Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక!
కరోనా తర్వాత నుంచి చాలామందిలో ఆరోగ్య సృహ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే చాలామంది పాదాల విషానికొచ్చేసరికి పెద్దగా పట్టించుకోరు అనేది కాదనలేని సత్యం. కానీ, మీ పాదాలు మీ లివర్ ఆరోగ్యానికి అద్దం పడతాయని మీకు తెలుసా? నడిచేటప్పుడు లేదా నిలబడినప్పుడు మీ పాదాలలో కనిపించే కొన్ని చిన్న మార్పులు, మీ లివర్ లోపల ఏం జరుగుతుందో చెప్పే అలారం లాంటివి.

శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో, రక్తం గడ్డకట్టడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. లివర్ పనితీరు మందగించినప్పుడు, శరీరంలో రక్తప్రసరణ దెబ్బతిని ఆ ప్రభావం పాదాలపై స్పష్టంగా కనిపిస్తుంది. నిపుణుల ప్రకారం.. లివర్ వ్యాధిని ముందుగానే పసిగట్టే 4 ప్రధాన లక్షణాలు పాదాలలో ఇలా కనిపిస్తాయి.
పాదాల వాపు (పెడల్ ఎడెమా)
కారణం లేకుండా మీ పాదాలు, చీలమండలు నిరంతరం ఉబ్బుతున్నాయా? లివర్ తగినంత అల్బుమిన్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల రక్తనాళాల నుంచి ద్రవాలు లీక్ అయి పాదాల్లో చేరి వాపునకు గురవుతాయి. ఇది లివర్ సమస్యకు తొలి సంకేతం కావచ్చు.
చర్మం, కాలిగోళ్లు పసుపు రంగులోకి మారడం
రక్తంలో బిలిరుబిన్ లెవల్స్ పెరిగినప్పుడు కామెర్లు వస్తాయి. ఈ పసుపు రంగు కేవలం కళ్లలోనే కాదు, అరికాళ్లు, పాదాల చర్మం, గోళ్లలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లివర్ పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నదనడానికి ఇది సంకేతం.
అరికాళ్లలో భరించలేని దురద
రాత్రి పూట అరికాళ్లలో విపరీతమైన దురద కలుగుతుంటే తేలికగా తీసుకోవద్దు. లివర్ సరిగ్గా పనిచేయక రక్తంలో పైత్యరస లవణాలు పేరుకుపోవడం వల్లే ఈ దురద వస్తుంది. ఇతర లక్షణాలు బయటపడక ముందే కనిపించే ముందస్తు హెచ్చరిక ఇది.
చిన్న దెబ్బకే కమిలిపోవడం లేదా రక్తస్రావం
ఎక్కడైనా చిన్నగా తగిలినా లేదా అసలు గాయం కాకపోయినా పాదాలపై చర్మం కమిలిపోవడం, ఎర్రటి మచ్చలు ఏర్పడటం జరుగుతుంటే.. లివర్ రక్తాన్ని గడ్డకట్టించే ప్రోటీన్లను సరిగ్గా ఉత్పత్తి చేయడం లేదని అర్థం చేసుకోవాలి.
ఎప్పుడు అప్రమత్తం కావాలి?
ఈ లక్షణాలు వారం రోజుల కంటే ఎక్కువ కాలం ఉండి, వాటితో పాటు విపరీతమైన అలసట, నీరసం ఉంటే వెంటనే హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ కి చూపించాలి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్, డయాబెటిస్, అధికంగా మందు తాగే అలవాటు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఏం చేయాలి?
మీ పాదాలలో ఈ మార్పులు గమనిస్తే వెంటనే డాక్టర్ ని కలిసి లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), రక్త పరీక్షలు లేదా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. పాదాల్లో ప్రతి చిన్న మార్పు లివర్ వ్యాధి కాకపోవచ్చు కానీ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో డాక్టర్ ను సంప్రదించడం ద్వారా పెను ముప్పును ముందుగానే నివారించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications