Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
ఇయర్ బడ్స్ vs హెడ్ ఫోన్స్..మీ చెవుల ఆరోగ్యానికి ఏది మంచిదంటే..
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్ అనేది అందరికీ ముఖ్యమైనవిగా మారిపోయాయి. డ్రైవింగ్ వెళ్లే సమయంలో ఫోన్ మాట్లాడుకోడానికి, మెట్రోలోనో లేదా బస్సులోనో ప్రయాణిస్తున్న సమయంలో చెవుల్లో పెట్టుకొని మ్యూజిక్ వినడానికి లేదా ఫోన్ మాట్లాడటానికి వీటిని ఉపయోగిస్తుంటారు. జర్నీలోనే కాకుండా మిగతా సమయాల్లో కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. చూడటానికి రెండూ మనకు ఆడియో అనుభూతిని అందించినా..వాటి డిజైన్, పనితీరు, మన చెవులపై చూపే ప్రభావంలో చాలా వ్యత్యాసం ఉంది. మీ అవసరానికి, మీ చెవుల ఆరోగ్యానికి ఏది సరైనదో ఇక్కడ చూడండి.
ఎయిర్ పాడ్స్ లేదా ఇయర్ బడ్స్
ఇమర్ బడ్స్ అనేవి వైర్ లెస్ టెక్నాలజీకి ఒక ప్రతీక. అతి చిన్నవి, తేలికైనవి, మన జీవనశైలిలో కలిసిపోయిన ఒక ఫ్యాషన్ ఐకాన్. జేబులో సులభంగా ఇమిడిపోయే ఛార్జింగ్ కేసుతో వచ్చే ఇవి, ప్రయాణాల్లో వ్యాయామం చేసేటప్పుడు గొప్ప స్వేచ్ఛను అందిస్తాయి. వైర్ల చిక్కులు లేకుండా, చెవిలో సౌకర్యంగా ఒదిగిపోయి, స్టైలిష్ లు క్‌ను ఇస్తాయి. చాలా ఎయిర్ పాడ్స్ లో ఉండే నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్, బయటి శబ్దాలను తగ్గించి మనకు కావలసిన ఆడియోపై దృష్టి పెట్టేలా చేస్తుంది. అందుకే వేగం, పోర్టబిలిటీ, స్టైల్ కు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇవి ఫస్ట్ ఆప్షన్ గా నిలుస్తాయి.

హెడ్ ఫోన్స్
హెడ్ ఫోన్స్ మన చెవిని పూర్తిగా కప్పివేసి, బయటి ప్రపంచం నుండి మనల్ని వేరుచేస్తాయి. పరిమాణంలో పెద్దవిగా, బరువుగా ఉన్నప్పటికీ ఇవి అందించే సౌండ్ ఎక్స్ పీరియన్స్ అద్భుతం. సంగీతంలోని ప్రతి చిన్న శబ్దాన్నీ స్పష్టంగా వినగలిగేలా చేస్తాయి. బయటి శబ్దాలను సహజంగానే అడ్డుకోవడం వల్ల..తక్కువ వాల్యూమ్ లో కూడా సంగీతాన్ని స్పష్టంగా ఆస్వాదించవచ్చు. ఎక్కువ గంటలు ఆఫీసులో పనిచేసేవారికి, ఇంట్లో సినిమా చూసేవారికి, నాణ్యమైన సౌండ్ కోరుకునేవారికి హెడ్ ఫోన్స్ ఉత్తమమైనవి.
ఆరోగ్యం, భద్రతకు ఏది మేలు?
చెవుల ఆరోగ్యం విషయానికొస్తే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
ధ్వని ప్రభావం: ఇయర్ బడ్స్ నేరుగా చెవి లోపలికి వెళ్ళి, ధ్వని తరంగాలను నేరుగా కర్ణభేరిపైకి పంపిస్తాయి. ఇది అధిక వాల్యూమ్ లో విన్నప్పుడు చెవిపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. అదే హెడ్ ఫోన్ లు అయితే ధ్వని చెవి బయట నుండి చెల్లాచెదురుగా ప్రయాణించడం వల్ల దాని తీవ్రత కొంత తగ్గి, కర్ణభేరికి సురక్షితంగా ఉంటుంది.
సూక్ష్మక్రిముల ప్రమాదం: ఇయర్ బడ్స్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే చెవిలో తేమ, గులిమి చేరి బ్యాక్టీరియా, ఫంగస్ పెరగడానికి కారణమవుతాయి. ఇది చెవి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. హెడ్ ఫోన్ లు చెవి బయట ఉండటం వల్ల ఈ ప్రమాదం చాలా తక్కువ.
దీర్ఘకాలిక సౌకర్యం: ఎక్కువసేపు ఉపయోగించినప్పుడు చెవి లోపల ఇయర్ బడ్స్ ఒత్తిడిని, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కానీ హెడ్ ఫోన్ చెవి చుట్టూ మెత్తటి కుషన్ లతో ఉండటం వల్ల ఎక్కువసేపు ధరించినా సౌకర్యవంతంగా ఉంటాయి.
ఫైనల్ గా ఏది అవసరం
స్టైల్, పోర్టబిలిటీ, వ్యాయామం వంటి వాటికి ఇయర్ బడ్స్ బెస్ట్ ఆప్షన్. కానీ చెవుల భద్రత, నాణ్యమైన ధ్వని, దీర్ఘకాలిక వాడకం మీ ప్రాధాన్యత అయితే హెడ్ ఫోన్స్ నిస్సందేహంగా మంచివి. మీరు ఏది ఎంచుకున్నా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే..వాల్యూమ్ ను 60 శాతం మించకుండా చూసుకోండి,ప్రతి గంటకు ఒకసారి చిన్న బ్రేక్ తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











