Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Menstrual Hygiene Day: క్లాత్ ప్యాడ్స్ వాడుతున్నారా? ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసా?
అమ్మాయిలు రుతుక్రమం వేళ ఉపయోగించే శానిటరీ ప్యాడ్‌లది ఓ విప్లవం అనే చెప్పాలి. యూజ్ అండ్ త్రో శానిటరీ ప్యాడ్ లు తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో పాటు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అలా శానిటరీ ప్యాడ్‌లకు మంచి ఆదరణ లభించింది. అయితే ఈ శానిటరీ ప్యాడ్‌ల వల్ల పర్యావరణం కలుషితం అవుతోంది. అందుకే తిరిగి శానిటరీ ప్యాడ్‌ల స్థానంలో క్లాత్, మెన్‌స్ట్రువల్ కప్స్ వాడాలని ప్రచారం కల్పిస్తున్నారు.
క్లాత్ ప్యాడ్స్ సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. వీటిని శుభ్రం చేసుకుంటే తిరిగి మళ్లీ మళ్లీ వాడే వెసులుబాటు ఉంటుంది. కానీ వీటిని శుభ్రం చేయడాన్ని చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతారు. క్లాత్ ప్యాడ్స్ ను శుభ్రం చేసుకోవాలి, తిరిగి వాడేలా ఎలా కడుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లాత్ ప్యాడ్ ప్రయోజనాలు
1. పర్యావరణ అనుకూలమైనది:
క్లాత్ ప్యాడ్‌లు పర్యావరణ అనుకూలమైనవి. ప్లాస్టిక్, నాన్-బయోడిగ్రేడబు్ మెటీరియల్స్ తో తయారు చేయబడిన డిస్పోజబుల్ ప్యాడ్‌ల మాదిరిగా కాకుండా, క్లాత్ ప్యాడ్‌లు పత్తి, జనపనారతో తయారు చేస్తారు. వీటిని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. అలాగే వీటి వల్ల పర్యావరణ కాలుష్యం జరగదు.
2. ధర ఎక్కువే, కానీ..:
శానిటరీ ప్యాడ్‌లతో పోలిస్తే క్లాత్ ప్యాడ్‌ల ధర ఎక్కువగానే ఉంటుంది. కానీ వీటిని చాలా కాలం పాటు వాడటం వల్ల శానిటరీ ప్యాడ్‌ల కంటే తక్కువ ఖర్చు అవుతుంది.
3. సౌకర్యం:
క్లాత్ ప్యాడ్ లు చాలా సౌకర్యంగా ఉంటాయి. డిస్పోజబుల్ ప్యాడ్‌ల మాదిరిగా కాకుండా చాలా సౌకర్యంగా ఉంటాయి. అలాగే ఇవి చాలా తేలికగా, బ్రీతెబుల్‌గా ఉంటాయి. చర్మానికి చికాకు కలిగించే రసాయనాలు, సింథటిక్ పదార్థాలు ఉండవు.
క్లాత్ ప్యాడ్‌లను ఎంతకాలం వాడొచ్చు?
క్లాత్ ప్యాడ్‌లను చాలా కాలం పాటు సంవత్సరాల పాటు వాడొచ్చు. అయితే ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. మెన్‌స్ట్రువల్ ఫ్లో, క్లాత్ ప్యాడ్ స్థితిని బట్టి ఎంతకాలం వాడాలనేది ఆధారపడి ఉంటుంది. ప్రతి రెండు నుండి 5 సంవత్సరాలకు ఒకసారి క్లాత్ ప్యాడ్‌లను మార్చాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. క్లాత్ ప్యాడ్‌లను సమర్థవంతంగా వాడాలంటే వాటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
క్లాత్ ప్యాడ్‌లను శుభ్రం చేసుకోవడం ఎలా?
1. ప్యాడ్ తీసిన వెంటనే దానిని 30 నిమిషాల పాటు చల్లని నీటిలో నానబెట్టాలి. క్లాత్ ప్యాడ్‌లను తీసిన వెంటనే నీటిలో నానబెట్టాలి. దీని వల్ల మరకలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే వేడి నీటిని ఉపయోగించొద్దు. వేటి నీరు వాడితే ప్యాడ్‌లపై మరకలు అలాగే ఉండిపోతాయి.
2. 30 నిమిషాల పాటు నానబెట్టిన తర్వాత ప్యాడ్‌లను శుభ్రంగా కడుక్కోవాలి. క్లాత్ ప్యాడ్‌ను ముందుకు నానబెట్టడం వల్ల మరకలు త్వరగా పోతాయి. నీటిని ఆదా చేయవచ్చు.
3. ప్యాడ్‌లను నేచురల్, పర్యావరణ అనుకూలమైన సబ్బును ఉపయోగించి కడుక్కోవాలి. నీటిలో 30మి.లీ. లిక్విడ్ సోప్ వేసి అందులో ఓ 10 నిమిషాల పాటు ప్యాడ్‌లను నానబెట్టాలి. ఈ లిక్విడ్ క్లెన్సర్ ఎటువంటి అవశేషాలను వదిలిపెట్టకుండా, క్లాత్ ప్యాడ్‌లను సమర్థవంతంగా శుభ్రపరుస్తుంది. అలాగే క్లాత్‌ను మృదువుగా ఉంచుంది.
4. ప్యాడ్‌లను వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటే సహజమైన డిటర్జెంట్ లేదా సబ్బును వాడాలి. అలాగే ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్లను ఉపయోగించవద్దు. వాటి వల్ల క్లాత్ యొక్క శోషణ తగ్గిపోతుంది.
5. ప్యాడ్‌లను ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టడం వల్ల క్లాత్ ప్యాడ్‌లు పొడిగా మారడంతో పాటు క్రిములు నశిస్తాయి. సరైన సంరక్షణ పద్ధతుల తో క్లాత్ ప్యాడ్‌లను సంవత్సరాల పాటు వాడొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications