Latest Updates
-
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్..
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్!
ప్రస్తుతం అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటివి సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవనశైలి, వేళకాని వేళల్లో భోజనం చేయడం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది.
కడుపు నిండా తింటే గుండెల్లో మంట, ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్, ఏది తిన్నా కడుపులో ఉబ్బరం ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. వీటిని తగ్గించుకోవడానికి మనం వెంటనే మెడికల్ షాపుల వైపు పరుగులు తీస్తుంటాం. కానీ మన వంటింట్లో ఉండే పోపుల పెట్టెలోనే వీటికి అద్భుతమైన పరిష్కారం దాగి ఉందని మీకు తెలుసా?

ముంబైకి చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ కోచ్ ల్యూక్ కౌటిన్హో (Luke Coutinho) సరిగ్గా ఇదే విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రత్యామ్నాయ వైద్యంలో ఎంతో నిష్ణాతుడైన ల్యూక్ కౌటిన్హోను ఎంతోమంది సినీ తారలు సైతం ఫాలో అవుతుంటారు. మన అమ్మమ్మలు, నానమ్మల నాటి వంట పద్ధతులను తిరిగి అలవాటు చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఆ కాలంలో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా వారు వంటకాల్లో వాడే దినుసుల విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారు.
ఆరోగ్యం పట్ల నేటి స్థాయిలో అవగాహన లేని ఆ రోజుల్లోనే, మన పూర్వీకులు వంటగదిలోని మసాలాలను నేటి సూపర్ ఫుడ్స్ లాగా ఉపయోగించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఇంగువ. పప్పులు, కూరల్లో ఇంగువ వేయనిదే మన పెద్దల వంట పూర్తయ్యేది కాదు. దీనివల్ల వంటకు అద్భుతమైన రుచి, సువాసన రావడమే కాకుండా, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటివి దరిచేరవు. ఇంగువ మన శరీరంలో జీర్ణక్రియకు సహకరించే ఎంజైమ్ ల ఉత్పత్తిని అమాంతం పెంచుతుంది. తద్వారా తిన్న ఆహారం త్వరగా జీర్ణమై, పొట్టకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది.
ఇంగువ మాత్రమే కాదు..
కేవలం ఇంగువ వాడటమే కాదు, మన పెద్దలు పాటించిన కొన్ని వంట పద్ధతులు కూడా ఎంతో శాస్త్రీయమైనవి. పప్పుధాన్యాలను వండే ముందు నీటిలో నానబెట్టడం, ఆవిరి మీద ఉడికించడం లేదా సన్నని మంటపై నెమ్మదిగా వండటం వంటి పద్ధతుల వల్ల ఆహారం యొక్క అంతర్గత నిర్మాణం మారుతుంది. దీనివల్ల జీర్ణక్రియకు ఆటంకం కలిగించే మూలకాలు నశించి, ఆహారంలోని విలువైన పోషకాలు మన శరీరానికి సులభంగా అందుతాయి.
వంటల్లో జీలకర్ర, పసుపు, అల్లం వంటి సహజసిద్ధమైన మసాలాలతో పాటు చిటికెడు ఇంగువను చేర్చడం వల్ల రుచి పెరగడమే కాకుండా, పేగుల ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ అద్భుతంగా మెరుగుపడతాయని ల్యూక్ వివరిస్తున్నారు.
అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఇంగువను మరీ ఎక్కువగా వాడకూడదు. మోతాదు మించితే వంటకం రుచి పాడవడమే కాకుండా ఇతర సమస్యలు వస్తాయని ఆయన గుర్తుచేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
