Latest Updates
-
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే!
Mosquito: వర్షాకాలంలో దోమల టెన్షన్..ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే ఇంటి నుంచి పరిగెడతాయ్!
వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు చల్లటి చిరుజుల్లల ఆనందంతో పాటు దోమల టెన్షన్ కూడా ఉంటుంది. వానాకాలంలో ఇంటిల్లిపాదికీ కంటిమీద కునుకు లేకుండా చేసేది దోమల బెడద. చిన్న దోమలైనా అవి సృష్టించే ప్రభావం చాలా పెద్దది. ఒకసారి కుట్టాయంటే చర్మం ఉబ్బి, తీవ్రమైన దురదతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వానాకాలంలో నీరు నిలిచి ఉండటం, వాతావరణం తేమగా మారడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందుతాయి. ఇది కేవలం అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి అనేక భయంకరమైన వ్యాధులకు కారణమవుతుంది.
అయితే దోమలు కుట్టుకుండా లేదా దోమలు ఇంట్లోకి రాకుండా చేసేందుకు చాలామంది రసాయనాలతో కూడిన స్ప్రేలు వంటి కొన్ని ఖరీదైన ప్రొడక్టులను కూడా వాడుతంటారు. అయితే ఖరీదైన ప్రొడక్టులు ఏవీ అక్కర్లేకుండానే మీ ఇంట్లో ఉండే కొన్ని సాధారణ వస్తువులతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరి ఈ వర్షాకాలంలో దోమల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.

దోమలకు సహజసిద్ధమైన, ప్రభావవంతమైన పరిష్కారం
దోమలను తరిమికొట్టడానికి ఒక అద్భుతమైన, సహజసిద్ధమైన పద్ధతి ఉంది. ముందుగా కొన్ని ఆవు పేడ పిడకలు తీసుకోండి. వాటిపై కొద్దిగా కొబ్బరి నూనె చల్లి ఒక గిన్నెలో ఉంచండి. దానిపై కొన్ని ఎండిన వేప ఆకులు, రెండు-మూడు కర్పూరం బిళ్ళలు వేయండి. ఈ మిశ్రమాన్ని ఇంట్లో దోమలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఉంచండి. ఆ తర్వాత దీనికి నిప్పంటించండి. ఆవు పేడ పిడకల నుండి వచ్చే పొగతో పాటు, వేప ఆకులు, కర్పూరం నుండి వెలువడే సువాసన దోమలను క్షణాల్లో తరిమికొడుతుంది. కేవలం 5 నిమిషాల్లో మీ ఇల్లు దోమరహితంగా మారుతుంది. ఈ పద్ధతి పూర్తిగా సహజమైనది కాబట్టి మీ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదు. ఇది రసాయనాలతో కూడిన స్ప్రేల కంటే సురక్షితమైనది, ప్రభావవంతమైనది.
అదనపు చిట్కాలు
దోమలను తరిమికొట్టడానికి మరికొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవేంటో చూడండి.
ఫినైల్ మాత్రలు, వేప నూనె: ఒక ఫినైల్ మాత్రపై కొద్దిగా వేప నూనె వేసి ఈ ద్రావణాన్ని ఇంటి మూలల్లో, కిటికీల దగ్గర పిచికారీ చేయండి. ఇది దోమలను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది.
ఉల్లిపాయ రసం: ఉల్లిపాయ రసాన్ని నీటిలో కలిపి ఇంటి మూలల్లో పిచికారీ చేయడం వల్ల కూడా దోమలు దరిచేరవు. ఉల్లిపాయలో ఉండే ఘాటైన వాసన దోమలకు నచ్చదు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా మీరు వర్షాకాలంలో దోమల బెడద నుండి విముక్తి పొంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం
ఇంటి లోపల, బయట పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగు కాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. వర్షాకాలంలో ఇంటి తోటల్లో కొబ్బరి చిప్పలు, పగిలిన కుండీలు, ఇతర వస్తువుల్లో నీరు చేరి దోమల ఉత్పత్తికి కేంద్రాలుగా మారతాయి. వీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి లేదా శుభ్రం చేయాలి. దోమల వల్ల వచ్చే వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications