Latest Updates
-
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.?
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.!
ఎప్పుడైనా కిందపడినప్పుడు శరీరంలో ఎక్కడైనా గాయమై రక్తస్రావం జరిగితే వెంటనే హాస్పిటల్‌కి పరిగెత్తకుండా మొట్టమొదటిగా హోమ్ రెమిడీ ట్రై చేస్తాం. వెంటనే దెబ్బ తగిలిన చోట పసుపు రాస్తాం. పసుపులోని యాంటీబయాటిక్ గుణాల కారణంగా రక్తస్రావం జరగకుండా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ని నివారించి గాయం త్వరగా మానేలా చేస్తుంది. అయితే ప్రతిసారీ ఇలా చేయడం సరైనదేనా.. దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణుల సలహాలు చూద్దాం..

దెబ్బ తగిలి రక్తస్రావం జరిగిన చోట వెంటనే బ్లీడింగ్‌ను ఆపేసేందుకు ప్రథమ చికిత్స చేయడం సహజం. ఇందులో భాగంగా మొదటగా పసుపు పెట్టేస్తారు. అయితే గాయమైన చోట నేరుగా ఏదైనా యాంటీబయాటిక్ గుణాలున్న మెడిసిన్‌ను రాయడం తప్పు అని దీని వల్ల సమస్య ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పసుపు ఎప్పుడు ఉపయోగించాలి.. ఎలాంటి పరిస్థితుల్లో పసుపు వాడకూడదో తెలుసుకోవడం ముఖ్యం.

పసుపు ఎందుకు అప్లై చేస్తారంటే..
పసుపు కేవలం గాయాలకు మాత్రమే కాదు.. జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఫీవర్లలోనూ ఇది సహజ చికిత్సగా పనిచేస్తుంది. ఇందులోని కర్కుమిన్ అనే సమ్మేళనం అంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్ లక్షణాలతో ఉంటుంది. పచ్చి పసుపును గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకోవడం ద్వారా ఉపశమనం కలిగిస్తుంది. అయితే గాయం విషయంలోనూ దీనిని డైరెక్ట్‌గా వాడవచ్చా అనేది తెలుసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ముందుగా గాయమైనప్పుడు రక్తస్రావం జరిగిన చోట డైరెక్టుగా పసుపు పెట్టకూడదు. దానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముందు శుభ్రమైన క్లాత్ లేదా కాటన్‌తో దెబ్బ తగిలిన చోట ఒత్తి పెట్టాలి. రక్తస్రావం జరగకుండా ఆపేందుకు యత్నించాలి. కాటన్, స్పిరిట్‌తో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకోవాలి. గాయం స్వల్పంగా, బ్లీడింగ్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దెబ్బ తగిలిన చోట పసుపు రాయాలి.

వీటిపైన పసుపు వద్దు
హెవీ బ్లీడింగ్ ఉంటే పసుపు రాయకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేసి డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. ఒకవేళ ఏవైనా కాలిన గాయాలతే వాటిపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు, నూనె వంటి పదార్థాలను వాడకూడదని గమనించాలి. గాయం చుట్టూ ఎరుపెక్కడం, వాపు, నొప్పి ఎక్కువగా ఉండటం, చీము పట్టడం, వేడిగా అనిపించడం వంటివి జరిగితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

ఈ సందర్భాల్లో జాగ్రత్త
చిన్నపాటి కోతలు, గాయాలు అయితే చేతులు శుభ్రం చేసుకుని దెబ్బ తగిలిన ప్రాంతాన్ని నీటితో కడిగి అవసరమైతే బ్యాండేజ్ లేదా డ్రెస్సింగ్ వేసుకోవాలి. ఒకవేళ గాయం లోతుగా ఉండటం, జంతుకాట్లు, ఇన్‌ఫెక్షన్ లాంటివి అయితే సొంత చికిత్సలు అస్సలు చేసుకోవద్దు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
