Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
వేగంగా భోజనం చేసేస్తున్నారా?.. అయితే మీకు ఈ రోగాలు రావడం పక్కా.. రాకూడదంటే ఏం చేయాలో తెలుసా?
మనవి ఉరుకుల పరుగుల జీవితం. డబ్బులు సంపాదించడం పిల్లల కోసం కూడగట్టడం కోసం కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే తీరిక కూడా ప్రజలకు ఉండడం లేదు. ఉదయం త్వరగా ఆఫీసుకు వెళ్ళాలి. అలాగే మధ్యాహ్నం ఆఫీసులో త్వరగా భోజనం చేసేసి మళ్ళీ పనికి వెళ్ళాలి. రాత్రి తొందరగా పడుకుంటే మళ్ళీ ఉదయం పనికి వెళ్ళాలి. ఎక్కడ చూసినా హడావిడిగా తినడమే.
ఇలా హాడావిడిగా భోజనం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది కారణమవుతుందని పేర్కొంటున్నారు. అయితే ఈ స్టోరీలో హడావిడిగా భోజనం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అనేది తెలుసుకుందాం.

గ్యాస్, ఉబ్బరం:
ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య గ్యాస్, అలాగే ఉబ్బరం. మనం సమయానికి భోజనం చేయకపోయినా ఈ గ్యాస్ సమస్య వెంటాడుతుంది. అలాగే చాలా వేగంగా పెద్ద పెద్ద ముద్దలను తినడం వల్ల కూడా ఈ గ్యాస్ సమస్య ఏర్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల కడుపులో గాలి, ఆహరం ఒకేసారి వెళ్తాయని, అవి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలకు దారి తీస్తాయని పేర్కొంటున్నారు. కాబట్టి మీకు హాడావిడిగా వేంగంగా తినే అలవాటు ఉంటే తక్షణమే దాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు.
వేగంగా బరువు పెరగడం..
ఈ మధ్య కాలంలో యువతను అధికంగా ఇబ్బంది పెడుతున్న సమస్య అధికంగా బరువు పెరగడం. మనం అవలంబిస్తున్న జీవన విధానం, తింటున్న ఆహరం కారణంగా సులభంగా ప్రతి ఒక్కరూ ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా బరువు పెరుగుతున్నారు. ఇది భవిష్యత్తులో తీవ్రమైన సమస్యగా మారి గుండెపోటు వంటి సమస్యలకు కూడా దారి తీస్తుంది.
అయితే హడావిడిగా వేగంగా భోజనం చేయడం వల్ల కూడా అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంది. సైన్స్ ప్రకారం మనం ఆహరం తిన్నప్పుడు.. తిన్న 20 నిమిషాల్లో మన కడుపు నిండినట్లు మనకు మెదడు సంకేతం ఇస్తుంది. అయితే వేగంగా తింటే 20 నిమిషాల ముందే కడుపు నిండిందని సంకేతం వస్తుంది. దీని కారణంగా అధికంగా బరువు పెరుగుతారు. ఉభయకాయం వంటి సమస్యల బారిన పడతారు.
టైప్ 2 డయాబెటిస్
వేగంగా భోజనం చేయడం వల్ల శరీరంలోని రక్తంలో కూడా అదే స్థాయిలో షుగర్ శాతం పెరుగుతుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్‌కు కారణమవుతుంది. అందుకే వేగంగా భోజనం చేయాలనుకునే వారు తప్పనిసరిగా తమ అలవాటును మార్చుకోవాలి. దీని వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
జీర్ణక్రియ ఆటంకాలు..
భోజనం చేసే సమయంలో ఆహారాన్ని నమిలి తినాలి. అప్పుడే అది జీర్ణక్రియలో సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే వేగంగా తినడం వల్ల మనం ఆహారాన్ని సరిగ్గా నమలలేము. దీని వల్ల ఆహరం జీర్ణమయ్యే సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఉభయకాయం పెరగడం, గుండె సమస్యల బారిన పడడం వంటి ప్రమాదాలు ముంచుకొస్తాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. తెలుగు బోల్డ్ స్కై ఎలాంటి బాధ్యత వహించదు. మేము కేవలం సమాచారాన్ని మాత్రమే మీకు అందిస్తున్నాం. వీటిని పాటించేముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications