Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
allu arjun : పుష్ప గాడి ఫిట్ నెస్, డైట్ సీక్రెట్స్ ఇవే
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'పుష్ప 2' సినిమా గురువారం(డిసెంబర్ 5)థియేటర్లలో రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. అల్లు అర్జున్ మరో నేషనల్ అవార్డుకి సిద్దంగా ఉండాలని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. పుష్ప పాత్రలో నటించిన అల్లు అర్జున్ లుక్స్, పర్ఫెక్ట్ బాడీ షేప్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ వయస్సు 42 ఏళ్లు అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అల్లు అర్జున్ కి 30 ఏళ్లు అంటే ఎవరైనా నమ్మేస్తారు. దీనికి కారణం ఆయన ఫిట్ నెస్ అని చెప్పవచ్చు. ఆకట్టుకునే ఫిజిక్, మెపు వేగంతో చేసే డ్యాన్స్ బన్నీని స్పెషల్ గా ఉంచుతాయి.
అయితే ఇంత ఫిట్ గా ఉండేందుకు అల్లు అర్జున్ ఏం తింటాడు, ఆయన ఫిట్ నెస్, డైట్ సీక్రెట్స్ తెలుకోవాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అంత ఫిట్‌గా ఉండేందుకు అల్లు అర్జున్ ఎలాంటి వర్కవుట్స్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం.

అల్లు అర్జున్ చేసే ఎక్సర్ సైజ్ లు ఇవే
ఉదయం నిద్రలేచిన వెంటనే 45 నిమిషాల పాటు జాగింగ్ చేస్తానని... తనకు జాగింగ్ అంటే చాలా ఇష్టమని చాలా ఎంజాయ్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.ఇది తన ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతుందని ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తెలిపారు. రోజూ కాలిస్టెనిక్స్ వ్యాయామాలు కూడా చేస్తుంటానని బన్నీ తెలిపారు. కాలిస్టెనిక్స్ అనేది ఒక రకమైన వ్యాయామం. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు ఏ విధమైన పరికరాలు ఉపయోగించరు. కాలిస్టెనిక్స్‌లో పుషప్స్, పుల్‌అప్స్, డిప్స్,జంపింగ్ రోప్ వంటి వ్యాయామాలు ఉంటాయి. అల్లు అర్జున్ రోజూ కాలిస్టెనిక్స్ వ్యాయామాలు కూడా చేస్తుంటాడు. అల్లు అర్జున్ సైక్లింగ్‌ను ఇష్టపడతాడు. సైక్లింగ్ సాధారణ వ్యాయామం కంటే ఎక్కువ ప్రయోజనాలందిస్తుందని బన్నీ నమ్ముతాడు.
అల్లు అర్జున్ డైట్
ఫిట్‌గా ఉండడమంటే కేవలం వర్కవుట్ చేయడమే కాదు సరైన ఆహారాన్ని తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎనర్జిటిక్ గా, అందంగా,ఫిట్ గా కనబడటానికి అల్లు అర్జున్ హెల్తీ డైట్ ని ఫాలో అవుతున్నాడు. అల్లు అర్జున్ ఇంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడం వల్లే ఈ వయసులో కూడా ఫిట్ గా ఉండే అవకాశం ఉంది.
బ్రేక్ ఫాస్ట్ లోకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటాడు. బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా కోడిగుడ్డు ఉండేలా చూసుకుంటాడట. గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ తనను రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుందట.
లంచ్ లో బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటాడు. అందులో కూడా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారట. ఎక్కువగా గ్రిల్డ్ చికెన్ ని లంచ్ లో భాగం చేసుకుంటారు. ఇది మజిల్ బిల్డ్ చేయడానికి, మెటబాలిజం మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బన్నీ స్కిన్ చాలా మెరిసిపోతూ ఉంటుంది. ఇందుకోసం డైట్ లో ఎక్కువగా ఆకు కూరలు, ఫ్రెష్ కూరగాయలు ఉండేలా చూసుకుంటాడు. ఇందులో ఉండే పోషకాలు చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉండేలా చేయడంలోనూ సహాయం చేస్తాయి. సీజనల్ ఫ్రూట్స్ కూడా తన డైట్ లో తీసుకుంటూడు బన్నీ. లంచ్ సమయంలో ఎక్కువగా ఫ్రూట్ షేక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారట.
డిన్నర్ మాత్రం చాలా లైట్ గా తీసుకుంటాడు బన్నీ. ఎక్కువగా బ్రౌన్ రైస్, గ్రీన్ బీన్స్, సలాడ్, కార్న్ లాంటివి తీసుకుంటారు. డిన్నర్ లో క్యాలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకుంటాడు. ఇక, అల్లు అర్జున్ మందు తాగడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications