Latest Updates
-
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.?
ఎండలో కొబ్బరి బొండాలు తాగుతున్నారా? ఇంతటి ప్రమాదకర సమస్యలు వస్తాయని తెలుసా?
ఎండాకాలం వచ్చేసింది. ఉదయం చలి, మధ్యాహ్నం ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది మధ్యాహ్నం కొబ్బరి బొండాలు తాగుతారు. అయితే ఎండలో కొబ్బరి బొండాలు తాగడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి?, ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మీకు ఎవరూ చెప్పి ఉండరు. ఈ స్టోరీలో మేము ఆ విషయాలన్నీ మీకోసం వివరించాము. వాటిని పూర్తిగా చదివి, పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఎండలో కొబ్బరి బొండాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు
శరీరానికి చల్లదనం
ఎండలో కొబ్బరి బొండాలు తాగడం వలన శరీరానికి తక్షణ చల్లదనం అందుతుంది. అలాగే శరీరంలోని వేడిని ఇది తగ్గిస్తుంది. దీని వల్ల శరీరంలోని నీరు త్వరగా ఇంకిపోకుండా ఉంటుంది. అలాగే చాలాసేపు వరకు దాహాన్ని నివారించుకోవచ్చు.

డీహైడ్రేషన్ బారి నుంచి రక్షిస్తుంది
కొబ్బరి బోండాల్లో ఎలక్ట్రోలైట్స్, ఇతర ముఖ్యమైన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. అలాగే డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఎండదెబ్బ తగలకుండా రక్షిస్తుంది.
జీర్ణక్రియకు మంచిది
కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అలాగే మలబద్ధకం సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
రోగనిరోధక శక్తిని పెంచడం
కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఇది విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది.
చర్మ ఆరోగ్యానికి మంచిది
కొబ్బరి నీరు చర్మాన్ని తేమగా ఉంచడానికి మరియు మొటిమలను నివారించడానికి సహాయపడుతుంది. అందుకే కొబ్బరి నీళ్లు తాగడం వలన శరీరానికి కావాల్సిన తేమ అందుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా, యవ్వనంగా కనిపిస్తుంది.
కొబ్బరి బొండాలు తాగడం వలన కలిగే సమస్యలు:
అధిక చక్కెర:
కొబ్బరి నీటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కిడ్నీ సమస్యలు:
కొబ్బరి నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది, కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. ఇందులోని పొటాషియం కారణంగా ఆ సమస్యలు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. కొబ్బరి నీటికి కొంతమందికి అలెర్జీ ప్రతిచర్యలు ఉండవచ్చు. అందుకే కొబ్బరి నీరు అంటే అలర్జీ ఉన్న వ్యక్తులు వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications