For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడంలో బంగాళాదుంప బాగా సహాయపడుతుందని తెలుసా...

మీరు తీసుకునే ఆహారాలలో మంచి ఫైబర్ కంటెంట్ కలిగినది ఏదైనా బరువును తగ్గించడంలో, మంచి జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో ఉత్తమంగా పరిగణించబడుతుంది. బంగాళాదుంపలు ఫైబర్లో పుష్కలంగా ఉంటాయి, ఇవి బరువు నష్టాన్ని

|

బంగాళాదుంప ఆహార ప్రణాళిక బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుందని మీకు తెలుసా ? ఈ బంగాళాదుంపలో ఉండే మంచి కార్బొహైడ్రేట్లు మీ శరీరానికి సరిపడా శక్తిని సమకూర్చడంలో ఎంతగానో సహాయం చేయగలదు. ఈ ఆహార ప్రణాళిక, బరువు తగ్గించడంలో సహాయపడడమే కాకుండా, రోజంతా శరీరం చురుకుగా ఉండేలా సహాయపడగలదని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. బంగాళా దుంప ఆహార ప్రణాళికతో బరువు తగ్గించడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. మీరు సహజసిద్దమైన మార్గంలో బరువు తగ్గించుకోవాలని భావించిన ఎడల, ఈ మూడు బంగాళాదుంప ఆహార ప్రణాళికలను అనుసరించి చూడండి. సంబంధిత వివరాలను ఇప్పుడు బోల్డ్స్కై మీతో పంచుకుంటుంది.

Potato Diet Plan To Loose Weight

బంగాళాదుంపలు కొవ్వు పెరుగుదలకు ఏమాత్రం కారణం కాదని మీకు తెలుసా ?

అవును మీరు విన్నది నిజమే బంగాళాదుంపలు కొవ్వు పెరుగుదలకు ఏమాత్రం కారణం కాదు, బదులుగా బరువు నష్టాన్ని ప్రోత్సహిస్తుంది. క్రమంగా అధిక బరువు కలిగిన వ్యక్తులలో జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కూడా. అందుచేత అధిక బరువుతో కూడుకుని ఉన్న పిల్లలకు, వారి ఆహార ప్రణాళికలలో భాగంగా బంగాళాదుంపలను కలిగి ఉండేలా చూసుకోవడం మంచిదిగా సూచించడమైనది. ఇవి వారి శరీరానికి రోజంతా చురుకుగా ఉండేలా శక్తిని అందిస్తుంది.

ఈ బంగాళాదుంప ఆహార ప్రణాళికను బోల్డ్స్కై మీతో పంచుకుంటుంది. మీరు మీ నడుము, తొడలు మరియు చేతుల చుట్టూ చేరిన అధిక కొవ్వును తొలగించుకోవాలని భావిస్తున్న ఎడల, ఈ ఆహార ప్రణాళిక మీకు చక్కగా సరిపోగలదు. బంగాళా దుంపలు అధిక కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటాయని, అవి తింటే ఊబయానికి దారితీస్తుందని అపోహలు ఉన్నాయి. కాని, ఇందులో ఉండే కొవ్వు పదార్ధాలు వాస్తవానికి ఆరోగ్యకరమైనవి, మరియు మీ శరీరానికి అత్యంత అవసరమైనవి. ఇందులో కొవ్వు పదార్దాలే కాకుండా, విటమిన్ సి, విటమిన్ B6 మరియు పొటాషియం నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మీ శరీర జీవక్రియలు చక్కగా సాగేందుకు ఎంతగానో అవసరమవుతాయి. కానీ ఏ ఆహారమైనా అతిగా తీసుకుంటే నష్టాన్నే మిగులుస్తాయి. కావున, ఒక ప్రణాళికాబద్దంగా సరైన మోతాదులలోనే శరీరానికి అందించాల్సి ఉంటుందని మర్చిపోకండి.

అధిక బరువు తగ్గించుకోవటానికి బంగాళాదుంప ఆహార ప్రణాళిక ఎలా అనుసరించాలో చూడండి. మరియు బంగాళాదుంపలలోని కేలరీలను తొలగించుకోడానికి మీకు సహాయపడే కొన్ని మార్గాలను కూడా తెలుసుకోండి. బరువు తగ్గడంలో సహాయం చేసే బంగాళాదుంప ఆహార ప్రణాళిక :

ఆహార ప్రణాళిక: 1

ఆహార ప్రణాళిక: 1

బంగాళాదుంపలను ముక్కలుగా కోసి, బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు ఒవెన్లో కాల్చండి (బేక్ చేయడం). 6 భాగాలుగా విభజించి ఎటువంటి మసాలాలు జోడించకుండా, వేడిగా తీసుకోండి. ఈ ఆహార ప్రణాళికను 7 రోజులు వరుసగా అనుసరించండి మరియు ఈ ఆహార ప్రణాళికలో భాగంగా అధిక నీటిని తీసుకోవాలని గుర్తుంచుకోండి.

ఆహార ప్రణాళిక: 2

ఆహార ప్రణాళిక: 2

ఇది కూడా బరువును తగ్గించడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. ఇందులో ఆలివ్ నూనె మరియు చిటికెడు ఉప్పుతో 4 నుండి 6 బంగాళాదుంపలను ఒవెన్లో కాల్చి తీసుకోవలసి ఉంటుంది. రోజులో కనీసం ఒకసారి ఈ ప్రణాళికను అనుసరించేలా ఒక వారం పాటించవలసి ఉంటుంది.

ఆహారం ప్రణాళిక: 3

ఆహారం ప్రణాళిక: 3

మూడు ఉడికించిన బంగాళాదుంపలను తీసుకోండి, మరియు వాటిని ఒక స్పూన్ ఉపయోగించి బాగా చిదమండి. దీనికి అల్లం మరియు వెల్లుల్లిని జోడించి కాల్చి తీసుకోండి. శరీరంలోని పేరుకున్న అధిక కొవ్వును తొలగించడానికి ఈ రెండు మసాలా దినుసులు కూడా తోడ్పాటునందిస్తాయి. క్రమంగా సమర్థవంతంగా బరువు తగ్గించుకోవడంలో ఈ ఆహార ప్రణాళిక సహాయం చేయగలదు.

ఆకలిని తగ్గిస్తుంది :

ఆకలిని తగ్గిస్తుంది :

ఈ బంగాళా దుంపలలో ఉండే డైల్యూటెడ్ ఫైబర్తో పాటు, అధికంగా ఉండే మంచి కార్బోహైడ్రేట్ల కారణంగా మీరు తరచుగా ఆకలిబారిన పడకుండా చూడగలదు. మీకు ఆకలి కలిగినప్పుడు కాల్చిన బంగాళా దుంపలను తీసుకునేలా ప్రయత్నించండి. క్రమంగా ఈ అలవాటు, మీ ఆకలిని అరికట్టడంలో ఉత్తమంగా సహాయం చేయగలదు.

Most Read :ఇద్దరికీ విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి, బలవంతంగా అందులో పాల్గొనేందుకు ట్రై చేశాడు #mystory392Most Read :ఇద్దరికీ విదేశాల్లో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి, బలవంతంగా అందులో పాల్గొనేందుకు ట్రై చేశాడు #mystory392

అదనపు కొవ్వును తొలగించడంలో :

అదనపు కొవ్వును తొలగించడంలో :

అవును, మీరు విన్నది నిజమే ? మీరు ఈ బంగాళాదుంప ఆహార ప్రణాళికను క్రమం తప్పక అనుసరిస్తున్న ఎడల, అది స్వయంచాలకంగా అదనపు కొవ్వులను తొలగించగలదు.

పిండి పదార్ధాలలో అధికంగా :

పిండి పదార్ధాలలో అధికంగా :

బంగాళా దుంపలు పిండి పదార్ధాలలో పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ ఆకలి కోరికలను తగ్గించడంతోపాటు, కడుపు నిండిన అనుభూతికి లోనుచేస్తుంటాయి. క్రమంగా ఆహారం మీదకు ఆలోచన వెళ్ళకుండా మనసును అదుపులో ఉంచుతుంది. తద్వారా శరీరానికి అదనపు కేలరీలు అందడాన్ని నిరోధిస్తూ, ఊబకాయం తగ్గించడంలో సహాయం చేస్తుంది.

శరీరంలో శక్తిస్థాయిలను పెంచుతుంది :

శరీరంలో శక్తిస్థాయిలను పెంచుతుంది :

బంగాళాదుంపలు కూరగాయల ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆహారాలలో ఒకటిగా ఉంది. మీరు బంగాళాదుంప ఆహార ప్రణాళికను అనుసరిస్తున్న ఎడల, శరీరంలో శక్తిస్థాయిలు కూడా క్రమంగా పెరుగుతాయి. క్రమంగా వ్యాయామం సమయంలో అలసట లేకుండా సహాయం చేయగలదు.

విటమిన్లలో పుష్కలంగా :

విటమిన్లలో పుష్కలంగా :

మీరు ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉండేందుకు శరీరానికి అవసరమైన విటమిన్ C మరియు B6 వంటి విటమిన్లు బంగాళా దుంపలలో పుష్కలంగా ఉంటాయి. మీ శరీరానికి కార్బోహైడ్రేట్ల కన్నా ఎక్కువగా విటమిన్లు అవసరమవుతాయి కనుక మీరు తీసుకునే అధిక విటమిన్లు, అదనపు పౌండ్లను తొలగించే అవకాశం లేకపోలేదు.

ఫైబర్లో అధికంగా :

ఫైబర్లో అధికంగా :

మీరు తీసుకునే ఆహారాలలో మంచి ఫైబర్ కంటెంట్ కలిగినది ఏదైనా బరువును తగ్గించడంలో, మంచి జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో ఉత్తమంగా పరిగణించబడుతుంది. బంగాళాదుంపలు ఫైబర్లో పుష్కలంగా ఉంటాయి, ఇవి బరువు నష్టాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు మీ కడుపును నిండినట్లు ఉంచడం మూలంగా తరచుగా ఆహారం మీదకు ద్యాస వెళ్ళకుండా చేయగలుగుతుంది. క్రమంగా ఇది బరువు తగ్గడంలో ఉత్తమంగా సహాయపడగలదు. బరువు తగ్గాలని భావించేవారు, ఫైబర్ నిల్వలు ఉన్న ఆహార పదార్ధాలను ఎంచుకోవడమే మంచిది.

MostRead :రోగాల బారినపడకుండా పెద్దవాళ్లంతా ఈ టీకాలు వేయించుకోవాలి, వయస్సు పెరిగే కొద్దీ టీకాలే అవసరం

అధికంగా నీరు :

అధికంగా నీరు :

అధికంగా నీటి నిల్వలు కలిగి ఉన్న ఆహార పదార్ధాలు, మీ కడుపును నింపడానికి సహాయపడడమే కాకుండా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. బంగాళాదుంపలలో నీటి నిల్వలు అధికంగా ఉన్న కారణాన, బరువు తగ్గడంలో సూచించదగిన ఉత్తమ ఆహార పదార్ధాలలో స్థానం సంపాదించుకుంది.

బరువు తగ్గడంలో కేవలం ఆహార ప్రణాళికలను అనుసరిస్తే సరిపోదు. దీనికి అదనంగా ఆరోగ్యకర జీవన శైలి, క్రమం తప్పని వ్యాయామం, ధూమపానం మద్యపానం వంటి వ్యసనాలను దూరంగా ఉంచడం మొదలైనవి కూడా కీలకంగా ఉంటాయి. మరియు బంగాళా దుంపలు మాత్రమే బరువును తగ్గిస్తాయి అని చెప్పడం లేదు., బరువు తగ్గించడంలో సహాయపడగల లక్షణాలు బంగాళా దుంపలలో ఉన్న కారణాన, మీ ఆహార ప్రణాళికకు జోడించదగిన ఉత్తమ ఆహారంగా ఉంటుందని ఆరోగ్య నిపుణుల సూచనగా ఉంది. బంగాళా దుంపల మీద ఉన్న అపోహలను వీడనాడండి. క్రమంగా మీ ఆహార ప్రణాళికలో చేర్చుకుని మెరుగైన ఫలితాలను పొందండి. బంగాళా దుంపలలో ఉన్న కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ నిల్వలు ఆరోగ్యకరమైనవే అని గుర్తుంచుకోండి.

మీకు నచ్చినట్లయితే

మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Potato Diet Plan to Lose Weight

Potato Diet Plan To Loose Weight
Desktop Bottom Promotion