Latest Updates
-
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ..
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్..
లివర్ అనేది మన శరీరంలో ఉండే అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన సాలిడ్ ఆర్గాన్. లివర్ కి కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫ్యాట్ మెటబాలిజంలో చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. మనం తిన్న ఫుడ్ జీర్ణం అవ్వాలన్నా , శరీరానికి కావాల్పినచ శక్తి అందాలన్నా కూడా లివర్ పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా మనం తినే ఫుడ్ లోని కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఫ్యాట్ మెటబాలిజం ప్రక్రియలో పగలు రాత్రి తేడా లేకుండా లివర్ పనిచేస్తుంటది.
అంతేకాకుండా బ్లడ్ క్లాట్ అవ్వాలన్నా కూడా లివర్ చాలా ఇంపార్టెంట్. అంటే అనుకోకుండా మతనకు ఏదైనా గాయం అయితే రక్తం వృధాగా పోకుండా గడ్డకట్టడానికి(బ్లడ్ క్లాటింగ్)అవసరమైన కారకాలను ఉత్పత్తి చేసేది కూడా లివరే. మన శరీరానికి అవసరమయ్యే విటమిన్, మినరల్స్ ముందుగానే స్టోర్ చేసుకుని అవసమైనప్పుడు వాటిని శరీరానికి అందిస్తుంది.

ఇన్ని రకాలుగా మనల్ని కాపాడే లివర్ ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే మన శరీరంలోని మలినాలన బయటకు పంపే లివర్ ను డీటాక్సిఫై చేయడానికి అంటే మీ లివర్ క్లీన్ అవ్వాలంటే 5 అద్భుతమైన,ముఖ్యమైన టిప్స్ ను డాక్టర్ దీప్తి కరేటి తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.
నీరు ఎక్కువగా తాగడం
లివర్ లోని మలినాలను బయటకు పంపడానికి ఇది చాలా ఈజీ, ఖర్చులేని పని. రోజూ తగినంత నీళ్లు తాగడం ద్వారా శరీరంలోని విషతల్యాలు మూత్రం, చెమట ద్వారా ఈజీగా బయటకు పోతాయి. శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉంటే లివర్ పనితీరు మరింత యాక్టివ్ గా ఉంటది, దీంతో లివర్ పై అదనపు భారం తగ్గుతుంది.

ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి
లివర్ కు అతిపెద్ద శుత్రువు మందే. మీకు మందు తాగే అలవాటు ఉంటే లివర్ ఆరోగ్యం కోసం వెంటనే మానేయంది. మందు తాగడం వల్ల లివర్ కణాలు దెబ్బతిని ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశముంటది. మందు పూర్తిగా మానేస్తే లివర్ తనను తాను శుభ్రం చేసుకుని తిరిగి ఆరోగ్యంగా మారుతుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్,ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకుండా ఉండాలి
ఇంట్లో వండిది కాకుండా బయట దొరికే జంక్ ఫుడ్ తినడం, ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం, నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు తినడం మానేయాలి. వీటిల్లో ఉండే ట్యాన్స్ ఫ్యాట లివర్ చుట్టూ కొవ్వుగా మారి దాని పనితీరును తగ్గిస్తుంది.
బ్యాలెన్డ్ ఫుడ్ తినడం
తినే ఆహారంలో ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ సరైన మోతాదులో అంటే బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవడం అవసరం. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృధాన్యాలు ఎక్కువగా ఉండేలా ఫ్లాన్ చేసుకోండి.
రెగ్యులర్ ఎక్సర్ సైజ్
కేవలం డైట్ మాత్రమే కాకుండా శారీరక శ్రమ కూడా లివర్ కు ముఖ్యం. రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం లేదా యోగా, వాకింగ్ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా శరీరంలోని అదనపు క్యాలరీలు, కొవ్వు కరిగి లివర్ పై ఫ్యాట్ పేరకపోకుండా ఉంటది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
