Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మంచంపై కూర్చొని అన్నం తింటున్నారా?
మంచం మీద కూర్చొని తినొద్దని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయినా చాలా మంది మాట వినకుండా మంచం మీదే కూర్చొని తినేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతుంటారు. అలాగే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. సుఖంగా ఉండాలని మీరు మంచంపైన కూర్చొని అన్నం తింటే, అది ఆరోగ్యానికి తీరని హాని చేస్తుందని శాస్త్రీయ నిపుణులు చెబుతున్నారు. అసలు మంచంపై కూర్చొని తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఏ విధమై రోగాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియపై ప్రభావం
మంచంపై కూర్చొని అన్నం తినడం వల్ల రిలాక్స్డ్ పొజిషన్ ఏర్పడుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇలా తినడం వల్ల కొన్నిసార్లు కడుపులో భారంగా మారుతుంది. అలాగే యాసిడ్ రిప్లక్స్‌కు కారణం అవుతుంది. అలాగే తిన్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదు కూడా. అందుకే మంచంపైన కూర్చొని తినకూడదు. ఒకవేళ తినాలనుకుంటే సరైన భంగిమలో కూర్చొని తినడం మంచిది.

నిద్రపై ప్రభావం
మంచంపై కూర్చొని తినడం వల్ల నిద్రపై కూడా ప్రభావం పడుతుంది. సాధారణంగా మన మైండ్ తరచుగా చేసే పనులకు అలవాటు అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మంచంపై కూర్చొని తింటే కచ్చితంగా మీ మైండ్ అక్కడ కూర్చొని తినడానికి అలవాటు పడుతుంది. తద్వారా మీరు దానిపై పడుకోలేరు. అలాగే పడుకునేటప్పుడు నిద్రపట్టదు కూడా. అందుకే మంచంపై కూర్చొని మాత్రం తినకండి. ఇది మీ ఆరోగ్యంతో పాటు నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది.
ఉభయకాయం
సాధారణంగా మంచంపై కూర్చొని తినడం వల్ల కాస్త రిలాక్స్డ్‌గా కూర్చుంటాము. అలాగే పక్కన ఫోన్ చూస్తుండడం లేదా టీవీ చూస్తూ తినడం వల్ల ఎంత తింటామో తెలియకుండానే తినేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వేగంగా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా ఉభయకాయం వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
అలర్జీ వచ్చే ప్రమాదం
మంచంపై కూర్చొని తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా అన్నం తిన్నా కొన్ని కొన్ని చిన్న రేణువులు మంచమ్పు పడిపోతాయి. వాటిని క్లీన్ చేసినా అవి మంచంలోనే ఇరుక్కుపోతాయి. దీని కారణంగా మంచంపై ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంది. ఆ మంచంపై మనం పడుకునేటప్పుడు కచ్చితంగా అది మన చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అలాగే మంచంపై అన్నం మెతుకులు ఉండడం వల్ల క్రీములు కీటకాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మంచంపై కూర్చొని అన్నం తినకూడదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications