Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Milk: వీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తాగకూడదు..విషంతో సమానమే!
పాలు సంపూర్ణ ఆహారం, ఆరోగ్యానికి అమృతం అని నిపుణులు చెబుతుంటారు. కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్ డి వంటి అమోఘమైన పోషకాలతో నిండిన పాలు మన ఎముకలను ఉక్కులా మార్చడంలో, కండరాల నిర్మాణంలో, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. చిన్నపిల్లల నుండి పండు ముసలి వాళ్ల వరకు పాలు మన జీవితంలో ఒక భాగం. కొంతమంది రోజుకి కనీసం 1 గ్లాసు పాలు అయినా తాగుతుంటారు. అయితే పాలు అందరికీ మేలు చేయదు. కొందరికి పాలు తాగడం వల్ల మేలు జరగకపోగా, తీవ్రమైన నష్టం జరిగే ప్రమాదం ఉంది. మీ శరీరంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు లేదా సమస్యలు ఉన్నప్పుడు పాలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాలను ఎవరు దూరం పెట్టాలో ఇక్కడ చూడండి.
లాక్టోస్ అసహనం
ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య. పాలలోని సహజ చక్కెర అయిన లాక్టోస్ ను జీర్ణం చేయడానికి అవసరమైన లాక్టేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీని ఫలితంగా పాలు తాగిన వెంటనే లేదా కాసేపటికి కడుపు ఉబ్బరం, గ్యాస్, భరించలేని కడుపు నొప్పి, విరేచనాలు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

పాల అలెర్జీ
లాక్టోస్ అసహనానికి, పాల అలెర్జీకి చాలా తేడా ఉంది. పాలలోని కేసిన్, వే వంటి ప్రోటీన్లకు శరీరం తీవ్రంగా స్పందించినప్పుడు అలెర్జీ వస్తుంది. దీని లక్షణాలు చర్మంపై దద్దుర్లు, దురద, పెదాలు లేదా ముఖం వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.
అజీర్తి, గ్యాస్ సమస్యలు
మీకు తరచుగా అసిడిటీ, గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు వేధిస్తుంటే ముఖ్యంగా రాత్రిపూట పాలు తాగే అలవాటును మానుకోవాలి. పాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. రాత్రిపూట జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది కాబట్టి పాలు సరిగా అరగక ఉదయం లేచేసరికి కడుపు బరువుగా, గ్యాస్ తో నిండినట్లు అనిపిస్తుంది.
కాలేయ సమస్యలు
ఫ్యాటీ లివర్ లేదా కాలేయ వాపు వంటి సమస్యలతో బాధపడేవాళ్లు పాలను చాలా పరిమితంగా తీసుకోవాలి లేదా పూర్తిగా మానేయాలి. బలహీనంగా ఉన్న కాలేయం పాలలోని కొవ్వులు, ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. ఇది కాలేయంపై భారాన్ని పెంచి, సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
గుండె జబ్బులున్న వారు
గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు, అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు పూర్తి కొవ్వు పాలు (ఫుల్ క్రీమ్ మిల్క్), జున్ను వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిలో ఉండే సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత అధికం చేస్తాయి. పాలు నిస్సందేహంగా పోషకాల గని. కానీ పైన చెప్పిన సమస్యలు ఏవైనా మీకు ఉంటే,పాలు తాగే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించి, వారి సలహా మేరకు నడుచుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications