Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
కేక్స్ ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
కేక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్న చిన్న బర్త్ డే సెలెబ్రేషన్స్ నుంచి పెద్ద పెద్ద పార్టీల వరకు కేక్స్ లేనిదే పని జరగదు. అయితే కేక్స్ తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు పలు హెచ్చరికలు జారీ చేసింది. అసలు కేక్స్ తినొచ్చా? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాం..
శారీరక సమస్యలు:
సాధారణంగా కేక్స్ తయారు చేసేటప్పుడు అవి అందంగా కనిపించడానికి తయారీదారులు పలు రకాల ఆర్టిఫిషయల్ కలర్స్ వాడుతూ ఉంటారు. అయితే కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ విభాగం ఆ రాష్ట్రంలోని పలు బేకరీల్లోని కేక్స్ పరిశీలిస్తే.. వాటిలో ఈ ఆర్టిఫిషయల్ కలర్స్ అధిక మొత్తంలో ఉన్నట్లు తేలింది. మోతాదుకు మించి వాటిని వాడడంతో.. అవి తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తాయని పేర్కొంది. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో ఈ ముప్పు అధికంగా ఉంటుందని వెల్లడించింది.

ఎలాంటి సమస్యలు వస్తాయి?:
బొగ్గుతారు నుంచి తయారు చేసే ఈ ఆర్టిఫిషల్ కలర్స్.. చాలా విషపూరితమైనవని పలువురు నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చర్మం వాపు, దద్దుర్లు, శ్వాస సమస్యలు వస్తాయి ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే విరేచనాలు, వికారం, కంటిచూపు సమస్యలు, కాలేయ సమస్య, థైరాయిడ్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెప్తున్నారు. ఉబ్బసం, ఆస్తమా ఉన్న వారిపై ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే పిల్లల్లో హైపర్ యాక్టీవ్, న్యూరో బిహేవియరల్ కు సంబంధించిన సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.
పరిష్కారం ఏమిటి?
ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆర్టిఫిషల్ కలర్స్ కలిపిన ఫుడ్ తీసుకోవడం ఎప్పటికీ ప్రమాదమే. అందుకే వాటి నుంచి దూరంగా ఉండడంతో పాటు పిల్లలను కూడా వాటి దరి చేరనివ్వొద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. కేక్స్ తినాలనుకునేటపుడు, సహజమైన ఫుడ్ కలర్స్ కలిపిన కాక్స్ తినాలని, లేదా సహజమైన ఫుడ్ కలర్స్ తో ఇంట్లోనే కేక్ తయారు చేసుకొని తినొచ్చని చెబుతున్నారు. ఆర్టిఫిషల్ కలర్స్ కలిపిన వాటిని తిని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications