Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పీనట్ బటర్(వేరుశెనగ వెన్న) అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. బరువు తగ్గాలనుకునే వాళ్లు, ఎక్సర్ సైజ్ లు చేసే వాళ్లు తమ ఆహారంలో దీనికి కచ్చితంగా తీసుకుంటారు. అయితే ప్రతిరోజూ ఒక్క టేబుల్ స్పూన్ పీనట్ బటర్ తినడం వల్ల మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉండే పీనట్ బటర్ మన ఆరోగ్యంపై చూపే అద్భుతమైన ప్రభావాల గురించి ఇక్కడ చూడండి.

దృఢమైన ఎముకల నిర్మాణం
మీ ఎముకలు ఎప్పటికీ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే పీనట్ బటర్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇందులో మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకల సాంద్రతను పెంచి, ఎముకలు గుల్లబారకుండా బలోపేతం చేయడానికి అద్భుతంగా సహాయపడతాయి.
గుండె పదిలం
ప్రతిరోజూ ఒక చెంచా పీనట్ బటర్ తీసుకోవడం వల్ల మీ గుండె పదిలంగా ఉంటుంది. పీనట్ బటర్ లో మోనో అన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ వంటి మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధుల ముప్పును దరిచేరనివ్వవు.
అంతులేని శక్తి
ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే ఆ రోజంతా మీ శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల కడుపు నిండిన భావన ఎక్కువ సమయం ఉంటుంది. దీంతో పదే పదే ఆకలి వేయదు, అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. తద్వారా బరువు అదుపులో ఉండటమే కాకుండా, రోజంతా అలసట లేకుండా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతారు.
ఉక్కు లాంటి కండరాలకు
బలమైన కండరాలు కావాలనుకునే వారికి పీనట్ బటర్ ఒక బెస్ట్ ఆప్షన్. ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు ఒక్క టీస్పూన్ పీనట్ బటర్ తీసుకుంటే వారి కండరాలు దృఢంగా మారుతాయి. ఇందులో ఉండే అధిక ప్రోటీన్, దెబ్బతిన్న కండరాలను వేగంగా బాగు చేయడానికి, అలాగే కండరాల పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది.
నిగనిగలాడే అందమైన చర్మం
ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేయడంలో కూడా పీనట్ బటర్ ముందుంటుంది. ప్రతిరోజూ ఒక స్పూన్ పీనట్ బటర్ తినడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మానికి అత్యంత అవసరమైన విటమిన్ E ఇందులో మెండుగా ఉంటుంది. ఇదొక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లా పనిచేసి, చర్మాన్ని ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications