Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతోందా?..ఇలా చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది!..
రుచికరమైన భోజనం చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఇష్టమైన కడుపునిండా ఆబగా తినేస్తుంటాం. కానీ తిన్న కాసేపటికే కొంతమందికి కడుపు ఉబ్బరం (Bloating) సమస్య మొదలవుతుంది. పొట్టలో గ్యాస్ చేరి, బెలూన్ లా ఉబ్బిపోయినట్లు అనిపించడం, కడుపు బిగదీసినట్లు ఉండటం, ఊపిరి పీల్చుకోవడానికి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించడం.. ఈ సమస్యలు చాలా మందిని నిత్యం వేధిస్తుంటాయి.

కడుపు ఉబ్బరం అనేది పెద్ద వ్యాధి కాదు, మన అలవాట్లలో ఉన్న చిన్న చిన్న లోపాలే దానికి ప్రధాన కారణం. ప్రముఖ డాక్టర్ మనీషా మిశ్రా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవడానికి కొన్ని అద్భుతమైన, సులభమైన చిట్కాలను పంచుకున్నారు. డాక్టర్ మనీషా మిశ్రా పంచుకున్న ఈ ఐదు సులభమైన సూచనలను పాటిస్తే, మీ జీర్ణవ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా మారుతుంది. ఉబ్బరం నుంచి ఎలా బయటపడాలో ఇక్కడ చూడండి.
ఆహారాన్ని బాగా నమిలి తినండి
హడావిడి జీవనశైలి కారణంగా చాలా మంది భోజనాన్ని ఐదు నిమిషాల్లో ముగించేస్తుంటారు. సరిగ్గా నమలక ముందే ఆహారాన్ని మింగేస్తారు. డాక్టర్ మనీషా చెబుతున్న మొదటి సూచన ఏమిటంటే.. భోజనాన్ని ఎల్లప్పుడూ నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. జీర్ణక్రియ అనేది మన నోట్లోనే మొదలవుతుంది. ఆహారాన్ని బాగా నమలడం వల్ల అది సులభంగా జీర్ణమవుతుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా పొట్టలోకి వెళ్లి గ్యాస్, ఉబ్బరం సమస్యలను తెచ్చిపెడుతుంది.
పోస్ట్ నాజల్ డ్రిప్ ఉందేమో గమనించండి
కడుపు ఉబ్బరానికి, ముక్కుకు సంబంధం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? కచ్చితంగా సంబంధం ఉంది. మీకు ఎప్పుడైనా గొంతు వెనుక భాగంలో శ్లేష్మం లేదా కఫం కారుతున్నట్లు అనిపిస్తుందా? దీన్నే పోస్ట్ నాజల్ డ్రిప్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మనం తెలియకుండానే పదే పదే గాలిని, శ్లేష్మాన్ని మింగుతూ ఉంటాము. ఇది నేరుగా కడుపులోకి వెళ్లి గ్యాస్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. కాబట్టి, జలుబు లేదా అలర్జీల వల్ల ఈ సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
స్ట్రాలు, చిన్న మూతి ఉన్న బాటిల్స్ వాడకండి
బయట కూల్ డ్రింక్స్ లేదా జ్యూస్ లు తాగేటప్పుడు స్ట్రాలు వాడటం చాలా మందికి అలవాటు. అలాగే సన్నని మూతి ఉన్న వాటర్ బాటిల్స్ నుంచి నీళ్లు తాగడం కూడా చేస్తుంటారు. ఇలా తాగడం వల్ల ద్రవాలతో పాటు ఎక్కువ గాలిని కూడా మనం లోపలికి పీల్చుకుంటాము. ఈ అదనపు గాలి పొట్టలోకి చేరి ఉబ్బరానికి కారణమవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎప్పుడూ గ్లాసులో పోసుకుని తాగడం అలవాటు చేసుకోండి.
తిన్న వెంటనే పడుకోకండి
మధ్యాహ్నం భోజనం చేయగానే కాసేపు కునుకు తీయాలనిపిస్తుంది. అలాగే రాత్రి డిన్నర్ ముగించిన వెంటనే మంచం ఎక్కేస్తుంటారు. కడుపులోని ఆహారం సరిగ్గా జీర్ణం కావాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది. తిన్న వెంటనే పడుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది, గ్యాస్ పైకి తన్ని ఛాతీలో మంట (యాసిడ్ రిఫ్లక్స్) వస్తుంది. భోజనం తర్వాత కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు చిన్నగా నడవడం అలవాటు చేసుకోండి.
కార్బోనేటెడ్ డ్రింక్స్ కు దూరంగా ఉండండి
సోడాలు, కూల్ డ్రింక్స్ లాంటివి తాగితే అప్పటికప్పుడు హాయిగా అనిపిస్తుంది కానీ, ఇవి కడుపు ఉబ్బరానికి ప్రధాన శత్రువులు. ఈ డ్రింక్స్ లో ఉండే గ్యాస్ నేరుగా మీ పొట్టలోకి వెళ్లి చేరుతుంది. దీనివల్ల పొట్ట టైట్ గా మారిపోయి ఉబ్బరం వస్తుంది. వీటికి బదులుగా నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటి సహజ పానీయాలను ఎంచుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
