Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
తమలపాకుతో తమాషాలు కాదు..తల్లిలా మేలు,క్యాన్సర్ ని కూడా అడ్డుకుంటుంది!
తమలపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే తమలపాకుల్లో విటమిన్ సి, నియాసిన్, కెరోటిన్, కాల్షియం, రిబోఫ్లావిన్, థయామిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ మెుత్తంలో కొవ్వులు ఉంటాయి. తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనిని మితంగా వాడుకోవాలి. తమలపాకులతో లభించే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.
తమలపాకుతో ప్రయోజనాలివే
- తమలపాకులు యాంటీఆక్సిడెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ప్రొలిఫెరేటివ్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. క్యాన్సర్ ను అడ్డుకోవడంలో ఇవి సహాయపడతాయి.

-చాలా మందికి భోజనం చేసిన తర్వాత పాన్ తినడం అలవాటు. తమలపాకు నమలడం వల్ల జీర్ణక్రియతోపాటు రక్త ప్రసరణ మెరుగుపడుతుందట. ఇందులో ఉండే విటమిన్లు, పోషకాలు ప్రేగులను క్లీన్ చేస్తాయి.
-బరువు తగ్గడంలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది.
-తమలపాకులు నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తాయి. చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్ ఆపి దంతాలను దృఢపరిచే గుణం కలిగి ఉంటది.
-జీర్ణవ్యవస్థకు ఆకుకూరలు ఎలా మేలు చేస్తాయో తమలపాకులు కూడా అంతే పనిచేస్తాయి.
-ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి.
-తమలపాకులను నమలడం వల్ల డిప్రెషన్ నుంచి కూడా బయటపడవచ్చు.
-తమలపాకులు నమలడం వల్ల ఆకలి ఎక్కువగా వేస్తుంది.
- ప్రతిరోజూ తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దచేసి నీళ్లతో తీసుకుంటే బోధకాలు వ్యాధి నుంచి ఉపశమనం
-చర్మంపై అలర్జీ, దురద మొదలైన సమస్యలను తగ్గిస్తాయి.
-గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి. ఛాతీలో నొప్పి, గుండెలో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నావారు తమలపాకుల రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.
-తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసం ప్రయత్నించేవారు తొడిమ తొలగించి వాడుకోవాలి.
-వెన్నునొప్పితో బాధపడేవారు తమలపాకులకు కొద్దిగా నూనె రాసి, నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమం దొరుకుతుంది.
-బాలింతల రొమ్ముల్లో కొన్నిసార్లు పాలు గడ్డకట్టుకుపోతుంటాయి. దాని వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఆ సమయంలో తమలపాకులను కొద్దిగా వేడి చేసి ఛాతిపైన ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
-గాయాలు మానడానికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు. తమలపాకుల రసాన్ని గాయంపై రాసి, దానిపై మరో తమలపాకుని పెట్టి కట్టు కడతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











