Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
HMPV వైరస్ కారణంగా చైనాలో ఎవరైనా చనిపోయారా? నిజాలు ఇవే!
ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా HMPV గురించే వినిపిస్తుంది. చైనాలో ఈ వ్యాధి శరవేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాల్లో దీని గురించి భయాందోళనలు నెలకొంది. కరోనా మహమ్మారికి సంబంధించిన లక్షణాలే ఉండడంతో పాటు.. వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ గురించిన భయాందోళనలు ఎక్కువ అవుతున్నాయి. ఇది ఇలా ఉండడగా ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా ఈ వైరస్ పాకుతుంది.
మలేషియాలో కూడా..
ఇప్పటికే ఈ వైరస్ జపాన్‌లో విస్తరించగా.. తాజాగా మలేషియాలో కూడా ఈ HMPV వైరస్ కేసులు నమోదైనట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అందుకు బలం చేకూర్చేందుకు మలేషియా ప్రభుత్వం కూడా ప్రకటనలు చేయడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే తమ దేశంలో స్వల్ప మొత్తం కేసులు నమోదైనట్లు అనధికారికంగా ప్రకటించబడింది. ప్రజలు మాస్కులు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలాలని అక్కడి ప్రభుత్వం కోరింది.

దగ్గు, జలుబు వంటి రోగాలు ఉంటే కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ముఖానికి ఏదైనా క్లాత్ అడ్డం పెట్టుకోవాలని సూచించింది. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తమను తామే కాపాడుకోవాలని, అలాగే వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీంతో ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. మలేషియాలో కూడా వైరస్ సోకిందేమో అనే అనుమానాలు నెలకొన్నాయి.
చైనాలో ఎంత మంది చనిపోయారంటే?
HMPV వైరస్ చైనాలో వేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా ఆ దేశంలోని ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రద్దీ ప్రదేశాల్లో ప్రజలందరూ భయాందోళనలతో మాస్కులు వేసుకొని తిరుగుతున్నారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలం కావడం, పైగా దీనికి కూడా ఫ్లూ లక్షణాలు ఉండడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తుంది వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ HMPV వైరస్ కారణంగా చైనాలో చనిపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో ఈ వైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పదుల సంఖ్యలో ఉన్నట్లు పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. చైనాలో స్మశానవాటికలో దహనాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఇది HMPV వైరస్ కారణంగానే జరుగుతున్నాయని తెలుపుతున్నాయి. బయటికి అధికారిక సంఖ్య రావడం లేదు కానీ, మృతి చెందుతున్న వారి సంఖ్య వందల్లోనే ఉందని సమాచారం. అందుకే ఈ వైరస్ కారణంగా చాలా జాగ్రత్తగా ఉండాలని మన దేశ అధికారులు సైతం సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications