Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
నోరు శుభ్రంగా లేకపోయినా హార్ట్ అటాక్ వస్తుంది..జాగ్రత్త! లక్షణాలు, నివారణ ఇలా
ఆరోగ్య పరంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తున్ ఆరోగ్య సమస్య హార్ట్ అటాక్. ఎక్కడ చూసిన హార్ట్ అటాక్ మరణాలు. గతంలో వృద్ధులు మరియు గుండె జబ్బులఉన్న వారికి మాత్రమే హార్ట్ అటాక్ వచ్చేంది. దానికి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలతో భ్రతికేవారు. కానీ ప్రస్తుతం కాలంలో హార్ట్ అటాక్ అంటనే చావు. సైలెంట్ లక్షణాలతో హార్ట్ అటాక్ తో చనిపోయే వారికి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏటా మిలియన్ల కొద్ది గుండెపోటుతో చనిపోతున్నారు. గుండెపోటు మరణాలలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ , కరోనరీ హార్ట్ డిసీజ్ ద్వారా చనిపోతున్నారు. మయోకార్డియల్ ఇన్పార్జన్ అని పిలవబడే గుండెపోటు సమయంలో గుండ కండరాలకు తగినంత రక్తం ప్రసరించని కారణంగా గుండె పోటు వస్తుంది. గుండెపోటు యొక్క లక్షణాలను సకాలంలో గుర్తించడం మరియు తగిన చర్యలు తీసుకోవడం ద్వారా, మీరు ఈ తీవ్రమైన సమస్య కారణంగా మీ జీవితాన్ని కోల్పోకుండా నివారించవచ్చు.
మీకు తెలుసా, హార్ట్ అటాక్ కు ముందు, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక ఇతర లక్షణాలు కూడా దంతాలు మరియు చిగుళ్ళలో కనిపిస్తాయి. గుండెపోటు సమయంలో దంతాలు మరియు చిగుళ్ళలో కనిపించే లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గుండెపోటుకు కారణాలు
ఆహారం మరియు జీవనశైలి లోపాలు, ధూమపానం, మద్యపానం వంటి అనేక పరిస్థితులు గుండెపోటుకు కారకాలు. గుండెపోటు లక్షణాలు ముందుగా గుర్తించినట్లైతే సరైన సమయంలో వైద్యుల సలహాలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాధకరమై సమస్యను నివారించవచ్చు. గుండె పోటు అంటే ఛాతీ నొప్పి భుజయం నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెడ, దవడ,చేతులు, పొత్తికడుపులో నొప్పి ఇలాంటి లక్షణాలే ఇప్పటి వరకు మనకు తెలిసినవి. కానీ మీకు తెలుసా గుండె పోటు లక్షణాలు నోట్లో కూడా కనబడుతాయి. దంతాలు చిగుళ్ళలో మురికి కారణంగా గుండె సిరలు బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. దాంతో గుండె జబ్బులు వస్తాయి.
చిగుళ్ళు మరియు దంతాలలో హార్ట్ అటాక్ లక్షణాలు
దంత క్షయం మరియు చిగుళ్ళ సమస్యలకు హార్ట్ అటాక్ కు మధ్య సంబంధం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు కారణం నోటి అపరిశుభ్రత లేదా సరియైన శుభ్రత పాటించకపోవడం. దంతాలలో చిగుళ్లలో పేరుకుపోయిన మురికి నోటి అపరిశుభ్రత కారణంగా గట్ మైక్రోబయోమ్‌ను నాశనం చేస్తుంది. లక్షణాలు:
- ఆంజినా పెక్టోరిస్ అంటే దంతాలలో తీవ్రమైన నొప్పి
- చిగుళ్ళ వాపు మరియు రక్తస్రావం
- దంతాల్లో సెన్సిటివిటి
- దంతాల నొప్పి తరుచూగా వస్తుండటం, మెడిసిన్ తీసుకున్న తగ్గకపోవడం
- ఆహారం తినేటప్పుడు తీవ్రమైన పంటినొప్పి
- పంటి నొప్పితో చెమటలు పట్టడం
- పంటినొప్పి వల్ల చలి జ్వరం వణుకు

నోటి ఆరోగ్యం గుండెను ఎలా ప్రభావితం చేస్తుంది?
గుండె జబ్బులు వాస్కులర్ నరాలు బ్లాక్ అవ్వడం వల్ల సమస్యలు వస్తాయి. గుండెకు సంబంధించిన ధమని నుండి రక్తాన్ని శరీరంలో ఇతర అవయవాలకు పంపిణీ చేసే ధమనులు నోటి నరాలకు రక్తప్రసరణ అడ్డుకోవడం వల్ల గుండెజబ్బులు పెరుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నోటి ఆరోగ్యం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఈ విషయాలు గుర్తుంచుకోవాలి. నోట్లో దంతాలు చిగుళ్ళ సమస్య ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలి. ఇది నోట్లో బ్యాక్టీరియాను తగ్గించి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని హార్వర్డ్ నిపుణులు సలహా ఇస్తున్నారు.
నోటి అనారోగ్య వల్ల స్ట్రోక్ గుండెజబ్బులు 5 రెట్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె జబ్బులు ఉన్న చాలా మందికి చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగని చిగుళ్ల వ్యాధి ఉన్న వారందరికీ గుండె సమస్యలు ఉండవని హార్వర్డ్ నిపుణులు అంటున్నారు.
అందువల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోజులో కొంత సమయం నోటి మీద శ్రద్ద పెట్టి శుభ్రం చేసుకోవాలి. నోటికి సంబంధించే ఏదైన సమస్య వస్తే వెంటనే డాక్టర్ ను కలిసి చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇది మీ నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

గుండెపోటును నివారించే మార్గాలు
గుండెపోటు నివారించడానికి, మీ ఆహారం మరియు జీవనశైలి అలవాట్లలో మార్పులు చేసుకోవాలి.
కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ అదుపులో ఉంచుకోవాలి.
అందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
ఎక్కువ కారం ఉండే ఆహారాలు మరియు ఆయిల్ ఫుడ్ కు దూరంగా ఉండాలి
మీ ఆహారంలో ఫైబర్ మరియు ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి
ధూమపానం మరియు మద్యపానం మానేయాలి
రోజూ కనీసం 40 నిమిషాలు నడక లేదా యోగ, శ్వాసకోస వ్యాయామాలు చేయండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications