For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకం సమస్యతో బాధ పడుతున్నారా ? అయితే ఈ 7 చిట్కాలు మీకు తప్పక ఉపశమనాన్ని ఇవ్వగలవు.

అధిక మోతాదులో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మూలంగా అవి సరిగ్గా జీర్ణంకాక మలబద్దక సమస్యలు తలెత్తవచ్చు. చిప్స్, పాస్తా, మొదలైన అనారోగ్యకర పిండి పదార్థాలను తరచుగా తీసుకుంటున్నవారైతే, మీ జీర్ణవ్యవస్థ ప్రతికూ

|

మలబద్దకం అనేది, తరచుగా ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణమైన సమస్యలలో ఒకటిగా ఉంటుంది. కొందరికి సమయానుసారం తగ్గిపోయినప్పటికీ, కొందరికి అత్యంత బాధాకరమైన అంశంగా పరిణమిస్తుంటుంది. క్రమంగా బాత్రూం వెళ్ళాలంటేనే ఒకింత భయాందోళనకు లోనవుతూ ఉంటారు. మలబద్దకం తలెత్తిన వ్యక్తులకు స్టూల్ పాస్సింగ్ సరిగ్గా ఉండదు. పైగా పరిస్థితి తీవ్రతరం అయిన పక్షంలో వేరే ఇతర పైల్స్, ఫిషర్ వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులకు కూడా దారితీస్తుంది.

అనేకమంది ప్రజలు రోజువారీ సమస్యలలో భాగంగా దీనిని ప్రధాన సమస్యగా కలిగి ఉన్నారు. క్రమంగా బాత్రూం వెళ్ళాలన్న ఆలోచన వస్తేనే, శరీరంలో వణుకు మొదలయి, ఆ సెషన్ కూడా స్కిప్ చేస్తుంటారు. ఆ బాధ వర్ణనాతీతం. దీనికి అనేక అంశాలు వెనుక కారణాలుగా ఉన్నా, పరిస్థితి తీవ్రం కాకముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఈ సమస్య ఎదుర్కొనే వారు, తరచుగా కడుపు ఉబ్బరం, గాస్, అజీర్ణం, ఛాతీలో మంట వంటి అనేక ఇతర సమస్యలను కూడా కలిగి ఉంటారు.

నిజానికి, వైద్యుల ప్రకారం, ప్రతిరోజూ ఉదయాన్నే క్రమంతప్పకుండా మలవిసర్జన గావించడం ఒక ఉత్తమమైన ఆరోగ్యకర అలవాటుగా ఉంటుంది. ఈ అలవాటు కారణంగా, ముందురోజు తీసుకున్న ఘన, ద్రవ ఆహార పదార్ధాల కారణంగా ప్రేగులలో పేరుకున్న వ్యర్ధాలు మరియు విషతుల్య పదార్ధాలను విసర్జించి, క్రమంగా మీ శరీరానికి జీవక్రియల తోడ్పాటును పెంచేందుకు అనుమతిస్తుంది.

కావున ఉదయాన్నే మీరు మలవిసర్జనగావించక పొతే, ఈ విషతుల్య రసాయనాలు రక్తప్రవాహంలోకి చేసి, అదనపు సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ఈ సమస్యల ప్రవాహంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇక్కడ పొందుపరచిన చిట్కాలను అనుసరించి చూడండి.

1. ఒక స్క్వాటింగ్ టాయిలెట్ సీటర్ ఉపయోగించండి

1. ఒక స్క్వాటింగ్ టాయిలెట్ సీటర్ ఉపయోగించండి

కమ్మోడ్ టాయిలెట్ బదులుగా, ఇండియన్ స్టైల్ టాయిలెట్ మోడల్ వినియోగించడం మంచిదిగా సూచించబడుతుంది. అలాగని వెస్టర్న్ టాయిలెట్ మోడల్ సరికాదు అని చెప్పడం లేదు, ఈ సమస్యతో బాధ పడేవారికి సూచించదగిన టాయిలెట్ సీట్ స్క్వాటింగ్ మోడల్. ఈ పద్దతిలో ప్రేగులు మడతకు గురికాకుండా ఉన్న ఎడల, మలవిసర్జన సజావుగా కొనసాగుతుంది.

2. వ్యాయామం

2. వ్యాయామం

శారీరక శ్రమ వ్యర్థాలను త్వరగా వెలికి తీయడానికి ప్రేగులను ప్రేరేపిస్తుందని మనకు తెలియనిదికాదు. ప్రతిరోజూ ఉదయం పూట క్రమంతప్పకుండా వ్యాయామం చేయటానికి గల మరొక మంచి కారణంగా కూడా ఉంటుంది.

3. ప్రోబయోటిక్స్ తీసుకోండి

3. ప్రోబయోటిక్స్ తీసుకోండి

శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడుమీరు రాత్రిపూట పెరుగు లేదా యోగర్ట్ వంటి ప్రోబయోటిక్ పదార్ధాలను తీసుకుంటున్న ఎడల, వీటిలోని మంచి బ్యాక్టీరియా మీ ప్రేగులను మరింత సరళతగా ఉండేలా వీలు కల్పిస్తుంది, క్రమంగా మీ ప్రేగు కదలికలు సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

Most Read :శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడుMost Read :శ్రీకృష్ణుడు అఘాసురుడుని ఎందుకు చంపుతాడు? అందగాడైన అఘాసురుడు కొండ చిలువలా ఎందుకు మారాడు

4. మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోండి

4. మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోండి

మీరు అజీర్ణ సమస్యలు లేదా మలబద్ధకంతో బాధపడుతున్నట్లయితే, మెగ్నీషియం సప్లిమెంట్ తీసుకోవడం గురించి మీ వైద్యునితో చర్చించడం మంచిది. ఎందుకంటే ఈ ఖనిజాలు మీ స్టూల్స్ వదులుగా చేసి, మలవిసర్జన సజావుగా సాగడంలో సహాయం చేస్తాయి. తరచుగా కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ద్వారా కూడా శరీరానికి సరిపడా మోతాదులో మెగ్నీషియం అందించవచ్చు.

5. అనారోగ్య కార్బోహైడ్రేట్లను నివారించండి

5. అనారోగ్య కార్బోహైడ్రేట్లను నివారించండి

అధిక మోతాదులో కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మూలంగా అవి సరిగ్గా జీర్ణంకాక మలబద్దక సమస్యలు తలెత్తవచ్చు. చిప్స్, పాస్తా, మొదలైన అనారోగ్యకర పిండి పదార్థాలను తరచుగా తీసుకుంటున్నవారైతే, మీ జీర్ణవ్యవస్థ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. క్రమంగా మీ జీర్ణవ్యవస్థ పనితీరు కూడా నెమ్మదిగా మందగిస్తుంది. కావున వీలైనంత వరకు అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన పదార్ధాలను దూరంగా ఉంచి, డైల్యూటెడ్ ఫైబర్ నిల్వలు ఉండేలా పీచు పదార్ధాలవైపు మొగ్గు చూపడం మంచిది.

6. తరచుగా నిలబడండి

6. తరచుగా నిలబడండి

ఎక్కువగా కూర్చుని చేసే ఉద్యోగాలలో ఉన్నవారు, ఈ సమస్యలను ఎదుర్కోవడం పరిపాటిగా ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్ ఆపరేటర్స్, సాఫ్ట్వేర్ ఇంజినీర్స్. ఎక్కువగా డెస్క్ అంటుకుపోయి ఉండే ఉద్యోగాలలో ఉన్నవారు, లేదా అదేపనిగా కంప్యూటర్ గేమ్స్ అలవాటు పడినవారు, ఈ సమస్యను తరచుగా ఎదుర్కొంటూ ఉంటారు. కావున కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా పైకి లేచి తిరుగుతూ, విశ్రాంతి తీసుకోవడం చేయాలి.

Most Read :ఈ రాశుల వారికి గర్వం ఎక్కువ.. చచ్చేలోపు పగ సాధిస్తారుMost Read :ఈ రాశుల వారికి గర్వం ఎక్కువ.. చచ్చేలోపు పగ సాధిస్తారు

7. నిమ్మకాయ నీరు తాగండి

7. నిమ్మకాయ నీరు తాగండి

ప్రతిరోజూ ఉదయం నిమ్మకాయతో కూడిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను నెమ్మదిగా దూరం చేయవచ్చు. నిమ్మకాయలోని విటమిన్-సి మలవిసర్జన సజావుగా సాగడంలో సహాయం చేయగలదు.

English summary

7 Simple Tricks to help you pass stools easily in the morning

7 Simple Tricks To Help You Pass Stools Easily In The Morning
Desktop Bottom Promotion