Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.!
చలికాలంలో చర్మం పాడవకుండా ఉండాలంటే ఈ 6 జాగ్రత్తలు పాటించాలి!
సాధారణంగా చలికాలంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే చర్మం పొడి బారడం, చర్మం పగిలిపోవడం, చర్మంపై రాషెస్ రావడం, మొటిమలు వంటి సమస్యలు అధికమవుతాయి. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండేందుకు వాటి నుంచి రక్షణ పొందేందుకు ఈ చలికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మ సమస్యల నుంచి ఊరట పొందొచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బెస్ట్ మాయిశ్చరైజర్ వాడడం..
చలికాలంలో అతిపెద్ద చర్మ సమస్య ఏదైనా ఉందంటే అది చర్మం పొడిబారడం. అలాగే చర్మం పగిలిపోవడం. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి మాయిశ్చరైజర్ వాడాల్సిందే. మంచి నూనె, కెమికల్స్ లేని మాయిశ్చరైజర్ వాడితే చాలా మంచిది. మంచి లోషన్ లేదా ఆయిల్ ఉన్న మాయిశ్చరైజర్ వాడడం వల్ల చర్మంపై ఒక లేయర్ ఏర్పడుతుంది. ఇది చర్మంలోని తేమను లాక్ చేసి ఉంచుతుంది. తద్వారా చర్మం పొడిబారకుండా ఉంటుంది. అందుకే సరైన మాయిశ్చరైజర్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.

హీటర్ వాడితే ఇవి మర్చిపోవద్దు!
చలికాలంలో చలి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది రూమ్ హీటర్లు వాడుతుంటారు. అయితే హీటర్లు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హీటర్లకు దగ్గర ఎట్టిపరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. అలాగే రూమ్ టెంపరేచర్‌ను మించి టెంపరేచర్ సెట్ చేసుకోకూడదు. అలా చేసుకోవడం వల్ల చర్మం చాలా సులభంగా పొడిబారుతుంది. ఒకవేళ రూమ్ హీటర్లు వాడితే ఆ గదిలో ఒక పెద్ద గిన్నెల్లో నీళ్లను ఉంచాలి.
ఎందుకంటే ఆ గిన్నెలోని నీరు ఆవిరై గదిలోని తేమను అలాగే సజావుగా ఉంచుతుంది. హీటర్లు లేదా హ్యుమిడిఫైర్ వినియోగించిన మంచి ఫలితాలను పొందవచ్చు. అనవసరమైన సమయాల్లో కూడా రూమ్ హీటర్ రావడం మంచిది కాదు.
క్లెన్సింగ్..
చలికాలంలో చర్మానికి క్లెన్సింగ్ చాలా మృదువుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గట్టిగా కొంచెం కఠినంగా క్లెన్సింగ్ చేసుకోవడం వల్ల చర్మంలోని తేమ మొత్తం ఆవిరైపోయే అవకాశం ఉంటుంది. దీనిద్వారా చర్మం పగిలిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు తలెత్తోచ్చు. అలాగే చర్మంలోని సహజసిద్ధమైన నూనె కూడా బయటికి వెళ్ళిపోతుంది. అందుకే క్లెన్సింగ్‌ను మృదువుగా చేసుకోవాలి. అలాగే హైలురోనిక్ యాసిడ్, గ్లిసర్టెన్ ఉన్న క్లెన్సర్లు వాదితే మంచి ఫలితాలు పొందొచ్చు.
పుష్కలంగా నీరు తాగాలి..
మన శరీరం, చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలంటే తప్పనిసరిగా తగినంత నీరు తాగాలి. అప్పుడే చర్మానికి కావాల్సిన నీరు అందుతుంది. అలాగే చర్మం కూడా ఎప్పుడూ తేమతో సజీవంగా కనిపిస్తుంది. చలికాలం కాబట్టి మూత్రం ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంతో చాలామంది నీటిని చాలా తక్కువగా తాగుతుంటారు. అయితే ఈ చలికాలంలో కూడా నీటిని ఎక్కువగా తాగడం వల్ల చేమాం పొడిబారకుండా తేమతో ఉంటుంది.
పోషకాల ఆహరం..
ఎన్ని కెమికల్స్, క్రీమ్స్ వాడి సరైన ఆహరం లేకపోతే కచ్చితంగా చర్మానికి సంబంధించిన సమస్యలను నివారించలేము. చర్మ సమస్యలు తొలిగిపోవాలంటే యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్స్, ఒమేగా 3 వంటి ఖనిజాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిలోని పోషకాలు చర్మాన్ని యవ్వనంగా మార్చడంతో పాటు చర్మ సంబంధిత సమస్యల నుంచి దూరం చేస్తాయి.
సన్‌స్క్రీన్ ముఖ్యం బిగిలు..
చలికాలంలో సాధారణంగానే ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలాగే చలి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఎండలో నిలబడుతుంటారు. ఈ క్రమంలో అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ చలికాలంలో సన్‌స్క్రీన్ వినియోగించడం కూడా చాలా ముఖ్యం. ఎలాంటి రసాయనాలు లేకుండా మంచి ఉపయోగాలు కలిగిన సన్‌స్క్రీన్ వాడితే మంచి ప్రయోజనాలను పొందొచ్చు.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications