Latest Updates
-
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా..
చెవిలో గులిమి ఉందా? ఇయర్ బడ్స్ వద్దు..ఈ హోం రెమెడీస్ తో ఈజీగా క్లీన్ చేసుకోండి
శరీర పరిశుభ్రతకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. అయితే చాలామంది పట్టించుకోని ముఖ్యమైన భాగం మన చెవులు. ప్రపంచంలోని మంచి, చెడు శబ్దాలను మనకు వినిపించే ఈ సున్నితమైన అవయవాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. చెవిలో గులిమి లేదా మురికి ఎక్కువగా పేరుకుపోతే వినికిడి శక్తి మందగించడం, చెవిలో నొప్పి, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. చాలామంది శుభ్రం చేసుకోవడానికి ఇయర్ బడ్స్ (cotton buds) వాడుతుంటారు. అయితే ఇది చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఎందుకంటే బడ్స్ గులిమిని బయటకు తీయడానికి బదులుగా ఇంకా లోపలికి నెట్టి సమస్యను మరింత పెద్దది చేస్తాయి. మరి చెవిలోని గులిమిని సురక్షితంగా ఎలా తొలగించాలి? మీ వంటగదిలోనే దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
చెవిలోని గులిమిని కరిగించే అద్భుతమైన హోం రెమెడీస్
బాదం నూనెతో సున్నితంగా
బాదం నూనెలో ఉండే గుణాలు చెవిలోని గట్టిపడిన గులిమిని మృదువుగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దీనిని ఎలా వాడాలంటే..కొద్దిగా బాదం నూనెను గోరువెచ్చగా చేయండి. తలను ఒకవైపుకు వంచి చెవిలో రెండు లేదా మూడు చుక్కల నూనె వేయండి. ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తలను రెండో వైపుకు వంచితే నూనెతో పాటు మెత్తబడిన గులిమి సులభంగా బయటకు వచ్చేస్తుంది.

ఉప్పు నీటితో సులభంగా
ఇది ఎంతో సులభమైన, పురాతనమైన పద్ధతి. ఉప్పు నీరు గులిమిని కరిగించడానికి సహాయపడుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి బాగా కలపండి. ఈ నీటిలో దూదిని ముంచి, రెండు మూడు చుక్కలు చెవిలో పిండండి. కొద్దిసేపు ఆగి చెవిని కిందికి వంచితే నీటితో పాటు మురికి బయటకు వస్తుంది.
బేబీ ఆయిల్ తో మృదువుగా..
పిల్లల చర్మానికి వాడే బేబీ ఆయిల్ చాలా సున్నితంగా పనిచేస్తుంది. ఇది చెవిలోని గులిమిని సులభంగా తొలగిస్తుంది. చెవిలో మూడు, నాలుగు చుక్కల బేబీ ఆయిల్ వేయండి. తర్వాత ఒక చిన్న దూదిని చెవిలో పెట్టి ఐదు నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత దూదిని తీసేస్తే మెత్తబడిన గులిమి దానంతట అదే బయటకు వస్తుంది.
ఉల్లిపాయ రసంతో సహజంగా
ఉల్లిపాయలో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో పాటు, గులిమిని శుభ్రం చేయడానికి సహాయపడతాయి. చిన్న ఉల్లిపాయ ముక్కను మెత్తగా దంచి లేదా తురిమి, దాని నుండి రసం తీయండి. ఒక డ్రాపర్ లేదా దూది సహాయంతో ఒకటి లేదా రెండు చుక్కల రసాన్ని చెవిలో వేయండి. కొద్దిసేపటి తర్వాత చెవిని వంచితే గులిమి బయటకు వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
