Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Chia seeds: చియా సీడ్స్ ఇలా తింటే ప్రమాదం!..షాకింగ్ నిజం చెప్పన డాక్టర్
చియా సీడ్స్ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని చాలామంది వాటిని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వీటి వాడకం పెరుగుతుంది. వీటిని నీటిలో నానబెట్టి తాగడం, పాలు లేదా పెరుగులో కలుపుకొని లేదా ఓట్స్ లో నానబెట్టి తినడం వంటివి చేస్తున్నారు. ప్రకృతి అందించిన మల్టీవిటమిన్ పిల్ గా దీనిని అభవిర్ణిస్తారు. వాస్తవానికి చియా సీడ్స్ ఒముగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలకు మంచి మూలం. గుండె ఆరోగ్యానికి, జీర్ణ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉండటానికి, ఎముకల బలానికి,శరీరానికి శక్తిని అందించడానికి చియా సీడ్స్ సహాయపడతాయని డాక్టర్లు కూడా చెబుతుంటారు.
చియా సీడ్స్ తినేవాళ్లకు అమెరికాకు చెందిన డాక్టర్ జోసెఫ్ సల్హాబ్ షాకింగ్ విషయం చెప్పారు.' ది స్టమక్ డాక్టర్(thestomachdoc)'అనే పేరుతో ఉన్న తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. చియా సీడ్స్ నేరుగా తింటే హాస్పిటల్ పాలవ్వడం గ్యారెంటీ అని దీనికి సంబంధించిన ఓ సంఘటనను ఆయన వీడియోలో షేర్ చేశారు.

ఓ వ్యక్తి చియా సీడ్స్ ని నేరుగా తిన్నాడని, ఆ తర్వాత అవి అతడి శరీరంలోని ఫుడ్ పైప్ లో స్ట్రక్ అయ్యాయని,దీంతో సర్జరీ చేసి అతడి ఫుడ్ పైపులో నుంచి వాటిని తొలగించినట్లు డాక్టర్ జోసెఫ్ చెప్పారు. చియా సీడ్స్ ను ఎప్పుడూ కూడా నేరుగా తినకూడదని డాక్టర్ జోసెఫ్ సూచించారు. అలా తింటే అవి జీర్ణం కావడం కష్టమతుందని.. మీ శరరీరం నుంచి అవి నీటిని లాగడానికి ప్రయత్నిస్తాయని..దీంతో ఉబ్బరం, కడుపులో అసౌకర్యం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్నారు. కాబట్టి నానబెట్టి మాత్రమే చియా సీడ్స్ తీసుకోవాలని తెలిపారు. చియా గింజలు నానబెట్టడం వల్ల అవి నీటిని పీల్చుకుని జెల్ లాంటి పూతను ఏర్పరుస్తాయి..అప్పుడు వాటిని తీసుకోవడం ద్వారా వాటి ద్వారా లభించే అన్ని ప్రయోజనాలను శరీరం పొందుతుంది, జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉంటుంది.
ఎంత మోతాదులో వాడాలి
సాధారణం రోజుకి 1-2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి తీసుకునేవాళ్లు తక్కువ మోతాదుతో ప్రారంభించి నెమ్మదిగా పెంచుకోవాలి, చియా సీడ్స్ తీసుకున్నప్పుడు తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం అని,ఎందుకంటే ఇవి నీటిని బాగా పీల్చుకుంటాయని చెబుతున్నారు.
బరువు తగ్గాలి అనుకునేవాళ్లు వీటిని తప్పనిసరిగా తీసుకోవడం మంచిది.ఎందుకంటే ఫైబర్, ప్రొటీన్ ఉండటం వల్ల ఇవి ఆకలిని నియంత్రిస్తాయి..దీంతో అతిగా తినడం తగ్గిపోతుంది ఫలితంగా బరువు తగ్గొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications