Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బొప్పాయి తింటున్నారా?.. ఇది తెలుసుకోకపోతే క్యాన్సర్ బారిన పడడం ఖాయం!
బొప్పాయి.. మన దేశంలో విరివిగా దొరికే పండు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరూ దీనిని ఇష్టంగా తింటారు. ఇవి మెత్తగా, తియ్యగా, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే విధంగా ఉంటాయి. దీంతో పాటు దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో వైద్యులు సైతం బొప్పాయిని తినమని సూచిస్తూ ఉంటారు.
అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే బొప్పాయి కారణంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిని తినడం వల్ల.. క్యాన్సర్ బారిన పడే అవకాశముంది. దానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ కథనంలో పొందుపరచాము పూర్తిగా చదవండి
బొప్పాయితో కలిగే ప్రయోజనాలు:
సహజసిద్ధంగా పండే బొప్పాయి పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఎంజైమ్ పపైన్, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

సహజసిద్ధమైన బొప్పాయి తినడం వల్ల.. జీర్ణక్రియ మెరుగు అవుతుంది. మలబద్ధం నివారించబడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అధిక రక్తపోటును ఈ బొప్పాయి నివారించగలుగుతుంది. దీని ద్వారా గుండెకు సంబంధించిన రోగాలు కూడా దూరమవుతాయి.
బొప్పాయి ఆరోగ్యానికి ఎందుకు మంచి కాదు:
పైన పేర్కొనబడిన ప్రయోజనాలు అన్నీ, సహజ సిద్ధమైన బొప్పాయిలోనే దొరుకుతాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో దొరికే బొప్పాయిలన్నీ.. కాల్షియం కార్బైడ్ ద్వారా పండిస్తున్నారు. పచ్చి బొప్పాయి కాయలను తెంపి, వాటిని కాల్షియం కార్బైడ్ అనే రసాయనం సహాయంతో పండిస్తున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తుంది. దీనిని భారతదేశ ప్రభుత్వం నిషేధించింది కూడా.
కాల్షియం కార్బైడ్‌తో ప్రమాదాలు:
కాల్షియం కార్బైడ్ అనేది ప్రమాదకరమైన కెమికల్. ఈ రసాయనం తేమకు గురైనప్పుడు ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. దీంతో పాటు కంటి సమస్యలు, చర్మ సమస్యలు తలెత్తే అవకాశముంది. దీని కారణంగా కడుపులో మంట, తరచుగా దాహం వేయడం, బలహీనత, మింగడంలో ఇబ్బంది, వాంతులు వంటి సమస్యలు తలెత్తున్నాయి.
ఎలాంటి బొప్పాయి తినాలి?
బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ, ఆ బొప్పాయి సహజసిద్ధంగా పండిందా లేదా అనేది ముఖ్యం. సహజసిద్ధమైన బొప్పాయిని తీసుకోవడం ద్వారా మీరు పైన పేర్కొనబడిన ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. కృత్రిమంగా పండించిన బొప్పాయిపై పసుపు ఆకు పచ్చ రంగులుంటాయి. అలాంటి వాటిని గుర్తించి, తీసుకోకపోవడమే ఉత్తమం. బొప్పాయి పట్టుకొని నొక్కినపుడు అది లోపలికి వెళ్తే.. అది సహజసిద్ధమైనదిగా గుర్తించాలి. లేని యెడల అది కృత్రిమంగా పండించిందేనని గ్రహించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ.. బొప్పాయిని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications