Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
AIDS Vaccine: టెన్షన్ వద్దు..ఎయిడ్స్ ని పూర్తిగా నయం చేసే వ్యాక్సిన్ వచ్చేసింది!
ఎయిడ్స్..ఈ పేరు వింటేనే చాలామంది భయపడతారు.ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదు అంటించుకునే వ్యాధి అని తెలిసినా కూడా మన పక్కన ఎవరికైనా ఎయిడ్స్ లేదా హెచ్ఐవీ ఉందని తెలిస్తే దూరంగా జరిగిపోతుంటాం. ఎయిడ్స్ పెషెంట్లను ముట్టుకోవడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు. అయితే ఈ భయాలన్నింటికీ కారణం ఏంటంటే ఎయిడ్స్ వ్యాధికి మందు లేకపోవడమే. ఎయిడ్స్ ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ ఉన్నాయి గానీ పూర్తిగా తగ్గించే మందు లేదు. ప్రపంచంలో ఎక్కువ ఎయిడ్స్ కేసులు ఉండేది ఆఫ్రికా దేశాల్లోనే.
ఎయిడ్స్ అనేది హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్(HIV Infection) చివరి దశ. ఇది నాలుగు దశలను దాటి ఎయిడ్స్ కు చేరుకుంటుంది. చివరి దశను AIDS అని పిలుస్తారు. దీని ట్రీట్మెంట్ చాలా కష్టం కానీ HIVకి 100 శాతం నివారణ ఉంది. అయితే ఎయిడ్స్ ని పూర్తిగా ఖతం చేసే మెడిసిన్ మార్కెట్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్(Gilead Sciences)అనే ఫార్మా కంపెనీ హెచ్ఐవీని పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో ఓ వ్యాక్సిన్ ని రెడీ చేసింది.

ఈ వ్యాక్సిన్ కి లెన్‌కావిర్(lenacapavir)అని పేరు పెట్టింది. ఏడాదిలో రెండు సార్లు ఎయిడ్స్ పేషెంట్లు లెన్‌కావిర్ వ్యాక్సిన్ వేసుకుంటే పూర్తిగా ఎయిడ్స్ నయమైపోతుందని ఆ కంపెనీ చెబుతోంది. మహిళలపై తాము నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ 100 శాతం ఎఫెక్టివ్ గా పనిచేసిందని,ఇప్పుడు పురుషులపై కూడా అదే ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతున్నట్లు కంపెనీ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని ప్రయోగిస్తే ఎయిడ్స్ ను ప్రపంచం నుండి అతి త్వరలో నిర్మూలించవచ్చని కంపెనీ అభిప్రాయపడింది.
ధర గురించి కంపెనీ ఇలా
ఈ వ్యాక్సిన్ చాలా చౌకగా అందుబాటులో ఉంచుతామని..దీని జెనరిక్ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని గిలియడ్ తెలిపింది. హెచ్ఐవీ కేసులు ఎక్కువగా ఉన్న దాదాపు 120 పేద దేశాలకు ఇది పంపబడుతుందని తెలిపింది. ఎయిడ్స్‌పై ఐక్యరాజ్యసమితి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమా మాట్లాడుతూ..ఎయిడ్స్‌కు తయారు చేసిన ఈ వ్యాక్సిన్ అంత ప్రభావవంతమైన ఔషధం మరొకటి లేదు. ఇది అద్భుతం అని అన్నారు.
రిపోర్ట్ లో ఇలా
ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఒక రిపోర్ట్ లో..గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ తో మరణించిన వారి సంఖ్య 6లక్షల 30వేలమంది. అయితే 2004లో గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుండి ఇది అత్యల్పంగా ఉందని రిపోర్ట్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్ కేసులు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.99 కోట్ల మంది హెచ్‌ఐవితో బాధపడుతున్నారు. భారత్ లోనూ హెచ్‌ఐవీ రోగుల సంఖ్య 44 శాతం తగ్గింది. గత సంవత్సరం భారతదేశంలో ప్రతిరోజూ 185 మంది భారతీయులకు హెచ్‌ఐవి సోకింది. అంటే గతేడాది కూడా భారత్‌లో 67525 మందికి హెచ్‌ఐవీ సోకింది. మనదేశంలో 2023-24 నాటికి హెచ్ఐవీ పేషెంట్ల సంఖ్య 16.9 లక్షలకు చేరింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications