Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
రోజూ చిన్న చింతపండు ముక్కను చప్పరిస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులివే!
చింతపండు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దాని పుల్లటి రుచి, నోరూరించే వంటకాలు. చిన్నప్పుడు స్కూల్ గేటు బయట ఉప్పు, కారం అద్దుకుని చింతపండు తినడం మనలో చాలామందికి ఒక మధుర జ్ఞాపకం.
అయితే చింతపండు కేవలం రుచిని పెంచే పదార్థం మాత్రమే కాదు, ఇదొక సహజసిద్ధమైన ఔషధ గని అని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ చిన్న చింతపండు ముక్కను పీల్చడం వల్ల శరీరంలో జరిగే అద్భుతాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చింతపండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖ్యంగా చలికాలంలో దీనిని తినడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.

జీర్ణవ్యవస్థకు గొప్ప ఔషధం
చింతపండులో ఉండే టార్టారిక్, మాలిక్ ఆమ్లాలు మన జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తాయి. నిపుణుల ప్రకారం.. చింతపండును పీల్చడం వల్ల లాలాజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి వరం
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే మీ డైట్ లో చింతపండును చేర్చుకోండి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చింతపండును పీల్చడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది,కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అనవసరమైన చిరుతిళ్లు తినకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇమ్యూనిటీ బూస్టర్,డీటాక్స్
చింతపండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా ఇది ఒక సహజమైన డీటాక్స్ ఏజెంట్ గా పనిచేస్తుంది. శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ముఖంలో కొత్త కాంతిని తెస్తుంది.
గుండె పదిలం..కొలెస్ట్రాల్ కు చెక్
గుండె ఆరోగ్యానికి చింతపండు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మధుమేహం, నొప్పుల నివారణ
చింతపండు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉండటం వల్ల ఇది కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చూస్తుంది.
అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.
చింతపండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దీనిని మితంగానే తీసుకోవాలి. మోతాదు మించి తీసుకుంటే ఎసిడిటీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications