Latest Updates
-
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే!
మీ జుట్టు వేగంగా రాలిపోతుందా? అయితే మీకు ఆ లోపం ఉన్నట్లే.. వెంటనే ఈ పని చేయండి!
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మనిషిలోని పోషకాలన్నీ పుష్కలంగా ఉండాలి. పోషకాలు ఎక్కువగా ఉంటేనే మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. అలాంటి పోషకాల్లో అత్యంత ముఖ్యమైనది జింక్ కూడా ఒకటి. ఈ జింక్ మూలకం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సరైన విధానంలో జీవించేందుకు ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా పిల్లల పెరుగుదలలో, మరియు పెద్దల్లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపయోగపడతాయి. కానీ చాలా మందిని దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. దీని ప్రయోజనాలను గుర్తించకుండా, జింక్ లోపం ఉన్నా అలానే జీవిస్తూ రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే జింక్ లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి? జింక్ ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జింక్ లోపంతో వచ్చే సమస్యలు
జింక్ సరిపడా లేకపోతే శరీరంలో అనేక మార్పులు కనిపించవచ్చు. ముఖ్యంగా:
చర్మ సమస్యలు: తరచూ దద్దుర్లు, చర్మం పొడిబారడం, చర్మంపై చిన్న గాయాలు రావడం
జుట్టు సమస్యలు: జుట్టు బలహీనంగా మారి, వేగంగా రాలిపోవడం
గోళ్లు పీలిపోవడం: గోళ్లు విరిగిపోవడం లేదా ముడుచుకు పోవడం
జీర్ణ సమస్యలు: పేగుల పని తీరులో మార్పులు, విరేచనాలు
మనోవ్యవస్థ మార్పులు: మానసిక స్థితిలో అసహజ మార్పులు, అలసట, అస్థిరత

జింక్ లోపం ఎఫెక్ట్ ఎంత ఉంటుంది?
వైద్య నిపుణుల ప్రకారం, జింక్ లోపం ఉన్నవారికి రోగనిరోధక శక్తి బలహీనమవుతుంది. శరీరం సులభంగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంది. చిన్న గాయాలైనా కూడా త్వరగా మానడానికి సమయం పడుతుంది. పిల్లల్లో ఇది పెరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. అలాగే పెద్దలలో హార్మోన్ల సమతుల్యతను భంగం కలిగిస్తుంది. ఇది సంతాన సంబంధిత సమస్యలకూ కారణమవుతుంది.
జింక్ అధికంగా ఉండే ఆహారాలు
శరీరానికి అవసరమైన జింక్‌ను సహజంగా ఆహార ద్వారానే పొందవచ్చు. అందులో ముఖ్యమైనవి:
మాంసాహార పదార్థాలు: చికెన్, మటన్, చేపలు - వీటిలో జింక్ మోతాదులో ఉంటుంది. వారానికి 2-3 సార్లు తినడం మంచిది.
పాల పదార్థాలు: పాలు, పెరుగు, చీజ్ లాంటి డెయిరీ ఉత్పత్తులు
గుడ్లు: ప్రతిరోజూ ఒక్కో గుడ్డు తినడం వల్ల జింక్ అవసరం తీరుతుంది
గింజలు: గుమ్మడికాయ గింజలు, సనగలు, బఠానీలు - ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తూ, జింక్‌ను సమృద్ధిగా అందిస్తాయి
తృణధాన్యాలు: జొన్న, రాగి, గోదుమ వంటి చిరుధాన్యాలు జింక్‌ను సహజంగా అందిస్తాయి
పిల్లల ఆరోగ్యానికి ప్రత్యేక జాగ్రత్తలు
పిల్లలలో జింక్ లోపాన్ని నివారించేందుకు రోజూ గ్లాసు పాలు తాగించాలి. వారానికి కొన్ని రోజులు పెరుగన్నం ఇవ్వడం మంచిది. అలాగే వారు తినే ఆహారంలో చిక్కుళ్ళు ధాన్యాలు, నట్‌లు, గింజలు ఉండేలా చూడాలి. ఇది వారి ఎదుగుదలకు తోడ్పడుతుంది.
చివరగా..
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండేందుకు మనం జింక్ తీసుకోవడం అలవాటు చేసుకుందాం. శరీరంలో చిన్న పోషకాల లోపం అనుకోకుండా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. జింక్ వాటిలో ఒకటి. ఇది చర్మం నుంచి గుండె వరకు, జీర్ణవ్యవస్థ నుంచి మానసిక స్థితి వరకు ప్రభావం చూపగలదు. కనుక సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా జింక్ అవసరాన్ని తీర్చాలి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, జీవితం మొత్తం ఆనందంగా ఉండేలా చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications