Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
కాలేయం సేఫ్ గా ఉండాలంటే పొద్దున్నే ఆ ఎర్రపండు తినాలి..డాక్టర్ చెప్పిన కీలక విషయాలు
మానవ శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయువాల్లో కాలేయం ఒకటి. అనేక ముఖ్య విధులను ఇది నిర్వహిస్తుంది. శరీర నిశ్శబ్ద కార్యనిర్వహణాధికారిగా కాలేయాన్ని అభివర్ణిస్తుంటారు. ఇది తెర వెనుక ఉండి ఆరోగ్యన్ని అప్రతిహతంగా కాపాడుతుంది. ఇలాంటి ముఖ్య అవయువంలో ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా మొత్తం శరీర వ్యవస్థ దెబ్బతింటుంది. ఈ మధ్య కాలంలో ప్రజల లైఫ్ స్టైయిల్ లో వచ్చిన అనేక రకాల మార్పులు కాలేయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
మనదేశంలో కూడా కాలేయ సంబంధిత కేసులు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి..అనేకమంది యువకులు ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు. సాధారణంగా కాలేయంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉంటుంది..కానీ అది కాలేయం బరువులో 5-10శాతం కంటే దానిని ఫ్యాటీ లివర్ అంటారు. అయితే వృద్ధాప్యం వచ్చే దాకా కాలేయాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలనే దానిపై ప్రముఖ లివర్ డాక్టర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా అయిన డాక్టర్ శివకుమార్ సరిన్ ఓ పాడ్ కాస్ట్ లో వివరించారు.

యాపిల్ పండు తింటే ఆరోగ్యానికి మంచిదని తరుచుగా డాక్టర్లు,ఆరోగ్య నిపుణులు చెబుతుంటం మనకు తెలిసిందే. డాక్టర్ శివకుమార్ ప్రకారం..రోజూ పొద్దున్నే 2 యాపిల్స్ తినడం వల్ల కాలేయంతో సహా అన్ని వ్యాధుల ప్రమాదం తగ్గిపోతుంది. యాపిల్ లో ఉంచే పీచు పదార్థం, విటమిన్లు,శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మీ కాలేయాన్ని శుభ్రపర్చడంలో అద్భుతంగా సహాయపడతాయ. కాలేయం నుంచి విష పదార్థాలను బయటకు పంపి కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. కాబట్టి ఎక్కువకాలం కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఉదయం ఖాళీ కడుపుతో రెండు యాపిల్స్ ను మీ దినచర్యలో భాగం చేసుకోవాలని శివకుమార్ సూచించారు.
కాఫీతో కాలేయానికి మేలు
కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుందని అనేకమంది డాక్టర్లు,నిపుణులు చెబుతుందా. డాక్టర్ శివకుమార్ ప్రకారం.. కాఫీ.. లివర్ నుంచి పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుందని, అనేక జర్నల్స్ లో కూడా ఇదే విషయం చెప్పారన్నారు. రోజూ ఓ కప్పు కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్,లివర్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని శివకుమార్ తెలిపారు.
మెడపై మొటిమలు,నలుపు రంగు
మీ మెడపై మొటిమలు లేదా నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. మీ కాలేయంలో కొవ్వు పేరుకుపోతుందనడానికి ఇది సంకేతం కావొచ్చని డాక్టర్ తెలిపారు. చాలామంది బరువు తగ్గినా కూడా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి కేవలం బరువు తగ్గడం ఒక్కటే ముఖ్యం కాదని, మన జీవన విధానాన్ని,ఆహార అలవాట్లు మార్చుకోవడం చాలా అవసరం అని తెలిపారు. ప్రతిరోజూ కనీసం అరగంటపాటు శారీరక శ్రమ చేయాలని,మందు,సిగరెట్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని.. అధికంగా వేయించిన,ప్రాసెస్ చేసిన ఫుడ్స్ కాలేయానికి చాలా హాని కలిగిస్తాయని..వాటికి దూరంగా ఉండటం మంచిదని శివకుమార్ సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications