఇతర చికిత్సల్లో తోడ్పాటునైనా అందివ్వగలదు.

సరైన ఆక్యుప్రెషర్ పాయింట్ మీద సరైన ఒత్తిడిని దరఖాస్తు చేయడం ద్వారా, ఇది పూర్తి స్థాయిలో పనిచేయవచ్చు! మరింత తెలుసుకోవాలనుకుంటే ముందుకు సాగండి.

అసలేమిటీ ఆక్యుప్రెషర్ పాయింట్ ? శరీరంలో ఎక్కడ ఉంటుంది ?

అసలేమిటీ ఆక్యుప్రెషర్ పాయింట్ ? శరీరంలో ఎక్కడ ఉంటుంది ?

ఆక్యుప్రెషర్ నిపుణులు ఈ ప్రాంతాన్ని "శక్తి సముద్రం" గా సూచిస్తుంటారు. ఈ స్థానం ఎక్కడ ఉంది ? అంటే, ఇది మీ నాభి భాగానికి కొన్ని అంగుళాలు క్రిందుగా ఉంటుందని చెప్పడమైనది.

ఎలా కొలవాలి

ఎలా కొలవాలి

మీ చూపుడు వేలు యొక్క వెడల్పుని (పొడవు కాదు) కొలవండి. దీనిని 3 తో గుణించండి. మీ వేలు వెడల్పు అంగుళం అనుకుంటే, అప్పుడు మీ నాభి క్రింద 3 అంగుళాల దూరంలో. మీరు ఒత్తిడిని కలిగించాల్సి ఉంటుంది.

ఆచరించే విధానం :

ఆచరించే విధానం :

మీరు బాత్రూంలో ఉన్నప్పుడు, మూడు వేళ్లను ఉపయోగించి పాయింట్ని నొక్కండి. ఈ విధంగా 1 నుండి 3 నిమిషాల వరకు, ఒత్తిడిని ప్రేరేపించండి.

ఒక్కోసారి 10 సెకండ్లలోపునే, మీ సమస్య తీరిపోతుంది. అలా కాని ఎడల, 2 నుండి 3 నిమిషాలు ఒత్తిడిని కలిగించడం తప్పనిసరి అవుతుంది.

Most Read : ఆ అబ్బాయిని అలా ఊహించుకోలేదు, ఏ డౌట్ వచ్చినా నన్నే అడిగేవాడు, చివరకు అలా చేశాడు #mystory390

ఇది ఎలా పని చేస్తుంది?

ఇది ఎలా పని చేస్తుంది?

ఆ ప్రాంతంలో నొక్కినప్పుడు మీ జీవక్రియలను క్రియాశీలపరచి, మలవిసర్జనను ప్రేరేపించే హీలింగ్ ఎనర్జీ ఉత్పన్నమవుతుంది. మీకు ఇదివరకే తెలుసు, శరీరంలోని విషతుల్య రసాయనాల నిర్మూలనకు ఇటువంటి శక్తిస్థాయిలు అవసరమని. వాస్తవానికి, ఉదర కండరాలపై చేసే మసాజ్ కూడా మీ ప్రేగులను కదిలిస్తుంది.

ఇతర ప్రయోజనాలు :

ఇతర ప్రయోజనాలు :

అదనంగా, ఈ ప్రాంతంలో ఒత్తిడిని కలిగించడం ద్వారా, జీర్ణ సమస్యలు, గ్యాస్, ఋతు తిమ్మిరి, మరియు మల విసర్జన సమయంలో పురీషనాళం నొప్పులు కూడా ఉపశమనం గావించబడుతాయి.

అదనపు చిట్కా

అదనపు చిట్కా

కూర్చుని ఉన్న పొజిషన్ (వెస్టర్న్ టాయిలెట్ సిస్టం) తీసుకునే బదులుగా, స్క్వాటింగ్ (ఇండియన్ టాయిలెట్ సిస్టం) విధానం మీకు మరింత సహాయం చేయగలదు. ఈ విధానం కూర్చొని ఉన్న స్థితి కన్నామెరుగైన ప్రేగు కదలికలకు అనుకూలంగా ఉంటుంది.

సహనం :

సహనం :

కొన్నిసార్లు, ప్రేగు కదలికలకు సమయం పడుతుంది, మీరు ఓర్పును కోల్పోవచ్చు కూడా. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఓర్పును కోల్పోకుండా, ప్రయత్నించి చూడండి. క్రమంగా మెరుగైన ఫలితాలను సాధించగలరు. అలాకాకుండా సహనం కోల్పోయి పురీష నాళం మీద అధిక ఒత్తిడి కలుగచేసినప్పుడు. అది మలద్వారం వద్ద గాయాలకు కూడా కారణం కావొచ్చు. క్రమంగా పైల్స్, ఫిషర్స్ (మూలశంక, మొలలు) వంటి ఇతర సమస్యలతో పాటుగా, హార్ట్ ఎరిత్మియా వంటి ప్రాణాంతక సమస్యకు కూడా దారితీయగలదు. కావున జాగ్రత్త తప్పనిసరి.

ఇతర జాగ్రత్తలు :

ఇతర జాగ్రత్తలు :

మీ ప్రేగు కదలికలు మొదలైతే, వెంటనే బాత్రూం వెళ్ళేలా చర్యలు తీసుకోవాలి. అధిక సమయం తీసుకోరాదు. మీకు క్రియాశీల జీవనశైలి ఉందని నిర్ధారించుకోండి. లేకపోతే, వారానికి కనీసం ఒక గంట ఏరోబిక్స్ చేయడం మంచిది.

Most Read : గరుడ సంజీవని మనిషిని తిరిగి బతికిస్తుందా, సంజీవని మొక్క విశిష్టత, ఉపయోగాలు

ఫైబర్ తినండి :

ఫైబర్ తినండి :

మీ ఆహార ప్రణాళికలో సరైన మోతాదులో పీచుపదార్ధాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. డైల్యూటెడ్ ఫైబర్ ఉండే బెర్రీలు, బీన్స్, ఫ్లాక్స్ సీడ్, బ్రౌన్ రైస్ మరియు ప్రూనే వంటి ఆహార పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోండి.

లైంగిక, వ్యాయామ విషయాల కోసం

లైంగిక, వ్యాయామ విషయాల కోసం

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Acupressure point for constipation, press here to poop

Acupressure Point For Constipation: Press Here To Poop Well
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more