Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు!
నార్త్ ఇండియాలోనే కాకుండా సౌతిండియాలో కూడా చాలామందికి బ్రేక్ ఫాస్ట్ లేదా నైట్ డిన్నర్ లో రోటీ లేదా చపాతీ ఉండాల్సిందే. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది షుగర్, ఫ్యాటీ లివర్ సమస్యలో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్లకి అయితే రెగ్యులర్ గా తినే సాధారణ గోధుమ రోటీ ఎలాంటి మేలు చేయకపోవచ్చు.

సాధారణ గోధుమ పిండిలో శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కూడా చాలా ఎక్కువే. దీనివల్ల రోటీ తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఏ పిండితో చేసిన రోటీలు తింటే ప్రయోజనకరమో ఇక్కడ చూడండి.
షుగర్ ని కంట్రోల్ లో ఉంచే అద్భుతమైన పిండి రకాలు
డయాబెటిస్ ఉన్నవాళ్లు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా చాలా జాగ్రత్త పడాలి. దీనికోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండి, పీచుపదార్థం (ఫైబర్) మెండుగా ఉండే పిండి పదార్థాలను ఎంచుకోవడం బెటర్.
బార్లీ పిండి
బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కరిగే పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదింపజేసి, గ్లూకోజ్ (చక్కెర) నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదలయ్యేలా చేస్తుంది. దీనివల్ల షుగర్ ఎప్పుడూ కంట్రోల్ లో ఉంటుంది.
శనగపిండి
శనగపిండి ప్రోటీన్లు, ఫైబర్ కు ఒక అద్భుతమైన మూలం. గోధుమ పిండికి బదులుగా లేదా అందులో కాస్త శనగపిండి కలిపి చేసిన చపాతీలు తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆకలి త్వరగా వేయదు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో చక్కగా పనిచేస్తుంది.
మిల్లెట్స్
రాగులు, జొన్నలు, సజ్జలు వంటి ముతక ధాన్యాలలో సంక్లిష్ట (కాంప్లెక్స్) కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. గోధుమ పిండిలో కొద్దిగా రాగి లేదా సిరిధాన్యాల పిండిని కలపడం వల్ల డయాబెటిస్ ను సులభంగా జయించవచ్చు.
ఫ్యాటీ లివర్ సమస్యను తరిమికొట్టే పిండి రకాలు
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నప్పుడు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే ధాన్యాలు ఎంతో అవసరం. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఓట్స్ పిండి
ఓట్స్ లో ఉండే అమితమైన పీచుపదార్థం లివర్ లో అదనపు కొవ్వు పేరుకుపోకుండా ఒక రక్షణ కవచంలా అడ్డుకుంటుంది. అంతేకాకుండా, గుండెకు ముప్పు తెచ్చే చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
జొన్న పిండి
జొన్నల్లో గ్లూటెన్ అస్సలు ఉండదు. పైగా ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. కాలేయ వాపును తగ్గించడానికి, శరీరంలోని హానికరమైన విషపదార్థాలను బయటకు పంపడానికి జొన్న రొట్టెలు అద్భుతంగా ఉపకరిస్తాయి.
అవిసె గింజలు - గోధుమ పిండి మిశ్రమం
ఇంట్లో వాడే గోధుమ పిండిలో కాస్త అవిసె గింజల పొడిని (ఫ్లాక్స్ సీడ్ పౌడర్) కలిపి రోటీలు చేసుకుని తినండి. అవిసె గింజలలో పుష్కలంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మీ కాలేయ పనితీరును అమాంతం మెరుగుపరుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
