Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది? ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి?
స్ట్రోక్..ఈ పదం వింటేనే కొంతమందికి చెమటలు పట్టేస్తాయి. మరణానికి దీనిని ఒక పర్యాయపదంగా చూస్తుంటారు. దీనిని సాధారణంగా పక్షవాతం లేదా మెదడుపై దాడి అని కూడా పిలుస్తారు, ఇది ఒక తీవ్రమైన,ప్రాణాంతకమైన వైద్య అత్యవసర పరిస్థితి.
మెదడుకు రక్త సరఫరాలో అకస్మాత్తుగా అంతరాయం కలగడం వల్ల లేదా మెదడులోని రక్తనాళం చిట్లిపోవడం వల్ల స్ట్రోక్ సంభవిస్తుంది. రక్తం ద్వారా అందే ఆక్సిజన్, పోషకాలు మెదడు కణాలకు చేరనప్పుడు, అవి నిమిషాల్లోనే చనిపోవడం ప్రారంభిస్తాయి. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి, శాశ్వత వైకల్యానికి లేదా మరణానికి దారితీస్తుంది.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO)లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 1 కోటీ 50 లక్షల మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. వీరిలో దాదాపు 5 మిలియన్ల మంది మరణిస్తుండగా, మరో 5 మిలియన్ల మంది శాశ్వత వైకల్యంతో జీవిస్తున్నారు.
స్ట్రోక్‌లో ప్రధాన రకాలు, కారణాలు
స్ట్రోక్ లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి
ఇస్కీమిక్ స్ట్రోక్ (Ischemic Stroke): ఇది అత్యంత సాధారణమైన రకం. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో రక్తం గడ్డకట్టడం వల్ల ఇది ఏర్పడుతుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, స్మోకింగ్ వంటివి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతాయి.
హెమరేజిక్ స్ట్రోక్ (Hemorrhagic Stroke): మెదడులోని రక్తనాళం బలహీనపడి పగిలిపోవడం వల్ల రక్తస్రావం జరిగి ఈ రకమైన స్ట్రోక్ వస్తుంది. అధిక రక్తపోటు దీనికి ప్రధాన కారణం. ఇది ఇస్కీమిక్ స్ట్రోక్ కంటే తక్కువ సాధారణమైనప్పటికీ అత్యంత ప్రమాదకరమైనది.
ప్రమాద కారకాలు, లక్షణాలు
40 ఏళ్లు పైబడిన వారిలో ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు,అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ. కుటుంబ చరిత్రలో ఎవరికైనా స్ట్రోక్ ఉంటే ఇతరులకు కూడా వచ్చే అవకాశం పెరుగుతుంది.
అనారోగ్యకరమైన జీవనశైలి, ఊబకాయం, ధూమపానం, అధిక మద్యపానం కూడా ప్రమాదాన్ని పెంచుతాయి. స్ట్రోక్ లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే ట్రీట్మెంట్ అంత ప్రభావవంతంగా ఉంటుంది. దీనికోసం BE FAST అనే పదాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం
B (Balance): నడకలో తడబడటం, బ్యాలెన్స్ కోల్పోవడం.
E (Eyes): చూపు మందగించడం.
F (Face): ముఖం ఒకవైపు వాలిపోవడం, నవ్వమని అడిగితే ఒకవైపు పెదవి కదలకపోవడం.
A (Arms): ఒక చేయి లేదా కాలు బలహీనపడటం.
S (Speech): మాటలు తడబడటం, ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం.
T (Time): ఈ లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే హాస్పిటల్ వెళ్లాలి.
ఈ మార్పులు తప్పనిసరి
స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి జీవనశైలిలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడం చాలా అవసరం
-ఉప్పు, కొవ్వు, చక్కెర తక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తినండి.
-ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.
-సరైన శరీర బరువును పాటించండి.
-ధూమపానం, మద్యపానం పూర్తిగా మానేయండి.
-రోజూ 7-8 గంటల పాటు తగినంత నిద్రపోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications